Guruvu.In

🆓 *English Pedagogy ( Methodology ) 3వ పాఠం లోని ముఖ్యాంశాలు బిట్స్ తెలుగులో... పాఠం పేరు: Approaches to the Teaching of English (ఇంగ్లీష్ బోధనకు విధానాలు)*

🆓 *English Pedagogy ( Methodology ) 3వ పాఠం లోని ముఖ్యాంశాలు బిట్స్ తెలుగులో...*

*3వ పాఠం పేరు: Approaches to the Teaching of English (ఇంగ్లీష్ బోధనకు విధానాలు)*

1. Edward Anthony మూడు రకాలు గా చెప్పారు అవి

a) Approach ( విధానం ) : 
ఒక విధానం అనేది తరగతి గదిలోకి అనువదించబడిన అభ్యాస స్వభావం గురించిన సూత్రాలు, నమ్మకాలు లేదా ఆలోచనల సమితి. ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించబడిన దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక. ఇది బోధించవలసిన విషయం యొక్క స్వభావాన్ని వివరిస్తుంది.

b) Method ( పద్దతి ) :
విద్యార్ధులలో కోరుకున్న అభ్యాసాన్ని సాధించడానికి ఉపాధ్యాయులు వర్తించే సూత్రాలు మరియు సాంకేతికతలను బోధనా విధానం కలిగి ఉంటుంది. ఈ వ్యూహాలు పాక్షికంగా బోధించబడే విషయం మరియు అభ్యాసకుడి స్వభావం ఆధారంగా ఎంపిక చేయబడతాయి. ఒక పద్ధతి అనేది భాషా సామగ్రి యొక్క క్రమబద్ధమైన ప్రదర్శన కోసం మొత్తం ప్రణాళిక; ఇది విధానపరమైనది. ఒక విధానంలో, అనేక పద్ధతులు ఉండవచ్చు.

c) Strategy/Technique:
ఒక వ్యూహం లేదా సాంకేతికత అనేది ఒక పద్ధతి యొక్క వాస్తవ అమలుకు మార్గం. ఇది తక్షణ లక్ష్యాన్ని సాధించడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియ. సాంకేతికత తప్పనిసరిగా ఒక పద్ధతికి అనుగుణంగా ఉండాలి, అది తప్పనిసరిగా ఒక విధానానికి అనుగుణంగా ఉండాలి. ఇది ఒక వ్యూహం, లేదా తక్షణ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించే సాధనం.

2. Behaviouristic approach ( ప్రవర్తన విధానం ) ను ప్రతిపాదన చేసినవారు John B Watson, B F Skinner.

1. స్ట్రక్చరల్ అప్రోచ్ టీచింగ్:

 బ్రూయింగ్టన్ "స్ట్రక్చరల్ అప్రోచ్‌ని ఆంగ్ల భాష యొక్క ప్రాథమిక నిర్మాణాల శాస్త్రీయ అధ్యయనం".  
 C. S. భండారి ప్రకారం "నిర్మాణాత్మక విధానం అనేది కొన్ని ఎంచుకున్న నిర్మాణాలను వరుస క్రమంలో బోధించడం. భాష యొక్క నిర్మాణాలు విద్య స్థాయి లేదా ప్రమాణం ప్రకారం ఎంపిక చేయబడతాయి మరియు గ్రేడ్ చేయబడతాయి."
  
పామర్, హార్న్బీ మరియు ఇతర భాషా శాస్త్రవేత్తలు ప్రధాన వ్యాకరణ నిర్మాణాలను ఆంగ్ల నిర్మాణ నియమాలను అంతర్గతీకరించడానికి ఉపయోగించే వాక్య నమూనాలుగా వర్గీకరించారు.  

స్ట్రక్చరల్ అప్రోచ్ ను Audio lingul Method ఆడియో-భాషా పద్ధతి అని పిలుస్తారు .

స్ట్రక్చరల్ అప్రోచ్ Selection, Gradation, Presentation లను కల్గి ఉంటుంది.

స్ట్రక్చరల్ అప్రోచ్లో ఉపయోగించే సాంకేతికతలు: 
Dialogue memorization 
Repetition drill
 Chain drill 
 Substitution drill 
 Question - and - answer drill
  Transformational drill and Grammar games

బోధన ప్రక్రియ లో ఉన్న దశలు: 
జ్ఞాన సంపాదన Receiving Knowledge, 
Memorizing by repetition వల్లించడము ద్వారా గుర్తు పెట్టుకోవడం,
 ప్రాక్టీస్ చేయడం.

విద్యార్థి మాట్లాడడం పైన ఎక్కువ దృష్టి పెడుతుంది.

2. Grammar Translation Method:

*ఇది లాటిన్ మరియు గ్రీక్ లో వాడే పురాతన పద్దతి.
*వ్యాకరణం నేర్చుకోవడానికి ఉత్తమమైన పద్దతి.
*చదవడానికి, రాయడానికి మాత్రమే ఎక్కువ దృష్టి సారించబడును.
*వినడం, మాట్లాడడం ఉచ్ఛారణ పై ప్రాధాన్యత లేదు.
*కొత్త లో కొంత వరకు ఈ పద్దతి వాడడం మంచిది.

3. Direct Method:

- బోధన ప్రక్రియ లో విద్యార్ధి క్రియాత్మక ఉండేలా చర్యలు నిర్వహణ ఉంటుంది.
- ఆలోచన నైపుణ్యాల ను పెంపొందిస్తుంది.
-Direct Method లో వాడే టెక్నిక్స్:
- బిగ్గరగా చదవాలి.మాతృభాష వాడకూడదు. ట్రాన్స్లేషన్ చేయవద్దు.
- ప్రశ్నలు సమాధానాలు ఉండాలి అవి కూడా ఇంగ్లీష్ లోనే
- వ్యాకరణ నేర్పడం ముఖ్యం కాదు. పదజాలం నేర్పాలి.
- సందర్భానుసారం లో వాడవచ్చు.
- పరీక్ష ఓరల్ గా, రాత పరీక్ష ఇంటర్వ్యూ లు చేయవచ్చు 

4. Communicative Approach:

- పరస్పర చర్యలు ( Interaction ) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు .
- సమాచార నైపుణ్యాన్ని అభివృద్ధి జరుగును
- అభ్యసన కేంద్రీకృత పద్ధతి
- నియమాలు :
- Learner Centred,
- Meaningful Teaching Materials and Activities,
- Communication and Culture are interrelated,
- Communication is context embedded

ఇందులో వాడే కృత్యాలు:
- Role play
- Interviews
- Information Gap
- Games
- Language Exchange
- Survey
- Pair work
- Learning by Teaching 

5. Suggestopedia Method:

- ఈ పద్ధతిని డెవలప్ చేసినది బల్గేరియా సైకో తేరపిస్ట్ Georgi Lozanov.
- విదేశీ భాషలను నేర్చుకోవడానికి ఉత్తమమైన పద్దతి.
- భాషను అర్థం చేసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
- ఈ పద్ధతి ఇంద్రియ అభ్యాస పర్యావరణం యొక్క సూత్రాన్ని విశ్వసిస్తుంది
- బోధన ప్రక్రియ ను మెరుగు పరుస్తాయి
- నాలుగు దశలు ఉంటాయి అవి
- పరిచయం Introduction
- Concert Session కచేరీ
- Elaboration విశదీకరణ
- Production ఉత్పత్తి

6. Approaches to Teaching of English to Young Learners ( యువకులకు ఆంగ్ల బోధనకు సంబంధించిన విధానాలు):

  విద్య యొక్క పూర్వ-ప్రాథమిక మరియు ప్రాథమిక దశలు భాషా అభివృద్ధికి అత్యంత అనుకూలమైన కాలం. 

 కొన్ని మానసిక సిద్ధాంతాల ప్రకారం, భాషలను నేర్చుకోవడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, ఆలోచన, అవగాహన, ఊహ మొదలైనవి మెరుగుపడతాయి.
 
  యువ నేర్చుకునేవారికి భాష బోధించడానికి నాలుగు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి: 
  
  1. సహజ విధానం Natural Approach
  2. మొత్తం భౌతిక ప్రతిస్పందన విధానం Total Physical Response Approach
   3. కథ ఆధారంగా Story Based
    4. పాటలు / రైమ్స్ Songs Rhymes

7. సిద్ధాంతాలు:

Stephen Krashen:

- భాష నేర్చుకోవడానికి వ్యాకరణ నియమాలు అవసరం లేదు
- భాష నేర్చుకోవడానికి ఎలాంటి ఒత్తిడులు ఉండకూడదు వల్లెవేయడం కూడా ఉండకూడదు.
- భాష నేర్చుకోవడంలో సహజ చర్య ప్రతి చర్యలు ఉండాలి కానీ వాక్యనిర్మాణం తో పనిలేదు
- భాష నేర్చుకోవడానికి విద్యార్థిని ఒత్తిడి చేయకూడదు
- ఐదు రకాల పరికల్పన ఉంటాయని చెప్పాడు అవి
- 1. సముపార్జన అభ్యాస పరికల్పన acquisition learning hypothesis: సముపార్జన అనేది మొదటి భాషా పరిస్థితిలో ఉపచేతనంగా జరుగుతుంది మరియు అభ్యాసం అనేది అధికారిక పరిచయం యొక్క ఉత్పత్తి అయిన చేతన ప్రక్రియ కాబట్టి భాషని పొందాలి.
- 2. Monitor hypothesis: సముపార్జన మరియు అభ్యాసం ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో వివరిస్తుంది
- 3. Natural Hypothesis: వ్యాకరణ నిర్మాణాన్ని పొందడం అనేది సహజమైన క్రమాన్ని అనుసరిస్తుంది, ఇది ఊహించదగినది
- 4. Input Hypothesis: అభ్యాసకుల స్థాయిని దృష్టిలో ఉంచుకుని బోధన కోసం అందించిన ఇన్‌పుట్‌ను ఎంచుకోవాలి
- 5. Affective hypothesis: ప్రేరణ, స్వీయ నమ్మకం, తక్కువ ఒత్తిడిని కల్పించాలి.

8. Steven Pinker:

- పిల్లలు మాట్లాడటం ప్రారంభించిన క్షణం నుండి భాషా నియమాలు మరియు సాధారణీకరణలను ఉపయోగిస్తారు.
- భాష కఠినం అని తెలియకుండానే పదాలను అర్థం చేసుకుని నేర్చుకుంటారు 

9. Viven Cook:

- వ్రాసిన భాష కంటే మాట్లాడే భాషకు ప్రాధాన్యత ఇవ్వండి
- తరగతి గదిలో మొదటి భాష యొక్క ఉపయోగం
- విదేశీ భాషలు నేర్చుకోవాలి అనుకుంటే నిత్యజీవితంలో దానిని మాట్లాడుతూ ఉండాలి.

10. వైగొట్స్కీ:

- బోధన ప్రస్తుత జ్ఞాన స్థితిని పరిగణనలోకి తీసుకోవాలి మరియు బోధకుడితో సన్నిహిత సహకారం ద్వారా మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగడంలో వారికి సహాయపడాలి

11. Scaffolding:

- ఈ ప్రక్రియ సరళం నుండి సంక్లిష్ట వరకు ఉండాలి.
- బహు దారులలో భావన ప్రక్రియ ఉండాలి
- పదాలను నేర్చుకునే క్రమంలో ముందుగా పాఠ్యాంశాలను అర్థం చేయించాలి
- కొత్త పాఠం చెప్పే ముందు పాత పాఠాన్ని గుర్తు చేయాలి



- LOA ( Level of Aspiration ) ను ప్రతిపాదించింది డంబో

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts