Type Here to Get Search Results !

FAQs Frequently Asked Questions and Clarification on Period Plans Prepared by Ramzan Ali SGT Siddipet Dist

FAQs Frequently Asked Questions and Clarification on Period Plans Prepared by Ramzan Ali SGT Siddipet Dist 

ప్రశ్న : - మీరు రాస్తున్న పీరియడ్ ప్లాన్ లు పట్టిక రూపంలో ఉన్నాయి ఇవి పాతవా ? ఇవి ఆమోదయోగ్యమైన వెన ? మా ఆధికారులు లైన్ లోనే రాయమంటున్నారు ?

Lesson Plans రాయడం లో పాత పద్ధతి అని, కొత్త పద్ధతి అని ఏమి ఉండదు. ఆ ప్లాన్ లో పీరియడ్ ను నిర్వహించ వలసిన అంశాలు అన్ని ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. ఉర్దూ Module లో పట్టిక రూపంలో నే రాశారు గమనించగలరు.

నేను రాసిన అన్ని ప్లాన్ లు ప్రస్తుతం రోజూ రాస్తున్నాను. అంటే ఇవి పాతవి కావు.

నేను రాసే అన్ని ప్లాన్ లు Module లో నుండి copy paste చేస్తున్నాను. నేను స్వంతంగా రాసింది ఏమి లేదు. 

స్క్రీన్ షార్ట్స్, కంటెంట్ లను text బుక్స్ నుండి తీసుకున్నాను.

Module లో year ప్లాన్ మరియు నేను రాసిన పీరియడ్ ప్లాన్ లు పక్కన పెట్టు చెక్ చేయండి. మీకే తెలుస్తుంది.

Module లో నిలువులో ఉన్నాయి నేను పట్టిక లో రాశాను అంతే కానీ పట్టిక రూపంలో రాయకూడదు అని రూల్ ఎక్కడ లేదు. ఎలా రాయాలి అనేది రాసే వారి ఇష్టం. ఏమి రాసాము అనేది ముఖ్యం. దశాబ్దాల నుండి ( DED, BED ) పట్టిక రూపంలో రాస్తూ వచ్చాము ఇప్పటికీ ఇలానే రాస్తున్నారు.

కేవలం ప్రింట్ మరియు జీరాక్స్ డబ్బులు ఆదా చేయడానికి మాత్రమే ఇలా రాస్తున్నాను.

దసరా సెలవులు కు ముందు మన యూనియన్ నాయకులు అడగగా పీరియడ్ ప్లాన్ లు ఏ రకంగా ఉన్న ప్రింట్ / జీరక్స్ / పట్టిక రూపంలో ఉన్న ఆమోదించాలి అని విద్య శాఖ తెలిపింది. విద్యార్థులకు కృత్యాధార బోధన జరగాలి, పిల్లలలో అభ్యసన ఫలితాల పై దృష్టి పెట్టాలి అని తెలిపారు.

ప్రశ్న 2 : - ఒక నెలలో 20 పని దినాలు ఉంటే మీరు 8 ప్లాన్ లు మాత్రమే రాశారు ?

ఉదా కు ఇంగ్లీష్ లో ఒక నెల ( 20 పని దినాలు ) ఒక పాఠం మాత్రమే ఉంది. దీనికి 20 ప్లాన్ లు రాయాలి. కానీ నేను 8 ప్లాన్ లు మాత్రమే రాశాను. ఎందుకంటే నేను బోధించే అంశాలను దృష్టిలో పెట్టుకొని రాశాను ఒక అంశం ఒక రోజు కి మించి చెప్తాము అప్పుడు ఆ ప్లాన్ రెండు రోజుల కు వర్తిస్తుంది అని. ఒక అంశం ఎన్ని పీరియడ్ లు చెప్పాలి అని ఉపాధ్యాయులు పైన విద్యార్థుల పైన ఆధార పడి ఉంటుంది. అది నేను డిసైడ్ చేయలేను కదా...

ప్రశ్న 3 : - సూక్ష్మ సామర్థ్యాలు రాయలేదు మరి ?

సూక్ష్మ సామర్థ్యాలు అంటే ఒక పీరియడ్ లో సాధించే అభ్యాసం ఫలితాలు. ఈ అభ్యసన ఫలితాలు ను నేను Module లో నుండి రాశాను. వీటిలో నుండి ఒకటి సూక్ష్మ సామర్థ్యాలు అవుతాయి. అందుకే మళ్ళీ రాయలేదు కలిపే రాశాను. ఒకవేళ మీకు రాయాలి అనుకుంటే రాయడానికి స్థలం ఇచ్చాను.

ప్రశ్న 4 : - కొన్ని పీరియడ్ ప్లాన్ లలో తక్కువ గా రాశారు ఎందుకు ?

కొన్ని పీరియడ్ ప్లాన్ లలో తక్కువ గా రాయడం జరిగింది. ఎందుకంటే బోధన అభ్యసన ప్రక్రియ లో కొంత నేను టెక్స్ట్ బుక్ నుండి రాశాను. ఇంకా మీకు రాయాలని అనిపిస్తే రాయడానికి వీలు గా ఉండడానికి స్థలం ఇచ్చాను ఎందుకంటే తరగతి గది లో చేసే కృత్యాలు ఒక్కొక్కరి ఆలోచలను ఒక్కోరకంగా ఉంటాయి గా.

ప్రశ్న 5 : - మీరు రాసిన పీరియడ్ ప్లాన్ లు FLN ప్రకారం గా ఉన్నాయా ?

FLN పీరియడ్ ప్లాన్ లో ఉండాల్సిన అంశాలు అన్ని కూడా నేను రాసిన ప్లాన్ లో ఉన్నాయి. వీటితో పాటు extra గా అంటే FLN కి అదనంగా కొన్ని చేర్చాను.అవి

1. విద్య ప్రమాణాలు
2. మూల్యాంకనం FA ల కోసం ( తరగతి గదిలో అడిగేవి )
3. ఇంటి పని ( FA రాత పని )
4. ప్రాజెక్ట్ వర్క్ SA , FA ల కోసం

ఇవి FLN పీరియడ్ ప్లాన్ లో లేవు కానీ ప్రతి పీరియడ్ ప్లాన్ లో ఇవి తప్పకుండా ఉండాలి . 

ప్రశ్న 6 :- మీ ప్లాన్ లో కొన్ని చోట్ల పేజీ నంబర్స్, పీరియడ్ నంబర్స్ తప్పు గా ఉన్నాయి . ఎందుకు ?

పీరియడ్స్ ప్లాన్ లో టాపిక్ చోట పేజీ నంబర్, దాని కింద పీరియడ్ నంబర్ ల వద్ద మాత్రమే ఇలా జరిగింది. దీనికి కారణం టైపింగ్ లో తప్పులు పోవడమే. తొందరగా కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఒక్కడినే 18 సబ్జెక్ట్ లు రాయడం వారిని డిజిటల్ గా pdf లో చేయడం నాకు జరిగే పని ఒత్తిడి కారణం . దయచేసి అర్థం చేసుకోగలరు.

ప్రశ్న 7 :- మీ సైట్ లో అన్ని పాఠాల పీరియడ్ ప్లాన్ లు లేవు కొన్ని మాత్రమే ఉన్నాయి. ?

ఒక నెలలో ఎన్ని పాఠాలు ఉన్నాయో అన్ని పాఠాలు పీరియడ్ ప్లాన్ లు ఆ నెలలో రోజు సాయంత్రం పూట రాస్తున్నాను. ఒక్కో సబ్జెక్ట్ కు దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. పైగా అన్ని పాఠాలు ఒకే నెలలో చెప్పము కదా. అన్ని ఒకేసారి రాయడం నాకు ఎలా కుదురుతుంది ? ఉండేది ఒక సాయంత్రం పూట అప్పుడు రాస్తేనే ఈ మాత్రం సాధ్యం అవుతుంది. ప్రతి నెల మీ సమయానికి అప్ లోడ్ చేస్తున్నాను. 

ప్రశ్న 8 : - జూన్ జూలై నెలలో వి పీరియడ్ ప్లాన్ లేవు కదా సర్ ?

FLN కార్యక్రమం మరియు ఈ విద్య సంవత్సరము లో పాఠ్య పుస్తకాలు ఆగస్ట్ నెలలో వచ్చాయి. జూన్ జూలై లోని చాలా పాఠ్య అంశాల పీరియడ్ ప్లాన్ లు FLN Module లో ఉన్నాయి. మన పాఠశాలకు వచ్చే అధికారులు ప్రస్తుతం బోధించే అంశాల పీరియడ్ ప్లాన్ లు మాత్రమే అడగాలి. అందుచే నేను ఆగస్ట్ నెల నుండి రాయడం మొదలు పెట్టాను. ప్రస్తుత నెలవి రాయడం అత్యవసరం కావున ఇలా రాస్తూ వెళుతున్నాను. నాకు సమయం ఉన్నప్పుడు జూన్ జూలై నెలలో వి కూడా రాస్తాను.


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night