పరీక్ష కు రెండు రోజులనుండి పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు
OMR షీట్ లో నింపాలి.
EX: Paper code C అయితే
A ⚪
B ⚪
C ⚫
D ⚪ ఇలా నింపాలి.
గతంలో ఇలా నింపని వారి రిజల్ట్స్ *విత్ హెల్డ్* లో పెట్టడం జరిగింది.
💥ప్రిపరేషన్ ఎలా ఉంది?
బాగా ప్రిపేర్ అయ్యారని భావిస్తున్నా..
👉చాలా టెన్షన్ గా ఉంది అని అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఎలాంటి కంగారు అవసరం లేదు. పేపర్ మాములుగానే ఉంటుంది.
👉 అందరూ క్వాలిఫై అవుతారు. కాకపోతే బెటర్ మార్క్స్(100+) సాధించడానికి ట్రై చేయండి.
👉1st time tet రాసే వాళ్ళు ఇంతకు ముందు రాసిన వాళ్ళతో పోల్చుకోకండి. ఎవరి చదువు వారిదే.
👉ఈ 2days ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ నాన్ వెజ్ లకు దూరంగా ఉండండి.
👉అడగలేదు కానీ హాల్ టికెట్ తో పాటు మీ ఆధార్ (any ID proof) తీసుకెళ్ళడం బెటర్.
👉Exam centre కి కాస్త ముందుగా చేరుకోండి. మీ రూం ఎక్కడో గుర్తించండి.
👉ఇన్విజిలేటర్స్ మీకు అన్నీ సూచనలు చెబుతారు.
👉సమయం తెలియకుండానే అయిపోతుంది కావున *సమయం-ఖచ్చితత్వం* రెండు కళ్ళగా భావించండి.
👉డిజిటల్ వాచ్ లు తీసుకెళ్ళకండి. అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది.
👉ఐచ్ఛికాలు(options) దాదాపు ఓకేలా అనిపిస్తాయి. కాస్త జాగ్రత్తగా చదివి సరియైన జవాబు గుర్తించండి
👉బబ్లింగ్ సరిగా చేయండి.
👉రాని లెక్క(ప్రశ్న) కోసం ఎక్కువ టైం వేస్టు చేయకండి. ఆ లెక్క నెంబర్ ఎక్కడైనా రాసి చివరిలో దానిగురించి ఆలోచించండి.
👉రాని వాటికోసం వచ్చిన వాటిని వదిలేయకండి.
వరుసగా జవాబులు గుర్తించుకుంటూ పొండి. మధ్య మధ్యలో ఎక్కువ వదిలేస్తే మళ్ళీ అవి ఎక్కడ ఉన్నయో వెతకడం కష్టం కావచ్చు.
👉సులభమైన ప్రశ్నలకు ఎట్టిపరిస్థితిలో తప్పు జవాబు పెట్టకండి. ప్రతి మార్క్ చాల important.
👉ఇవ్వన్నీ మీకు తెలియనివి కావు. Just గుర్తు చేస్తున్నా....
*పోటీ పరీక్షలలో విజయం సాధించడం సులభం*
దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టువంటి టెట్ పరీక్షకు హాజరు కాబోతున్న అభ్యర్థులందరికీ ఇది ఒక సువర్ణావకాశం.
*అభ్యర్థులు చేయవలసిన అంశాలు*
1.పరీక్షకు ఒక రోజు ముందు నుండి ప్రశాంతంగా గడపడం.
2.విజయం సాధించగలను అనే ఆత్మవిశ్వాసం తో ఉండడం.
3. మూడు రోజుల ముందు నుండి తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని (వెజ్) స్వీకరించడం.
4. పరీక్షలకు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం.(2 బ్లాక్ పెన్నులు, హల్ టికెట్, ఏదైనా ఐడీ కార్డు, ప్యాడ్ & వాటర్ బాటిల్).
5.పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవడం(తొందరపాటు, వేగవంతమైన ప్రయాణాలు వద్దు).
*అభ్యర్థులు చేయకూడని అంశాలు*
*1. చివరి నిమిషం వరకు పుస్తకాలతో కుస్తీ పట్టడం*
పరీక్షకు దాదాపు 16 గంటల ముందు చదవడం ఆపివేయాలి. కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద కూడా చదవడం మీరు గమనించే ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎన్నటికీ విజేతలు కాలేరు, వారిని చూసి ఏకాగ్రతను కోల్పోకూడదు.
*2. ఇతరులతో పోల్చుకోవడం*
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు, ఎవరి ప్రత్యేక సామర్థ్యం వారిది అనే అంశాన్ని చదివి, పరీక్షలో కూడా దానిపైనే ప్రశ్నలు ఎదుర్కొంటూ,మళ్ళీ ఇతరులను చూసి ఆందోళన చెందడం.
*3. అనవసరమైన ఆలోచనలు, భయం, ఆందోళనలు*
ఒకటి లేదా రెండు రోజుల్లో పరీక్షలు రాయబోయే సందర్భంలో పూర్తిస్థాయిలో చదవలేదని ఆందోళన,అర్హత కాలేనేమో అనే కంగారు,
గడిచిన కాలం తిరిగి రాదని తెలిసి,భయము అవసరం లేదు.
*4. మనపై మనకు నమ్మకం లేకపోవడం*
మన ఆలోచనల ఫలితమే మన జీవన విధానం, నెగిటివ్ ఆలోచన విధానాన్ని కొనసాగించడం వల్ల నెగిటివ్ ఫలితాలే వస్తాయి.
*విజేతల మొదటి లక్షణం తనను తాను పూర్తిగా విశ్వసించడం*
విజయీభవ...✍️
Please give your comments....!!!