Guruvu.In

Utilisation of School Grants Details in Telugu

పాఠశాల గ్రాంట్ లు ఏ విధంగా వాడుకోవాలి ? దేనికి ఎంత వాడుకోవాలి ? ఆడిట్ లో దేనికి ఎంత చూపించాలి ? ఆడిట్ లో ఏమేమి చూపించాలి ? విధి విధానాలు తెలుగులో....

గతంలో పాఠశాల గ్రాంట్ వేర్వేరు గా వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని కలిపి ఒకే గ్రాంట్ గా వస్తుంది. అయితే వీటిని ఎలా ఖర్చు పెట్టాలి ? కొన్నింటికి తప్పని సరిగా ఖర్చు పెట్టేవి కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే...

దాదాపు గా అన్ని పాఠశాల లకు సంవత్సరానికి 25,000 రూపాయలు రెండు విడత లుగా జమ అయ్యాయి.వీటిలో ఖచ్చితంగా ఖర్చు చేయవలసినవి ( ఆడిట్ లో ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది) అవి...

ఈ లెక్కలు పాఠశాల గ్రాంట్ 25,000 లకు చూపించాం.

ఖచ్చితమైనవి మరియు సాధారణ మైనవి

1. కరెంట్ బిల్ నెలకు 350 చొప్పున మొత్తం = 4,200/-
2. ఆన్ లైన్ బిల్ = 2,000 నుండి 2,500 వరకు,
3. శుచి శుభ్రత నెలకు 500 చొప్పున మొత్తం = 5,500/- ( సబ్బులు, లిక్విడ్ సోప్, ఫినాయిల్, ఆసిడ్ )
4. మిడ్ డే మీల్స్ బిల్, నెలవారీ రిపోర్ట్స్, Xerox నెలకు 150 చొప్పున మొత్తం= 1,650/-
5. ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు రిజిస్టర్ లు, MDM రిజిష్టర్ లు, చాక్ పీస్ లు= 2,000/-
5. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఖర్చులు = 2,000/-
6. బడి బాట = 1,000/-
7. Annual డే = 2,000/-

మొత్తము: 20,850/-

అదనపు ఖర్చులు:

1. ఆట వస్తువులు
2. లాబ్ వస్తువులు
3. లైబ్రరీ పుస్తకాలు
4. రేడియో, టీవీ, ఫ్యాన్, కుర్చీ లు, బల్లలు,
5. ఫర్నీచర్
6. మైనర్ రిపైర్స్ ( కిటికీలు, స్విచ్, ఫ్యాన్ రీపైర్స్, etc)
7. సున్నం, పెయింటింగ్

ముఖ్యమైన గమనిక:

1. పాఠశాల గ్రాంట్ లను ఒకేసారి డ్రా చేయకూడదు. వేర్వేరు రోజుల్లో డ్రా చేయాలి.
2. గ్రాంట్ ను ప్రధానోపాధ్యాయులు నేరుగా క్యాష్ డ్రా చేయకూడదు.
3. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు గ్రాంట్ రాకముందు ఖర్చు చేస్తే ఆ డబ్బును ప్రధానోపాధ్యాయుల గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డ్రా చేయాలి. ఇది టాక్స్ లో చూపించాల్సిన అవసరం లేదు.
4. ప్రధానోపాధ్యాయుల గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇష్టం లేకపోతే సంభందిత వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఉదా: బుక్ డిపో, Xerox సెంటర్ వారికి
5. గ్రాంట్ ను ప్రధానోపాధ్యాయులు నేరుగా క్యాష్ డ్రా చేసినవారికి గతంలో షో కాజ్ నోటీసులు వచ్చాయి. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
6. పద్దతి ప్రకారం వారి వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన లేదా వారికి చెక్ లు డౌన్ ఇచ్చిన కూడా అవి అన్ని ఒకే తేదీల ఉండకూడదు.
7. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు గ్రాంట్ ను క్యాష్ withdraw చేయాలని భావిస్తే ఒక రోజు లో కేవలం రెండు వేల రూపాయలు చేయుటకు అనుమతి ఇస్తూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts