*1. సెక్షన్ 24 : కొత్త ఇల్లు కొనుగోలుకు తీసుకున్న గృహ రుణాలపై చెల్లించిన వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు.*
*2. సెక్షన్ 80D : బీమాలేని సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు మీరు మెడికల్ బిల్లులు చెల్లిస్తే రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.*
*3. సెక్షన్ 80D : ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్.. పర్సనల్, లైఫ్ పార్ట్‌నర్, డిపెండెంట్ చిల్డ్రన్ కోసం రూ. 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు.*
*4. సెక్షన్ 80GG : యజమాని నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందకుంటే మీ అద్దెకు రూ. 60,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.*
*5. సెక్షన్ 80DDB : నిర్దేశిత వ్యాధులతో బాధపడుతున్న డిపెండెంట్స్ చికిత్స కోసం రూ. 40,000 తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.*
*6. సెక్షన్ 80U/80DD : వికలాంగ పన్ను చెల్లింపుదారులు U/s 80U, డిజేబుల్డ్ డిపెండెంట్స్ u/s 80DD ద్వారా రూ. 75,000 నుంచి రూ. 1,25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.*
*7. సెక్షన్ 80C/CCD : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 u/s 80 C , రూ. 50,000 u/s 80CCD తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.*
*8. సెక్షన్ 80C/ 24 : మీరు ఉమ్మడి గృహ రుణగ్రహీత అయితే హోమ్ లోన్ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం రూ. 1,50,000 u/s 80C,వడ్డీ రీపేమెంట్ కోసం రూ. 2,00,000 u/s 24 క్లెయిమ్ చేయొచ్చు.80EE క్రింద మరొక 50000 అదనంగా మినహాయింపు పొందవచ్చు.*
*9. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF).. ఒక ప్రత్యేక సంస్థ అయినందున వివిధ విభాగాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు.*
*10. సెక్షన్ 80G : రిజిస్టర్డ్ ధార్మిక సంస్థలు లేదా ఎన్‌జీవోలకు చేసిన విరాళాల కోసం తగ్గింపులను క్లెయిమ్ చేయొచ్చు.*
*11. మీ మూలధన నష్టాలను మర్చిపోవద్దు. మూలధన లాభాలపై పన్నులు చెల్లిస్తున్నప్పుడు.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా, మీరు మీ నష్టాలను లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయొచ్చు.*
*ఈ సంవత్సరం మీ పన్నును ఆదా చేయడానికి లేదా వచ్చే ఏడాది పన్ను ఆదా కోసం ప్లాన్ చేసేందుకు ఈ తగ్గింపులను ఉపయోగించవచ్చు.*
Please give your comments....!!!