*1. ఇన్విజిలేటర్ లందరూ 1st రోజు 8:30 కి రావాలి సెకండ్ good డే నుంచి 9am వరకు సెంటర్ లో ఉండాలి.*
*2. అమ్మాయిలకి చెక్ చేయడానికి ప్రత్యేక కౌంటర్ నిర్వహించాలి*
*3. ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది*
*4.ఇన్విజిలేటర్ అందరు కూడా 9.15am లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి*
*5. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి*
*6. విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి*
*7.OMR Sheet లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి*
*8.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి*
*9. అలాగే ఎడిషనల్ సీట్ పైన నంబర్స్ ఉన్నాయా అది సీరియల్ లోనే ఉన్నాయా చూసుకోవాలి*
*10. విద్యార్థుల సమక్షంలోనే OMR పై, మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి*
*11.9.30am లోగా స్టిక్కర్స్ వేయడం సైన్ చేయడం అయిపోవాలి*
*12. సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి.*
*13 OMR షీట్ పైన, అడిషనల్ షీట్ పైన Main Answer Sheet నంబర్ వేయించాలి*
*14 ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No వేయమని చెప్పాలి.*
*15.స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి*
*16.ఎడిషనల్ షీట్, పార్ట్-బి పైన, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి*
*17. విద్యార్థులకు ఎడిషనల్ ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వబడిన ప్రొఫార్మా లో ఆ విద్యార్థికి ఇచ్చిన ఎడిషనల్ సీట్ నెంబర్ ని ఆ విద్యార్ధి హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా ఎంటర్ చేయాలి.*
*18ఒక్కో విద్యార్థికి ఎడిషనల్ షీట్ ఎన్ని సప్లై చేయబడ్డాయి పూర్తి సమాచారం ఉండాలి.*
*19 ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి invigilator సంతకం చేయాలి*
*20.విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు ఒకవేళ వాటర్, టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి.*
*21 ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు.*
*22. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి*
*23.విద్యార్థులు ఎడిషనల్ షీట్ తీసుకునేటప్పుడు వారు తీసుకున్న క్రమంలో కుడి వైపు పై భాగంలో సీరియల్ నంబర్ వేయమని చెప్పాలి*
*24.విద్యార్థులు ఆన్సర్ పేపర్స్ ని tag చేసేటప్పుడు ఎడిషనల్ షీట్ సీరియల్ గా ఉండేలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అలాగే బిట్ పేపర్ ని చివరగా tag చేయమని చెప్పాలి కొంతమంది విద్యార్థులు తెలియక Part-B బదులు క్వశ్చన్ పేపర్ ని టైప్ చేసి బిట్ పేపర్ ని ఇంటికి తీసుకెళ్లి ప్రమాదం ఉంది దాన్ని తప్పకుండా గమనించాలి.*
*25.స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి.*
*26.ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి*
*27.ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంతవరకు సహకరించాలి*
*28. ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు*
*29.ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లను మారకూడదు*
*30 ఏదైనా నా అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్లాలి*
*31.ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు*
*32 గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది*
*33.మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి*
*34. ప్రశ్నా పత్రములు అదే రోజున కు సంబంధించినవా? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి*
*35.రాంగ్ క్యూస్షన్ పేపర్ వస్తే CS లేదా DO లకు రిటర్న్ చేయాలి*
*36. ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు*
*37.ఒకే స్కూల్ పిల్లలు వరుసగా వస్తే సి ఎస్ తెలియజేయాలి*
*38. ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో invigilater సంతకం చేయాలి*
*39. విద్యార్థులు ఎగ్జామ్ ముగిసిన పిదప వారు ఎన్ని ఎడిషనల్ షీట్ ఉపయోగించారో ఓఎంఆర్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ పై వేయించాలి*
*40.ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూ నట్లు గమనిస్తే సి CS, DO లకు తెలియజేయాలి*
*41. దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి*
*42 ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాప్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి*
*43. మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది*
*44. పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే tag చేయించాలి*
*45.OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి*
*46. ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు*
*47. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ షీట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి*
*48.సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా?లేదా? అని పరిశీలించాలి*
*49. ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది*
*50. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ లపై పూర్తి సంతకం చేయాలి గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్ లపై ఇనిషియల్ సరిపోతుంది*.
0 Comments
Please give your comments....!!!