Guruvu.In

English Grammar Direct Speech and Indirect Speech explain in Telugu

Direct and Indirect Speech



Direct Speech:
 ఒక వ్యక్తి ఏమి మాట్లాడాడు అనేది తెలుపుతుంది. ఈ వాక్యం " " లోపల రాయబడుతుంది.
 
 Indirect Speech:
 వేరే వ్యక్తి ఏమి మాట్లాడాడు అనేది తెలుపుతుంది. ఇక్కడ అతను మాట్లాడిన పదాలు యధావిధి గా చెప్పబడదు వాటి అర్థం చెప్పబడుతుంది.

Direct Speech ను Indirect Speech గా మార్చునప్పుడు Indirect Speech లో verb తర్వాత That అనే పదం వస్తుంది.

Direct: Ramzan said, "I'm not free"
Indirect: Ramzan said that he was not free

కొన్ని సందర్భాల్లో say, tell, reply, answer, inform లు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భాలో to అనే పదం వస్తుంది

Ex
Direct: The teacher said, "Open the door, Mohan."
Indirect: The teacher told Mohan to open the door.

సందర్భం 1:- 
రిపోర్టింగ్ వెర్బ్ past tense లో ఉన్నప్పుడు

Direct Speech ను Indirect Speech గా మార్చునప్పుడు క్రియ వెర్బ్ లో కొన్ని మార్పులు జరుగుతాయి అవి

Direct Speech ->Inirect Speech
Simple Present (ex goes ) -> simple past (ex went)
Present Continuous (ex is going) -> past continuous (was going)
Present perfect ( has gone) -> past perfect (had gone)
Simple past (went)->past perfect (had gone)
Will/can/may -> would/could/might
Past perfect and past continuous లు మారవు.

Ex
Direct: Ramzan said, "I'm not free"
Indirect: Ramzan said that he was not free


Direct: "I have read the book", said Ramzan
Indirect: Ramzan said he had read the book


సందర్భం 2:
రిపోర్టింగ్ వెర్బ్ present tense లో ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు ఉండవు

Direct: Ali says, "I'm busy."
Indirect: He says that he is busy

సందర్భం 3:
సర్వనామం ( pronoun) లో మార్పులు
Ex
Direct: He said to me, " I won't trouble you."
Indirect: He told me he wouldn't trouble me.

కొన్ని adverb లో జరుగు మార్పులు

Direct - > Indirect
This - that
These - those
Here - there
Now-then
Today- that day
Tonight- that night
Tomorrow- the next day
Yesterday- previous day
Don't - not to

Direct ప్రశ్న లో ప్రశ్న పదాలు ( what, who, when, where )  ఉన్నప్పుడు ఈ పదాలు రిపోర్టింగ్ వెర్బ్ కు రిపోర్ట్ ప్రశ్నకు ఒక లింక్ ను ఏర్పాటు చేస్తాయి.
Ex
Direct: He said , " Where are you going?"
Indirect: He asked where I was going.

ఒక వేళ Direct ప్రశ్న లో ప్రశ్న పదాలు లేక పోతే రిపోర్ట్ ప్రశ్న కు ముందు if కానీ whether లు వస్తాయి.అలాగే Ask, enquire, want to know పదాలు వాడుతారు.
Ex
Direct: "Is anybody in?" He asked.
Indirect: She enquired if anybody was in.

Direct Speech ను Indirect Speech గా మార్చునప్పుడు కామా లోపల ఉన్నది మారుతుంది కాని కామా బయట ఉన్నది మారదు.

He said, "I'm not well."
He said ని Reporting Verb
I'm not well ని Reporting Speech అంటారు.

వాక్యాలు నాలుగు రకాలు అవి
1. Assertive sentence అనగా స్టేట్ మెంట్ వాక్యం
Ex He said, "I'm not well."

2. Interrogative sentence ప్రశ్నార్థక వాక్యం
Ex Ramya asked "Are these fabrics from Indonesia?"

3. Imperative sentences ఆజ్ఞ, ప్రార్థన, వేడుకోలు వాక్యాలు
Ex The theif said to the people, "Please don't take me to the police station."

4. Exclamatory sentence ఆశ్చర్య వాక్యం
Ex: He said, "Hurrah I have won the match."

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts