Essay writings
Singing
Painting
Rangoli etc
Only on Agril Rythu Bandhu schemes
*వారం రోజుల పాటు రైతుబంధు సంబురాలు*
రాష్ట్రవ్యాప్తంగా 3 వ తేదీ నుంచి వారం రోజులపాటు రైతుబంధు సంబురాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబురాలు కొనసాగనున్నాయి.
రైతు బంధు సంబరాల్లో భాగంగా ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో మొదలు పెట్టి… రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో ముంగింపు సంబరాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. సంబరాలను మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేపట్టాలని వెల్లడించారు. రైతు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందిస్తామన్నారు.
సాగు వైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. అలాంటి ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తుంచుకొని రైతుబంధు సంబరాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు.
*రైతుబంధు సంబురాలు ఎందుకంటే*
రైతుబంధు పంట పెట్టుబడి సాయంతో రైతన్నలకు మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారు. జనవరి 10వ తేదీ నాటికి రూ. 50 వేల కోట్లకు రైతుబంధు సాయం చేరనుంది. ఈ నేపథ్యంలో వేడుకలు జరపాలని పిలుపునిచ్చారు.
Please give your comments....!!!