Dt:14.04.2022
*📚TELUGU TOPIC-3️⃣4️⃣*
(5వ తరగతి తెలుగు)
*2.యాదగిరిగుట్ట 🛕*
*✍🏻G.SURESH GK GROUPS*
📲9949753736
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
25 ముఖ్యమైన ప్రశ్నలు👇
1)👉యాదగిరిగుట్ట పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?
A: *దర్శనీయ స్థలాలు,సంస్క్రతి*
2) 👉యాదగిరిగుట్ట పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *వ్యాసం*
3)👉 యాదగిరిగుట్ట పాఠం ఉద్ధేశం ఏమిటి?.
A: *తెలుగునేలలో పేరుపొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం*
4)👉 తెలంగాణలో గొప్ప కీర్తికెక్కిన పుణ్యక్షేత్రం ఏది?
A: *యాదగిరిగుట్ట*
5)👉యాదగిరిగుట్ట లో కొలువై ఉన్న దేవుడు ఎవరు?
A: *నరసింహస్వామి*
6)👉 యాదగిరిగుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు ?
A: *యాదాద్రి(పూర్వం నల్లగొండ)*
7) 👉యాదగిరిగుట్ట హైదరాబాదు కు ఎంత దూరం లో కలదు ?
A: *60km*
8) 👉యాదర్షి ఎవరి కుమారుడు?
A: *ఋష్యశృంగుని కొడుకు*
9)👉ఎవరి పేరున యాదగిరిగుట్ట కు ఆ పేరు వచ్చింది?
A: *యాదర్షి*
10)👉 దేదీప్యమానం అనగా అర్థం ఏమిటి?
A: *బాగా వెలిగేటి కాంతి*
11)👉కల్పతరువు అనగా అర్థం ఏమిటి?
A: *కోరికలు తీర్చే చెట్టు,దేవలోక వృక్షం*
12) 👉యాదగిరిగుట్ట దగ్గర దేనిని పుణ్యకార్యక్రమంగా భావిస్తారు ?
A: *గోశాలకు ఆవులను దానం చేయడం*
13)👉యాదగిరిగుట్ట పైన గల గుండం పేరేమిటి?
A: *విష్ణు గుండం*
14)👉ఈ కొండపై గల మరొక దేవాలయం ఏది?
A: *రామలింగేశ్వరాలయం*
15)👉నరసింహ ఆలయంలో స్వామివారికి అష్టోత్తరశత కలశాభిషేకం ఎప్పుడు జరుగుతుంది?
A: *ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున*
16)👉 శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి?
A: *11 రోజులు*
17) 👉తొవ్వ అనగా అర్థం ఏమిటి ?
A: *దారి,మార్గం*
18) 👉సప్తగిరి చానెల్ ను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?
A: *యాదగిరి.*
19) 👉కొండగుట్ట మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు?.
A: *కరీంనగర్*
20) 👉కొండగుట్టలో వెలిసిన దేవుడు ఎవరు?
A: *ఆంజనేయస్వామి*
21)👉 హనుమాన్ దీక్ష చేపట్టిన వారు ఎన్ని రోజులపాటు నిష్ఠగా ఉంటారు?
A: *41రోజులు*
22) 👉అజయ్ అనే విద్యార్థి యాదగిరిగుట్ట పాఠం విని వారి ఊరిలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేసాడు .అయిన అతను సాధించిన సామర్థ్యం ఏమిటి?
A: *సృజనాత్మకథ.*
23) 👉 జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను ఏమంటారు?.
A: *భూతకాలపు వాక్యాలు*
24)👉జరుగుతున్న పనిని తెలిపే వాక్యాలను ఏమంటారు ?
A: *వర్తమానకాలపు వాక్యాలు*
25)👉జరగబోయే పనులు గురించి తెలిపే వాక్యాలను ఏమంటారు ?
A: *భవిష్యత్ కాలపు వాక్యాలు*
*✍🏻G.SURESH*
🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪
0 Comments
Please give your comments....!!!