Type Here to Get Search Results !

SSC Special Classes Day to Day Schedule Dist Siricilla, Siddipet

జిల్లా విద్యాశాఖాధికారి ( FAC ) మరియు చైర్మన్ , జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు , రాజన్న సిరిసిల్ల గారి కార్య నిర్వహణ ఉత్తర్వులు . 

సమక్షము : శ్రీ డి . రాధా కిషన్ , ఎం.ఎస్.సి. , ఎం.ఇడి . , ఎం.ఫిల్ . , పి.హెచ్ . 

ప్రో.నెం .: 6 / DCEB / 2021 . తేది : 02-02-2022 .

 విషయము : - పాఠశాల విద్యా , 2021-22 విద్యా సంవత్సరము 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు , రోజువారీ పరీక్షలకు సంబంధించిన 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ గురించి .

 xxx రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సమస్త ప్రభుత్వ / జిల్లా పరిషత్ / కె.జి.బి.వి. / ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించునది ఏమనగా 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు , రోజువారీ పరీక్షలకు సంబంధించిన 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక తేది : 03-02-2022 నుండి 31-03-2022 వరకు దిగువ తెలిపిన సూచనల ప్రకారము నిర్వహించవలెను . 

● ఈ 45 రోజుల ప్రత్యేక తరగతుల ప్రణాళికలోని అంశాలను అమలు పరుస్తూ మీ సానుకూల పరిస్థితులను అనుసరించి మరిన్ని అంశాలను జోడించుకోవచ్చును .

 • 10 వ తరగతి విద్యార్థులకు సూచించిన తేదీలలో తెలిపిన సబ్జెక్టులలో సా ॥ 4:00 గం॥ల నుండి 5:00 గం॥ల వరకు సబ్జెక్టు టీచర్ ఆధ్వర్యములో స్టడిఅవర్ నిర్వహించవలెను . 

• తదుపరి రోజు స్టడీ అవర్లో చదివిన పాఠ్యంశాలలో సబ్జెక్ట్ టీచర్ తన రెగ్యులర్ పీరియడ్లో పరీక్ష నిర్వహించి వాల్యువేషన్ చేసి విద్యార్థులకు అందించి తగు సూచనలు చేయవలెను . 

• ప్రత్యేక తరగతుల నిర్వహణకు సంబంధించి తల్లిదండ్రుల సమావేశము ఏర్పాటు చేసి , విద్యార్థుల ప్రగతి గురించి తెలియజేయగలరు . 

• ప్రదానోపాధ్యాయులు విధిగా స్టడీ అవర్స్ మరియు పరీక్ష నిర్వహణను మానిటర్ చేయవలెను . కోవిడ్ సమయము కనుక తగు జాగ్రత్తలు తీసుకొని తరగతులను నిర్వహించవలసినదిగా 

● ap 08/02/28 జిల్లా విద్యాశాఖాధికారి ( FAC ) & చైర్మన్ , జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు , రాజన్న సిరిసిల్ల . 

దీని ప్రతి 1. జిల్లాలోని సమస్త ప్రభుత్వ / జిల్లా పరిషత్ / కె.జి.బి.వి. / ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు . 2. జిల్లాలోని సమస్త మండల విద్యాధికారులకు .

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.