Practice Test కోసం ఇక్కడ క్లిక్ చేయండి
1.పాఠశాలలో మొదటిరోజు భయపడిన పిల్లవాడు ఏడవటం, బొటన వ్రేలు చీకటం మొదలైన శైశవప్రవర్తనలు చూపుతాడు
A) ప్రతిగమనం
B) ప్రక్షేపణం
C) చర్య
D) హేతువాద వివరణ
Ans : ప్రతిగమనం
2.క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం “పీవరకాయలు” అనే మూర్తిమత్వ రకం గల మనుష్యులు
A) పొట్టి మరియు లావు
B)శరీర ధారుడ్యం తగిన రీతిలో ఉండేవారు
C) మరుగుజ్జులు
D) పొడవు మరియు సున్నము
Ans : పొట్టి మరియు లావు
3.ఈ పద్దతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే
A) అంతఃపరిశీలన
B) పరిపృచ్ఛ
C) వ్యక్తి అధ్యయన పద్దతి
D) ప్రకల్పనా పద్దతి
Ans : అంతఃపరిశీలన
4.’విద్యార్థుల సాధన పై డిజిటల్ తరగతుల ప్రభావం’ అనే అంశం పై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన
A)స్వతంత్రచరం
B) పరతంత్ర చరం
C) జోక్య చరం
D) సమూహచరం
Ans : పరతంత్ర చరం
5.ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలో నిరరక్షకతంత్రం
A) ఉదాత్తీకరణం
B) ప్రక్షేపణం
C) హేతుకీకరణం
D) తదాత్మీకరణం
Ans : తదాత్మీకరణం
6.ఆటంకాలను అధికమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరచే చర్యలలోని వైవిధ్యం
A) ప్రవర్తనారీతి
B) సామాజిక పరిపక్వత
C) రక్షకతంత్రం
D) సర్దుబాటు
Ans : సర్దుబాటు
7.ఈ క్రిందివానిలో అసత్యం
A) అందని ద్రాక్ష పుల్లన ౼ హేతుకీకరణం
B) పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన ౼ ప్రక్షేపణం
C) నేలవిడచిసాముచేయుట ౼ స్త్వైరకల్పన
D) అత్తమీద కోపం ౼ దుత్త మీద చూపడం ౼ ప్రతిగమనం
Ans :అత్తమీద కోపం ౼ దుత్త మీద చూపడం ౼ ప్రతిగమనం
8.ఇంటర్ పాసయిన విద్యార్థి తర్వాత కోర్సులు ఎంపిక చేసుకొనేటపుడు దీనిని ఎదుర్కొంటాడు
A) ఒత్తిడి
B) వ్యాకులత
C) సంఘర్షణ
D) కుంఠనం
Ans : సంఘర్షణ
9.గణితం, విజ్ఞానశాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు M.P.C. లేదా Bi.P.C. గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ
A) ఉపగమ౼పరిహార
B) పరిహార౼పరిహార
C) ద్విఉపగమ౼పరిహార
D) ఉపగమ౼ఉపగమ
Ans : ఉపగమ౼ఉపగమ
10.సక్రమమైన మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణం కానిది
A) మూర్తిమత్వ సంధానం
B) అనుగుణ్యత
C) ఉద్వేగ అసమతుల్యత
D) మంచి శారీరక ఆరోగ్యం
Ans : ఉద్వేగ అసమతుల్యత
Please give your comments....!!!