ఇవి నేర్చుకునే ముందు Tenses నేర్చుకోవాలి అప్పుడే ఇవి సులభం అవుతుంది.
ప్రతి వాక్యంలో కర్త (సబ్జెక్ట్), కర్మ (ఆబ్జెక్ట్) , క్రియ (వెర్బ్) లు ఉంటాయి. ఇలాంటి వాటిని Active Voice and Passive Voice గా రాయవచ్చు.
Active Voice and Passive Voice లు రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి కాని చెప్పే విధానం వేరు.
Active Voice:
అనగా వాక్యం లో సబ్జెక్ట్ కు ( కర్త ) కు ప్రాముఖ్యత ఉంటుంది. అనగా కర్త దృష్టి లో వాక్యం ఉంటుంది.
సూత్రం/రూపం :
కర్త + క్రియ + కర్మ
Subject + Verb+ Object
Ex:
Gopi killed a snake
S V O
గోపి ఒక పామును చంపాడు
సబ్జెక్ట్ (కర్త) = గోపి
క్రియ (వెర్బ్) = Killed ( చంపాడు )
కర్మ (ఆబ్జెక్ట్)= పాము
Passive Voice:
అనగా వాక్యం లో ఆబ్జెక్ట్ కు ( కర్మ ) కు ప్రాముఖ్యత ఉంటుంది. అనగా కర్మ దృష్టి లో వాక్యం ఉంటుంది.
సూత్రం/రూపం :
కర్మ + క్రియ + కర్త
Object + Verb+ Subject
Ex:
A snake was killed by Gopi
S V O
పాము గోపి ద్వారా చంపబడింది
కర్మ (ఆబ్జెక్ట్)= పాము
క్రియ (వెర్బ్) = Killed ( చంపాడు ) V3 ( past participle )
సబ్జెక్ట్ (కర్త) = గోపి
By = Preposition
Active Voice ను Passive Voice గా మార్చాలంటే క్రియ రూపాన్ని మార్చాలి.
Passive Voice నిర్మాణం ( Verb లో మార్పు ) ఇలా ఉంటుంది
Preposition ( b form ) + V3 ( past participle )
అనగా Active Voice లో వచ్చిన వెర్బ్ Passive Voice లో V 3 పాస్ట్ పర్టిసిప్ల్ గా మారుతుంది.
Passive Voice లలో Preposition ( b form ) గా by, ను ఎక్కువగా ఇంకా at, in, with, లను కూడా వాడతారు.
Passive Voice లను ఎక్కువ గా బిజినెస్ లెటర్స్ లలో , వార్త దినపత్రిక లలో ఎక్కువ గా వాడుతారు.
Please give your comments....!!!