| తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేని పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ తరగతులను బోధించే పరిస్థితిని " బహుళ తరగతి బోధన " అంటాము .
| ఒక ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ లో ఒకే తరగతికి బోధిస్తున్నప్పుడు కూడా ఆ తరగతిలో వివిధ స్థాయిల విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఉంటుంది . దీనినే " బహుళ స్థాయి బోధన " అంటాము .
1 వేరు వేరు తరగతులలోని విద్యార్థులను వారి స్థాయిలకు అనుగుణంగా సమూహాలు చేసి బోధించడం కూడా " బహుళ స్థాయి బోధన " అవుతుంది .
బహుళ తరగతి , బహుళ స్థాయి బోధన - సమస్యలు , సవాళ్లు
| ఒకటి కంటే ఎక్కువ తరగతులకు ఒకేసారి సమర్థవంతంగా బోధించలేకపోవడం , బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోవడం .
1 ఒకటికి మించి ఎక్కువ విషయాలు ( subjects ) ఒకేసారి సమర్థవంతంగా బోధించలేక పోవడం .
| తగినంత సమయం లేకపోవడం వల్ల విద్యార్థి కేంద్రీకృత బోధనకు మరియు కృత్యాధార బోధన పూర్తి స్థాయిలో జరగకపోవడం .
సిలబస్ ప్రకారం అన్నీ తరగతుల పాఠాలను పూర్తి చేయలేకపోవడం .
| | అన్ని తరగతుల పిల్లలు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల నిర్వహణ కష్టంగా మారడం .
| ఆయా తరగతులకు సంబంధించిన ప్రణాళికలన్నీ తయారు చేసుకోలేకపోవడం . తద్వారా బోధనకు సంసిద్ధులు కాలేకపోవడం .
| బోధన అభ్యసన సామగ్రి వినియోగంలో ఇబ్బందులు ఎదురుకోవడం .
। బోధనాభ్యసన ప్రక్రియల్లో ఎదురయ్యే సమస్యలను ఇతర ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం లేకపోవడం . తద్వారా ఉపాధ్యాయుల్లో తాము ఒంటరి వారని , నిస్సహాయులని భావన కలగడం .
1 బోధన యాంత్రికంగా మారడం .
1 బోధనేతర పనులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు ఆటంకంగా నిలవడం .
| ఉపాధ్యాయుల గైర్హాజరు ప్రభావం విద్యార్థుల అభ్యసనపై ఎక్కువగా ఉండడం .
ఈ సమస్యలు , సవాళ్లను అధిగమించడం ఎలా ?
| బోధించవలసిన తరగతుల సంఖ్య , విషయాలను దృష్టిలో పెట్టుకుని ఉన్న సమయము , వనరులు సద్వినియోగం అయ్యేలా కాలనిర్ణయ పట్టికలు , బోధనాభ్యసన ప్రక్రియలు తయారు చేసుకోవాలి .
! అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి విద్యార్థులందరూ అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ , ఉపాధ్యాయుడికి కనబడేటట్లు కూర్చోపెట్టుకోవాలి
| బహుళ తరగతి , బహుళ స్థాయి బోధనలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి , గుణాత్మకతను సాధించడం కోసం అవసరమైన బోధనాభ్యసన ప్రక్రియలు కల్పించాలి .
| ఎలాగైనా సిలబస్ పూర్తి చేయాలనే ఒత్తిడికి గురి అవ్వకుండా , అభ్యసన ఫలితాల సాధన కోసం కృషి చేయాలి .
బోధనాభ్యసన ప్రక్రియల సమయంలో , ముఖ్యంగా పరోక్ష బోధన సమయంలో విద్యార్థులను పూర్తిగా నిమగ్నం చేసే TLM ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి .
| | ఉపాధ్యాయునికి సహాయ సహకారాలు అందించడానికి అన్ని స్థాయిలలో విషయ నిపుణులు , అధికారులు , FLN నోడల్ అధికారులు , పాఠశాల సముదాయాల సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు . అవసరమైనప్పుడు వారి సహాయం తీసుకోవాలి .
| బహుళ తరగతి బోధన ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి అందరి సహకారంతో , సానుకూల దృక్పథంతో సరైన ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు వెళ్ళాలి .
తరగతి వారీగా ఉపాధ్యాయుల బాధ్యతల పంపిణీ
బహుళ తరగతి బోధనలో కొన్ని ముఖ్యమైన వ్యూహాలు :
విద్యార్థులను జతలుగా చేసి కృత్యాలు చేయించడం . చిన్న చిన్న జట్లలో పని చేయించడం .
వ్యక్తిగత అభ్యాస కృత్యాలు ఇవ్వడం .
| పాఠ్య పుస్తకాలలో QR కోడ్లను వినియోగించి కృత్యాలను ఇవ్వడం .
1 | డిజిటల్ వనరులు అనగా టివి , ఇతర దృశ్య శ్రవణ సామాగ్రి వినియోగించడం .
బోధనాభ్యసన సామాగ్రి ద్వారా పిల్లలకు కృత్యాలు నిర్వహించడం .
కృత్యపత్రాలు , వర్కుబుక్స్ ద్వారా అభ్యాసం కల్పించడం .
| | పాఠ్య పుస్తకం లోని అభ్యాసాల ద్వారా అభ్యాసం కల్పించడం .
| అన్వేషణా కృత్యాలు , ప్రాజెక్టు పనులు వంటివి నిర్వహించడం .
| కలరింగ్ , చిత్రలేఖనం ( డ్రాయింగ్ ) ఓరిగామి నమూనాలు తయారు చేయడం వంటి కృత్యాలు నిర్వహించడం .
| అభ్యసనా క్రీడలలో నిమగ్నం చేయడం
అంత్యాక్షరి కార్డు గేమ్ , పాచికలు ( డైస్ ) , వైకుంఠపాళి , బింగో , స్నాప్ , డామినో , తంబోలా మొదలగునవి
| పదనిర్మాణ కృత్యాలు , క్విజ్ నిర్వహణ మొదలగునవి .
| పఠన కృత్యాలు / గ్రంథాలయ పుస్తక పఠనం చేయించడం .
| లర్నింగ్ కార్నర్ ద్వారా అభ్యాసం కల్పించడం .
విద్యార్థులను బహుళ తరగతి గదిలో కూర్చో బెట్టడం ఎలా ?
బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు వ్యూహాలు :
తెలుగు , గణితం
| అకడమిక్ కాలెండర్ ప్రకారం తెలుగుకు , గణితానికి 90 నిముషాల పీరియడ్ కేటాయించబడింది .
| ఒక ఉపాధ్యాయుడు 2 తరగతులకు ఏకకాలంలో బోధిస్తుంటే ప్రతి తరగతికి 45 నిముషాలు ప్రత్యక్ష బోధనకు 45 నిముషాలు అభ్యాస కృత్యాలకు వినియోగించుకోవాలి .
| ఒక తరగతికి ప్రత్యక్ష బోధన జరిగేటప్పుడు మరొక తరగతి విద్యార్థులకు అభ్యాస కృత్యాలు ఇవ్వాలి .
| ఒక ఉపాధ్యాయుడు 3 తరగతులకు ఏకకాలంలో బోధిస్తుంటే ప్రతి తరగతికి 30 నిముషాలు బోధనకు 60 నిముషాలు అభ్యాస కృత్యాలకు వినియోగించుకోవాలి .
| ఒక ఉపాధ్యాయుడు 4 లేదా 5 తరగతులకు ఏకకాలంలో బోధిస్తుంటే వారిని రెండు సమూహాలుగా ( 1 , 2 తరగతులు ఒక సమూహం , 3 , 4 , 5 తరగతులు ఒక సమూహం ) చేసుకొని ప్రతి సమూహానికి 45 నిముషాలు ప్రత్యక్ష బోధన 45 నిముషాలు అభ్యాస కృత్యాలు ఇవ్వాలి .
| ఒక సమూహానికి ప్రత్యక్ష బోధన జరిగేటప్పుడు మరొక సమూహానికి అభ్యాస కృత్యాలు ఇవ్వాలి .
| అకడమిక్ కాలెండర్ ప్రకారం EVS కు , ఇంగ్లీష్ కు 45 నిముషాల పీరియడ్ కేటాయించబడింది .
EVS
| ఒక ఉపాధ్యాయుడు 2 తరగతులకు EVS ఏకకాలంలో బోధిస్తుంటే ప్రతి తరగతికి ఒకరోజు ప్రత్యక్ష బోధనకు తరువాతిరోజు అభ్యాస కృత్యాలకు వినియోగించుకోవచ్చు .
| ఒక ఉపాధ్యాయుడు 3 తరగతులకు ఏక కాలంలో బోధిస్తుంటే వారిని రెండు సమూహాలుగా ( 3 , 4 తరగతులు ఒక సమూహం , 5 వ తరగతి ఒక సమూహం ) చేసుకొని ప్రతి సమూహానికి ఒకరోజు ప్రత్యక్ష బోధనకు తరువాతి రోజు అభ్యాస కృత్యాలకు వినియోగించుకోవచ్చు .
| ఒక సమూహానికి ప్రత్యక్ష బోధన జరిగే రోజు మరొక సమూహానికి అభ్యాస కృత్యాలు ఇవ్వాలి .
1 ఒక ఉపాధ్యాయుడు 4 లేదా 5 తరగతులకు ఏకకాలంలో బోధిస్తుంటే వారిని 3 సమూహాలుగా ( 1 , 2 తరగతులు ఒక సమూహం ; 3 , 4 తరగతులు ఒక సమూహం , 5 వ తరగతి ఒక సమూహం ) చేసుకొని 1 , 2 తరగతులకు ఇంగ్లీష్క సంబంధించిన కృత్యాలు ఇచ్చి 3 , 4 , 5 తరగతులకు పైన చెప్పిన విధంగా ఒకరోజు ప్రత్యక్ష బోధన , తరువాతిరోజు అభ్యస కృత్యాలు ఇవ్వాలి .
ఇంగ్లీష్
| జూన్ మరియు జులైలలో , బ్రిడ్జి గ్యాప్ కృత్యాలు నిర్వహించేటప్పుడు ఎన్ని తరగతులు బోధిస్తుంటే అన్ని తరగతులకు కలిపి ఒకే చిత్రాన్ని వాడుతూ పిక్చర్ ఇంటరాక్షన్ చేయించాలి .
| పిక్చర్ ఇంటరాక్షన్ తర్వాత ఇచ్చే కృత్యాలు వారి వ్యక్తిగత స్థాయిని బట్టి ఇవ్వాలి .
రెగ్యులర్ పాఠాలు మొదలు అయ్యాక :
| ఒక ఉపాధ్యాయుడు 2 తరగతులకు ఏక కాలంలో బోధిస్తుంటే ప్రిలిమినరీ ఇంటరాక్షన్ కోసం మొదటి 5 నిమిషాలు మరియు ప్రతి తరగతికి 20 నిమిషాల ఆక్టివ్ ట్రాన్సాక్షన్ చేయాలి .
📑 *ప్రాథమిక పాఠశాలల TIME TABLES*
*( CCE ప్రకారం )*
👉 *CCE ప్రకారం వివిధ రకాల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ వారీగా మరియు తరగతుల వారిగా టైమ్ టేబుల్ లు తయారు చేశారు.*
👉 *CCE ప్రకారం టైమ్ టేబుల్ తయారు చేయుట కొరకు దృష్టి లో ఉంచుకోవల్సిన అంశాలు, సాధారణ టైమ్ టేబుల్ కొరకు క్రింద క్లిక్ చేయండి*
👉 *ఆరుగురు పని చేసే పాఠశాలల టైమ్ టేబుల్ లు*
👉 *అయిదుగురు పని చేసే పాఠశాలల టైమ్ టేబుల్ లు*
👉 *నలుగురు పని చేసే పాఠశాలల టైమ్ టేబుల్ లు*
👉 *ముగ్గురు పని చేసే పాఠశాలల టైమ్ టేబుల్ లు*
👉 *ఇద్దరు పని చేసే పాఠశాలల టైమ్ టేబుల్ లు*
👉 *ఒకరే పని చేసే పాఠశాలల టైమ్ టేబుల్ లు*
Please give your comments....!!!