Dt: 25.04.2022
*📚SOCIAL TOPIC -1*
(విద్యా ప్రమాణాలు)
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*💥సోషల్ స్టడీస్ విద్యా ప్రమాణాలు.(Academic Standards)*
*♦️1) విషయావగాహన(conceptual Understanding)*
ప్రశ్నించడం చర్చించడం సమాలోచన కేస్ స్టడీల ద్వారా ఉదాహరణలు వ్యాఖ్యానించడం పరిశీలించడం వంటి వాటి ద్వారా కీలక భావనలు నేర్చుకోవడాన్ని ప్రోత్సహించవచ్చు
*♦️2) (ఇచ్చిన) పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసహకుని వ్యాఖ్యానించడం(Reading the text(given) Understanding and Interpretation)*
రైతులు కర్మాగారాలలోని కార్మికులకు సంబంధించి కొన్ని కేస్ స్టడీలు పాఠ్యపుస్తకంలో ఉపయోగించిన కొన్ని చిత్రాలు వంటివి నేరుగా భావనను తెలియజేయవు. ముఖ్య భావనలను విద్యార్థులు అర్థం చేసుకోవడానికి చిత్రాలను వ్యాఖ్యానించడానికి తగిన సమయం కేటాయించాలి.
*♦️3)సమాచార నైపుణ్యాలు(InformationbSkills)*
సామాజిక శాస్త్రంలో ని వివిధ అంశాల అధ్యయనానికి కేవలం పాఠ్యపుస్తకాలు సరిపోవు. ఉదాహరణకు పట్టణ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులు తమ ప్రజాప్రతినిధులు గురించి, గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులు తమ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు, చెరువుల గురించి సమాచారం సేకరించవచ్చు .విద్యార్థులు సేకరించిన సమాచారం పాఠ్యపుస్తకంలో ఉన్నదానితో పూర్తిగా సరిపోకపోవచ్చు. దీనిని వివరించాలి .ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు సేకరించిన సమాచారాన్ని తెలియజేయడం కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఉదాహరణకు ఒక చెరువు గురించి సమాచారం సేకరించి ఉంటే దాన్ని లిఖిత నివేదికతో పాటు ఒక చిత్ర పటమో జతపరచాలనుకోవచ్చు .లేదా సమాచారాన్ని పోస్టర్లు బొమ్మల రూపంలో ప్రదర్శించవచ్చు .సమాచార సేకరణ, రికార్డులు, క్రోడీకరించడం, విశ్లేషణ, నిర్ధారణ వంటివి సమాచార నైపుణ్యాలు వస్తాయి. ప్రాజెక్టు పనులు నిర్వహించ గలగాలి.
*♦️4)సమకాలీన అంశాలపై (సామాజిక /సాంఘిక) ప్రతిస్పందన-ప్రశ్నించడం(Refkection on contemporary issues and questioning)*
విద్యార్థులు తమ తమ జీవన విధానాలను వివిధ కాలాల లోని వివిధ ప్రాంతాలలోని ప్రజల జీవన విధానాలతో సరిపోల్చి భేదాలకు గల కారణాలను సూచించుటను, నిర్ధారించుట మరియు వానిపై వ్యాఖ్యానించినట్లుగా ప్రోత్సహించాలి.
*♦️5)పట నైపుణ్యాలు(Mapping Skills)*
పాఠ్య పుస్తకంలో అనేక రకాల పటాలు చిత్రాలు ఉన్నాయి. ఒక ప్రదేశానికి సంబంధించి నైరూప్య ప్రతిబింబమైన పటాల అధ్యయన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ముఖ్యం. ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో అనేక దశలు ఉన్నాయి. తరగతి గది పటం తయారుచేయడం .పటంలో దూరం ఎత్తులను చూపించే విధానాన్ని అర్థం చేసుకోవడం. ఈ పాఠ్య పుస్తకంలో బొమ్మలు ఫోటోలు ఉపయోగించాం. పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం కాకుండా వీటికి పాఠ్యాంశానికి సంబంధం ఉంది .కొన్ని సార్లు వీటికి సంబంధించిన కొన్ని కృత్యాలు ఉన్నాయి. ఉదాహరణకు బొమ్మ కి శీర్షిక రాయడం .భవన నిర్మాణ చిత్రాలను చదవడం మొదలైనవి.
6) *♦️ప్రశంస ,సున్నితత్వం(Appreciation and sensitivity)*
భాష సంస్కృతి ,కులం ,మతం లింగ భేదం వంటి విషయాల్లో మన దేశంలో ఎంతో వైవిధ్యంగా ఉంది .సాంఘిక శాస్త్రం భిన్నత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ తేడాల పట్ల సున్నితంగా ఉండాలని విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.
*..✍🏻 G.SURESH*
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎
0 Comments
Please give your comments....!!!