*🧠PSYCHOLOGY TOPIC-5️⃣*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*👩🏻🦰ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు*
*(Stages of Development)*
*1️⃣నవజాత శిశువు*
👉జననంతో ప్రారంభమై రెండు వారాల వరకు ఉంటుంది.
👉జనన పూర్వ పరిసరానికి జననాంతర పరిసరానికి మధ్య ఏర్పడిన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది .
👉శీతోష్ణస్థితి సర్దుబాటు.. ఆహారం తీసుకోవడం.. మల మూత్ర విసర్జన.. శ్వాసించడం.
*2️⃣శైశవ దశ*
👉రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ
👉జన్మించిన రెండు వారాల నుంచి శిశువుకు రెండు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఉంటుంది
👉ఈ దశలో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది.
👉 జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో ఎక్కువగా జరుగుతుంది.
*3️⃣పూర్వ బాల్యదశ*
👉3-5సంవత్సరాలు.
👉పూర్వ పాఠశాల దశ అంటారు.
👉అన్వేషించే వయస్సు
👉చాలా చురుగ్గా ఉంటారు
👉పెద్దలను అనుకరిస్తారు.
👉ఆత్మ భావన ఈ దశలో ప్రారంభమవుతుంది.
👉ఇది సాంఘీక వికాసానికి మొదటి మెట్టు
👉సహజాత కార్యక్రమాలు( ఇసుకతో బొమ్మరిల్లు కట్టడం) కనిపిస్తాయి.
👉ఇది అణ్వేషణ దశ
👉పూర్వ బాల్య దశను *ప్రమాద వయస్సు* అంటారు.
*4️⃣.ఉత్తర బాల్య దశ(6-10yrs)*
👉దీనిని *పాఠశాల దశ* అంటారు
👉ఈ దశలో అనుకరణ ఎక్కువ
👉శాశ్వత దంతాలు ఏర్పడుతాయి
👉అభిరుచులు ఏర్పడుతాయి
👉పెరుగుదల అంత వేగంగా జరగదు
👉బరువు కూడా అంత వేగంగా పెరగదు
*i)స్వయం పోషిక కౌశలాలు:* స్నానం చేయడం ఆహారం తినడం వస్త్రధారణ
*ii) సాంఘిక కౌశలాలు:*
తల్లిదండ్రులకు కొన్ని పనులలో సహకరించడం
ఇంటి శుభ్రత
వస్తువులు సర్థటం
తనకంటే చిన్నవారికి సహాయం చేయడం
*iii)పాఠశాల కౌశలాలు:*
చదవడం రాయడం అవగాహన చేసుకోవడం లెక్కలు చేయడం కొలవడం ఆటకు సంబంధించిన కౌశలాలు
*iv) భాషా వికాసం:*
ఆరు నుండి 9 సంవత్సరాల లో చెప్పుకోదగ్గ భాషా వికాసం పెరుగుదల కనిపిస్తుంది
పదజాలం పెరుగుతుంది
బడాయిలు చెప్పుకుంటారు
వెక్కిరించడం విమర్శించడం
*5️⃣యవ్వనారంభ దశ:*
👉శారీరక మార్పులు అకస్మాతఁతుగా జరుగుతాయి.
👉ఈ దశను ఆంగ్లంలో *ప్యూబర్టీ* అంటారు
👉ఆడపిల్లలలో 11 సం..మగ పిల్లలలో 12 సం.లో ఏర్పడుతుంది.
👉ఆడపిల్లలు రజస్వల కావడం
👉మగపిల్లలలో వీర్యస్కలనం
👉నిద్రలో ఉత్తేజ పూరిత కలలు రావడం
👉యవ్వనారంభ పూర్వదశలో *గౌణ లైంగిక* లక్షణాలు కనిపిస్తాయి
👉ఇది అపరిపక్వ దశ.
👉పునరుద్పాదన దశ ఇంకా ప్రారంభంకాదు.
👉యవ్వనారంభ దశ పరిపక్వ దశ
👉స్త్రీలలో పిండోత్పత్తి పురుషులలో శుక్రకణోత్పత్తి ప్రారంభమవుతుంది.
👉పునరుత్పాదక దశలో పరిపక్వత పొందుతారు
లైంగిక అవయవాలు వికాసం పూర్తవుతుంది
gsureshgkgroups
👉ఆడపిల్లలలో సిగ్గు బిడియం వస్తుంది
👉హస్తమైదనం సాధారణంగా ఈ దశలో గమనించవచ్చు
👉 *తీవ్రమైన మానసిక ఒత్తిడి* ఈ దశలో ఉంటుంది
*6️⃣పూర్వ కౌమార దశ(13-17yrs)*
👉దీనినే టీనేజ్ అంటారు
👉వ్యక్తి ఆకారంలో నడకలో మార్పు వస్తుంది.
👉ఇతరులు చేసే పనులు విమర్శిస్తారు
👉విరోద స్వభావం ఉంటుంది
👉తల్లి దండ్రులమీద తీవ్రమైన నిరసన భావాన్ని కలిగి ఉంటారు
👉సంఘాన్ని విమర్శిస్తారు
👉విశ్రాంతి సమయాన్ని ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు
👉పగటి కలలు కంటూ ఉంటారు
👉లైంగిక విషయాల మీద కుతూహలం చూపుతారు
👉ఉద్వేగ అస్థిరత ఎక్కువ
ఈ దశను *ఒత్తిడి వయస్సు* అని అంటారు
*7️⃣ఉత్తర కౌమార దశ(17,18-23)*
👉ఈ దశలో సాంఘిక ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి
👉విందులు వినోదాల మీద ఆసక్తి ఎక్కువ
👉వ్యక్తి నిలకడగా వ్యవహరిస్తారు
👉సాంఘీక కార్యక్రమాలలో పాల్గొంటారు.
👉భిన్న లింగ వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నం ఎక్కువ
*8️⃣వయోజన దశ:(21-40)*
👉ఈ దశలో తనకున్న శక్తి సామర్థ్యాలలో పరిపూర్ణత సాధిస్తారు
👉వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడతారు
👉శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోతుంది
*9️⃣మధ్య వయస్సు:(40-60)*
👉శక్తులు తగ్గుముఖం పడతాయి
👉పునరుత్పాదన శక్తి తగ్గిపోతుంది
👉స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోతుంది
👉ఇది సర్దుబాటు దశ
👉ఆరోగ్యం కుంటు పడుతుంది
👉ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది
1️⃣0️⃣ *వృద్దాప్యం*
👉ఇది జీవితంలో చివరి దశ
👉దీన్నే నిష్క్రమణ వయస్సు అంటారు
👉శారీరక శక్తులు క్షీణిస్తాయి
👉మెదడు పనిచేయకపోవడంతో *సెనైలిటీ* కి దారి తీస్తుంది.
*..✍🏻G.SURESH*
0 Comments
Please give your comments....!!!