Guruvu.In

Mana Ooru Mana Badi Program Selected School list of All Districts Phase 1

*🏵️మన ఊరు- మన బడికి ప్రత్యేక పోర్టల్‌*


 *త్వరలోనే అందుబాటులోకి..*

*దాతల విరాళాల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా*


 *సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు ఉద్దేశించిన ‘మన ఊరు- మన బడి’ పథకం* *కోసం పది రోజుల్లో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనున్నారు* *ఇందుకోసం ఐటీ శాఖ అధికారులు, టీసీఎస్‌ ప్రతినిధులతో విద్యాశాఖ చర్చించింది. పోర్టల్‌లో జిల్లాలు, మండలాల వారీగా పాఠశాలలు, అందులో అవసరమైన సౌకర్యాలు, వాటి ఫొటోలు, ఖర్చు తదితర వివరాలను అందుబాటులో ఉంచుతారు.


 ఒక్కో బడికి రెండు బ్యాంకు ఖాతాలను తెరవనున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాకమిటీ పేరిట ఖాతా ఉన్నప్పటికీ పథకం కింద వచ్చే నిధుల కోసం కొత్తగా ఒక బ్యాంకు ఖాతా తెరుస్తారు. ప్రవాస భారతీయులు, ఇతర దాతల విరాళాల కోసం మరో బ్యాంకు ఖాతా తెరవనున్నారు. దాతల విరాళాల కోసం తెరిచిన బ్యాంకు ఖాతాలను పాఠశాలల వారీగా పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. మొత్తం 12 రకాల పనులు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక పాఠశాలలో ఇప్పటికే 10 రకాల సౌకర్యాలు ఉంటే మిగిలిన రెండు పనులు మాత్రమే చేస్తారు. పాఠశాలల్లోని ఆట స్థలాలను క్రీడాశాఖ నిధులతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రానున్న 15 రోజుల్లో అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోని 9,123 పాఠశాలల్లో పనులను ఒకే రోజు ప్రారంభించనున్నారు.








*సమస్త హెడ్మాస్టర్ లకు గమనిక:*

*స్కూల్ లో మన ఊరు మన బడి క్రింద ముందుగా పూర్తి చేయవలసిన పనులు...*

1. *SMC కమిటీని అప్డేట్ చేయాలి.*

2. *పూర్వ విద్యార్థుల కమిటీని ఏర్పాటు చేయాలి.*

3. *కొత్తగా రెండు బ్యాంక్ అకౌంట్ లు ఓపెన్ చేయాలి* 
*ఇవి అందుబాటులో ఉన్న ఏదైనా జాతీయ బ్యాంక్ లో ఓపెన్ చేయాలి.*

✍️SMC చైర్మన్, 
సర్పంచ్ ( మున్సిపాలిటీ లో ఛైర్ పర్సన్ )
 హెడ్మాస్టర్ & 
ఇంజినీర్ 
*(మొత్తం నలుగురితో )* లతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
*ఈ స్కీం కింద ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఇందులో జమ చేయాలి.*

✍️ SMC చైర్మన్, 
హెడ్మాస్టర్,
ఇద్దరు పూర్వ విద్యార్థులు
*(మొత్తం నలుగురితో)* లతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి
*దాతల ద్వారా సేకరించిన నిధులు ఈ అకౌంట్ లో జమ చేయాలి*

4. *SMC , సర్పంచ్ & ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకొని స్కీం కింద రూపొందించిన 12 అంశాలలో మన పాఠశాల అవసరాలను నిర్ణయించుకొని తీర్మానం చేసి కలెక్టర్ అప్రూవల్ కు పంపించాలి.*

 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts