పిల్లలందరికీ ( 1 నుండి 5 వ తరగతి వరకు ) మౌలిక భాషా , గణిత సామార్థ్యాల సాధన కోసం ' తొలిమెట్టు ' కార్యక్రమాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుండి అమలుపరుస్తున్నారు .
♦ ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరకీ ప్రణాళికాబద్ధంగా బోధనాభ్యసన కార్యక్రమాలను అమలుపరచాల్సి ఉంటుంది . ప్రధానంగా 2020 మార్చి నుండి కరోనా మహమ్మారివల్ల పిల్లలు పూర్తిస్థాయిలో అభ్యసన ఫలితాలను సాధించడంలో వెనుకబడ్డారు . * కాబట్టి 2022-23 విద్యాసంవత్సరంలో జూన్ , జూలై , ఆగష్టు మాసాల్లో మొదట 2 నుండి 5 వ తరగతి విద్యార్థులకు ఆయా తరగతుల్లో కొనసాగుటకు అవసరమైన కనీస సామర్థ్యాల మీద దృష్టిపెట్టి బోధనాభ్యసన ప్రణాళికలను రూపొందించుకొని అమలుపరచాల్సి ఉంటుంది .
♦ ఇదే విషయాన్ని 2021 ఎన్.ఎ.ఎస్ . ఫలితాలు కూడా వెల్లడించాయి . ఇందుకోసం మొదట కనీస సామర్థ్యాల మీద అభ్యాసం కల్పించి తదుపరి తరగతి వారి సామర్థ్యాల మీద దృష్టిపెట్టాలి . * సెప్టెంబరు మాసం నుండి తరగతి వారీగా సామార్థ్యాల వారీగా అభ్యసన ఫలితాల సాధనకోసం కృషిచేయాలి . ఆ ) బోధనాభ్యసన ప్రణాళికలు 2022-23 విద్యాసంవత్సరంలోని మొత్తం పనిదినాలు 220 రోజుల్లో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం 140 రోజులు అనగా 28 వారాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు .
♦ సాధారణంగా ఒక వారానికి 6 పనిదినాలు ఉంటాయి . వీటిలో 5 రోజులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం , 1 రోజు మూల్యాంకనం , పునరభ్యాసం కోసం యించారు . ఇందుకోసం అర్ధవంతంగా , కృత్యాధార పద్ధతుల్లో , పిల్లలందరూ భాగస్వాములు అయ్యేలా 1 ) వార్షిక , 2 ) పాఠ్య / వారపు , 3 ) రోజు వారీ కాలాంశం లేదా పీరియడ్ ప్రణాళికలను రూపొందించుకోవాలి . వీటిపట్ల అవగాహన పెంపొందించుకొని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి వీటి ప్రణాళిక నమూనాలను రూపొందించారు .
ఈ క్రింద క్లిక్ చేసి మెటీరియల్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Telugu Medium Modules
EVS TM Module
English Medium Modules
Urdu Medium Modules
Thanks for sharing this sir. its very useful for us
ReplyDeletePlease give your comments....!!!