Dt: 06.05.2022
*📚EVS TOPIC -3️⃣0️⃣*
(5th class)
*2.వ్యవసాయం -పంటలు*
very very important bits
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉పూర్వం దేనితో పొలం దున్నుతున్నేవారు?
A: *నాగలితో*
2)👉 ప్రస్తుతం పొలం దున్నడానికి దేనిని ఉపయోగిస్తున్నారు?
A: *ట్రాక్టర్*
3)👉ప్రస్తుతం వరి నాటుకు,కలుపు తీయడానికి పంట నూర్పిడికి వేటిని ఉపయోగిస్తున్నారు?
A: *యంత్రాలను.*
4)👉వ్యవసాయంలో యంత్రాలు ఉపయోగించడం వల్ల___
A: *పనులు త్వరగా అవుతాయి. కూలీల అవసరం తగ్గుతుంది.*
5) 👉గతంలో ఒక రైతు దగ్గర నుండి మరో రైతు విత్తనాలను బదులు తీసుకునే విధానాన్ని ఏమంటారు?
A: *నాగులు*
6) 👉దశాబ్ధాల క్రితం మన రాష్ట్రంలో ఎన్ని రకాల వంగడాలు ఉండేవి?
A: *5400రకాలు*
7)👉 ఎన్ని రకాల మామిడి వంగడాలు ఉండేవి?
A: *740*
8) 👉ఎన్ని రకాల వంకాయ రకాలు ఉండేవి?
A: *3500*
9)👉 మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏది?
A: *నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్స్*
10) 👉వానపాముల సహాయంతో చేసిన ఎరువును ఏమంటారు?
A: *వర్మి కంపోస్టు*
11)👉పంచ గవ్య అనగా....
A: *ద్రవరూపంలో ఉన్న ఎరువు*
12)👉 పంచగవ్య తయారు చేయుటలో ఉపయోగించే పదార్థాలు ఏవి?
A: *ఆవు మూత్రం, పేడ, నెయ్యి , పాలు, పెరుగు, అరటి పండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు.*
13)👉జీవామృతం తయారు చేయుటకు ఉపయోగించే పదార్థాలు ఏవి?
A: *ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం ,పప్పుధాన్యాలపొడి , నీరు*
14)👉 గుడ్ల కోసం పెంచే కోళ్ళను ఏమంటారు?
A: *లేయర్లు.*
15)👉 మాంసం కోసం పెంచే కోళ్ళను ఏమంటారు ?
A: *బ్రాయిలర్స్*
16) 👉తొగాళ్ళు అనగా___
A: *కంది*
17) 👉తయిదలు అనగా___
A: *రాగులు*
18)👉అలసందలు అనగా____
A: *బొబ్బర్లు*
19) 👉ఎక్కువ నీరు అవసరం లేకుండా పండించే పంటలేవి?
A: *కంది జొన్నలు రాగులు బొబ్బర్లు అనుములు పెసర్లు కొర్రలు ఉలవలు పల్లీలు సజ్జలు*
20)👉 ఏమి వాడడం వల్ల తెగుళ్ళు తక్కువ వస్తాయి?
A: *వేపాకు కషాయం*
21) 👉గంగవార్ మానెమ్మ అనే మహిళా రైతు ఏ జిల్లాకు చెందినవారు?
A: *సంగారెడ్డి*
22) 👉సంగారెడ్డి ప్రాంతంలో వైవిద్య వ్యవసాయాన్ని ప్రోత్సహంచే సంస్థ ఏది?
A: *దక్కన్ డవలప్ మెంట్ సొసైటీ*
23) 👉పండ్లు కూరగాయలను కడగకుండా తింటే ____ వచ్చే అవకాశం ఎక్కువ
A: *క్యాన్సర్*
24) 👉రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల ____ తగ్గిపోతుంది
A: *భూసారం*
25)👉 ఆహార పంటలు ఏవి?
A: *వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న ,పప్పు ధాన్యాలు ,నూనె ధాన్యాలు, కూరగాయలు పండ్లు....*
26)👉వాణిజ్య పంటలు ఏవి?
A: *పత్తి , జనుము, మిర్చి ...*
27) 👉IR2O , హంస ,స్వర్ణ ,మసూరి,బంగారుతీగ,సాంబ అనేవి ___
A: *వరి వంగడాలు*
28)👉ఎర్రకంది నల్లకంది ఆశ నడిపి అనేవి_____
A: *కంది రకాలు*
29)👉 వర్షాధార(ఆరుతడి) పంటలు ఏవి?
A: *జొన్న శనగలు కంది....*
30)👉 నీరు ఎక్కువ అవసరం ఉన్న పంటలేవి?
A: *వరి, గోధుమ...*
*..✍🏻G.SURESH*
Please give your comments....!!!