Guruvu.In

READ Library Week Day by Day Schedule

*🔰READ*

*రీడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా అభినందనలు.💐*

*కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతుండడం అభినందనీయం.*
*ఇదే స్ఫూర్తిని  కార్యక్రమం పూర్తయ్యేంతవరకు కొనసాగించవలసిందిగా కోరుచున్నాము.*
*అలాగే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి,ధారాళంగా చదివే దిశగా కృషిచేయాలి.*

*💥ఇందులో భాగంగా తేది 14-02-2022 నుండి 21-02-2022 వరకు గ్రంథాలయ వారోత్సవాలు ఈ క్రింద సూచించిన విధంగా  ఘనంగా నిర్వహించుకుందాం.*

*♦️1వ, రోజు (14-02-22)*

*పాఠశాలలోని గ్రంథాలయ పుస్తక ప్రదర్శన-  విద్యార్థులను సందర్శింపజేయుట..*

*♦️2వ, రోజు(15-02-22)*

*ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించి గ్రంథాలయ ప్రాధాన్యత గురించి మాట్లాడించుట (తల్లిదండ్రులు, విశ్రాంత ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సాహితీవేత్తలు, సాహితీ సంస్థల బాధ్యులు మొదలైనవారు)*

*♦️3వ,రోజు(16-02-22)*


*పాఠశాల గ్రంథాలయాన్ని బలోపేతం చేయడానికి దాతలను గుర్తించి బడికి ఆహ్వానించుట- పుస్తక సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించుట.*

*♦️4వ,రోజు(17-02-22)*

*పాత వార్తాపత్రికలు, మ్యాగజైన్లు,మరియు  అంతర్జాలం నుండి కథలు, పజిల్స్ మొదలగు వాటిని సేకరించి రీడింగ్ కార్డులను పిల్లలతో తయారు చేయించుట.*

*♦️5వ,రోజు(18-02-2022)*

*బడిలో మాతృ భాష ప్రాధాన్యత  గురించి వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించుట.*

*♦️6వ,రోజు(19-02-22)*

*పట్టణ పోటీలలో భాగంగా పద్యపఠన పోటీలు నిర్వహించుట.*

*♦️7వ,రోజు(21-02-22)*

*👉మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుట.*

*👉పిల్లలతో రూపొందింప చేసిన పఠన కార్డులను, సేకరించిన గ్రంథాలను, పుస్తకాలను ప్రదర్శించాలి.మరియు పిల్లలు రాసిన వ్యాస రచన, గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేయుట*

*👉మాతృ భాష ప్రాధాన్యత మీద ప్రముఖులతో ప్రసంగాలు ఇప్పించుట.*
 
*👉వ్యాసరచన, ఉపన్యాస చిత్రలేఖన,పద్య పఠన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించుట.*

*పైన తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారాన్ని కలిగించాలి.*

*🌺#మనబాధ్యత#*

*🔹మండలస్థాయి, జిల్లాస్థాయి కోర్ టీం సభ్యులు, మండలస్థాయి అధికారులు జిల్లాస్థాయి అధికారులు విస్తృతంగా పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపాలి.*

*🔹బాగా జరుగుచున్న చోట్ల ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను అభినందించాలి.*

*🔹రాష్ట్ర స్థాయి అధికారులు కూడా పర్యటిస్తారు.*

*🔹జిల్లా స్థాయిలో గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణ గురించి డాక్యుమెంట్ రూపొందించి రాష్ట్రస్థాయికి అందించాలి.*

*🔹దీనిలో ఐదు నిమిషాల నిడివి గల వీడియో, పది పేజీలకు మించని నివేదికను సమర్పించాలి.*

*🔹దీనిలో నిర్వహణ తీరుతెన్నులు, వీటికి సంబంధించిన ఫోటోలు, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, విద్యార్థుల అభిప్రాయాలు,మరియు ప్రత్యేక అంశాల ప్రస్తావన తదితర అంశాలు ఉండాలి.*

    సువర్ణ వినాయక్,
రాష్ట్ర నోడల్ అధికారి ,
     రీడ్ కార్యక్రమం,
    తెలంగాణ రాష్ట్రం.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts