*దాదాపుగా 2 గంటల 30 నిమిషాల సేపు జరిగిన ఈ జూమ్ వెబినార్ లో సూచించిన అంశాలు:-*
*దసరా సెలవుల కంటే ముందుగా జరిగిన FLN అమలులో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల దృష్టికి వచ్చిన అంశాలు చూస్తే…*
*యాత్రిక బోధన*
*5+1 విధానం*
*లైబ్రరీ పీరియడ్ నిర్వహణ తీరు*
*45 నిమిషాల+45 నిమిషాల నిర్వహణ*
*తరగతి గది బోధనలో పాఠ్య పుస్తకాల వినియోగం*
ఈ నెల అక్టోబర్ 31 వరకు FLN పరిశీలకులు చూసే అంశాలు:-
*FLN కార్యక్రమ అమలు*
*తరగతి గది పరిశీలన*
*స్పాట్ అసెస్ మెంట్*
పై అంశాలన్నింటిలో “తరగతి గది పరిశీలన” కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఇందుకోసం
*పాఠ్య పుస్తకం ఆధారంగా బోధన జరగాలి.*
*బోధనలో అవసరమైన TLM వినియోగం*
*సోఫానాల ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి.*
*ఈ 15 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా FLN కార్యక్రమమును ఉద్యమ స్పూర్తిగా అమలు చేయాలని అందరు పరిశీలకులకు సూచించారు.*
*ఈ 2 వారాలలో ఖచ్చితంగా “బోధనాభ్యసన ప్రక్రియలలో మార్పు” రావాలని సూచించారు.*
మరి పాఠశాల స్థాయిలో ఏం జరగాలి?
*HM పాఠశాల స్థాయిలో బోధనను పరిశీలిస్తూ ఉండాలి.తరగతి గది బోధనలో మార్పునకు తోడ్పడాలి.*
*టైం టేబుల్ ప్రకారం బోధన జరగాలి.*
*ఉపన్యాస పద్ధతిలో బోధన కాకుండా ఇంటరాక్టివ్ పద్ధతిలో బోధన జరగాలి.*
*మాడ్యుల్ లో తెలిపిన ప్రకారం విషయ వారీగా తరగతి గది నిర్వహణ ఉండాలి.*
*ప్రతి ౩వ శనివారం నిర్వహించే PTA సమావేశాల్లో పిల్లల అభ్యసన ప్రగతిని ప్రదర్శించాలి.*
*లైబ్రరీ పీరియడ్ నిర్వహణ అన్ని తరగతులకు ఒకే సమయంలో ఉండకుండా చూడాలి.( ఎందుకంటే పుస్తకాల కొరత, అందరిపై ఒకే సారి శ్రద్ధ చూపలేము కాబట్టి)*
చెప్పిన అంశాలలో 80 % మంది పిల్లలు ఆశించిన సామర్థ్యాలు సాధిస్తేనే తర్వాతి పాఠం కు వెళ్ళాలి.
*తరగతి గదిలో విషయాల వారీగా పాఠ్య ప్రణాళికల సోఫానాలను తెలిపే చార్టులు ఉండాలి. దీనివల్ల వచ్చిన పరిశీలకులకు పని సులభతరం అవుతుంది.*
కాంప్లెక్స్ స్థాయిలో ఏం జరగాలి?
*అవసరం ఉన్నంత మేరకే రిసోర్స్ పర్సన్స్ ను వాడుకోవాలి.*
*పరిశీలన సమయంలో ఉత్పన్న మైన సమస్యలు, అంశాలపై చర్చ జరగాలి.*
*పరిశీలన అంటే తరగతి గది పరిశీలనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.*
*పరిశీలన అంటే ఏదో భయానక వాతావరణం సృష్టించడం కాకుండా వెళ్ళిన చోట బోధనలో మార్పునకు తెలిపే సహాయ సహకారాలు అందించాలి. ఇందుకోసం రిసోర్స్ బృందాల సహకారం తీసుకోవాలి.*
సమీక్షా సమావేశాల నిర్వహణ
*ప్రతి నెల 27,28 మండల స్థాయి*
*29 జిల్లా స్థాయి*
*30 రాష్ట్ర స్థాయి*
ఉపాధ్యాయుల నుండి వచ్చిన అభ్యర్ధనల మేరకు SCERT వెబ్ సైట్ లో అన్ని ప్రణాళికలు త్వరలోనే అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ఈ వెబినార్ సారాంశం ఒక్క మాటల్లో..
*భోధనభ్యసనలో మార్పు తక్షణ లక్ష్యంగా సూచించారు.*
Click here to Download PDF Orders
Please give your comments....!!!