Dt:04.04.2022
*🗓️DAY-1️⃣3️⃣*
(3 వ తరగతి తెలుగు)
*11.తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది?
A: *జూన్ 2,2014*
2)👉తెలంగాణ భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది?
A: *29వ రాష్ట్రం*
3)👉తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?
A: *శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు*
4)👉తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు దేనిని ప్రతిబింబిస్తాయి?
A: *తెలంగాణ చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు*
5)👉మన రాష్ట్ర జంతువు ఏది?
A: *జింక*
6)👉తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది?
A: *పాలపిట్ట*
7) 👉తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది?
A: *జమ్మిచెట్టు(శమీవృక్షం)*
8)👉 తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది?
A: *తంగేడుపువ్వు*
9) 👉జింకను దేనికి గుర్తుగా రాష్ట్ర జంతువుగా ఎంపిక చేసారు?
A: *తెలంగాణ ప్రజల భోళాతనానికి,ప్రేమకు గుర్తుగా*
10)👉దసరా పండుగనాడు తెలంగాణ ప్రజలు ఏ పక్షిని చూస్తారు?
A: *పాల పిట్ట*
11)👉 దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే ఏం జరుగుతుందని ప్రజల నమ్మకం?
A: *పాపాలు పోతాయని*
12) 👉పాలపిట్ట దేనికి చిహ్నం?
A: *స్వేచ్ఛకు*
13)👉పాండవులు తమ ఆయుధాలు ఎక్కడ దాచిపెట్టారని ప్రతీక?
A: *జమ్మిచెట్టుమీద*
14) 👉జమ్మిచెట్టు దేనికి గుర్తు?
A: *విజయానికి*
15)👉 తెలంగాణలో అతిపెద్ద పండుగ ఏది ?
A: *దసరా*
16)👉దసరా పండుగరోజు ప్రజలు ఏ చెట్టును పూజిస్తారు?
A: *జమ్మిచెట్టును*
17)👉తెలంగాణలో ఏ ఆకును బంగారం అనికూడా పిలుస్తారు ?
A: *జమ్మి ఆకులను*
18)👉చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు ఏమి ఇచ్చి దీవెనలు తీసుకుంటారు?
A: *బంగారం(జమ్మి ఆకులు)*
19) 👉బతుకమ్మ సిగలో ఏ పువ్వు కలదు?
A: *తంగేడు*
20)👉తాంబాళంలో ఏ పువ్వు లేనిది బతుకమ్మ తయారు కాదు?
A: *తంగేడు*
21)👉సింగారించడం అనగా అర్థం ఏమిటి?
A: *అందంగా అలంకరించడం*
22)👉 తంగేడు పువ్వు ఏ వర్ణంలో ఉంటుంది?
A: *పసుపు*
23) 👉ఏ పువ్వులో ఔషధ గుణాలు ఎక్కువ?
A: *తంగేడు*
24) 👉తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది?
A: *బతుకమ్మ*
25)👉మన జాతీయ పక్షి ఏది?
A: *నెమలి*
26)👉 జాతీయ జంతువు ఏది?
A: *పులి*
27) 👉మన జాతీయ వృక్షం ఏది?
A: *మర్రిచెట్టు*
28)👉మన జాతీయ పుష్పం ఏది?
A: *తామర*
29) 👉మన జాతీయ ఫలం ఏది?
A: *మామిడి కాయ*
30) 👉మన జాతీయ జెండాలో మధ్యలో ఏమి ఉంటుంది?
A: *అశోక చక్రం*
31) 👉అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి?
A: *24 ఆకలు*
32) 👉కాషాయ రంగు దేనికి ప్రతీక?
A: *త్యాగానికి,దేశభక్తి కి*
33)👉తెలుపు రంగు దేనికి చిహ్నం?
A: *శాంతికి, సత్యానికి*
34)👉ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం?
A: *నమ్మకానికి, సమృద్ధికి, భూమికి*
35)👉అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది?
A: *నీలిరంగు*
36)👉అశోక చక్రంలో గల 24 ఆకులు దేనికి సంకేతం?
A: *24ఆకులు 24 గంటలు క్రమశిక్షణ ,ధర్మానికి ,సంకేతం.*
37)👉 జాతీయ చిహ్నాలలో సూర్యబింబానికి ప్రతీక అయినది ఏది?
A: *అశోక ధర్మ చక్రం*
38)👉ఒక హల్లుకు వేరొక
హల్లు ఒత్తుగా చేరితే ఏర్పడే పదాలను ఏమంటారు ?
A: *సంయుక్తాక్షర పదాలు*
39) ప్రతీక అనగా అర్థం ఏమిటి?
A: *గుర్తు*
40)జాతీయ జెండా దేనికి ప్రతీక
A: *దేశ సమగ్రతకు, సమైక్యతకు*
🥀🌱🥀🌱🥀🌱🥀🌱🌱
0 Comments
Please give your comments....!!!