Type Here to Get Search Results !

School Library Management Procedures, Stock Register, Issue Register Model Registers, New Blank Printable Registers

School Library పాఠశాల గ్రంథాలయం నిర్వహణ విధానాలు, స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్ మోడల్ రిజిస్టర్ లు, కొత్త ఖాళీ ప్రింట్ తీసుకునే రిజిస్టర్ లు

ముఖ్యాంశాలు

1. గ్రంథాలయం ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆ పుస్తకాలు పిల్లలకు అందేలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఉంచడం అంతే ముఖ్యం
2. టైమ్ టేబుల్ లో ప్రతి తరగతి కి ఒక పీరియడ్ కేటాయించాలి. ఆ సమయమూ లో చదివేలా చూడాలి. ఇంటర్ వెల్, లంచ్ టైం లో కూడా చదువుకోవచ్చు. 
3. పుస్తకాలు ఇంటికి ఇవ్వాలి. వారం లోపల తిరిగి తీసుకోవాలి.
4. పుస్తకాలను చాలా భద్రంగా ఉంచాలి. పుస్తకాలు ఉండే చోటు శుభ్రంగా ఉండాలి. వర్షం నీరు చేరకుండా, దుమ్ము ధూళి రాకుండా ఉండాలి.
5. పిల్లలకు చదవడం రాకపోయినా వారి కి సరి పోయే అనగా చిత్రాలు ఉన్న పుస్తకాలు వగైరా ఇవ్వాలి. 
6. పుస్తకాలు ఎలా భద్రంగా ఉంచాలి అనే విషయం పై పిల్లలకు తరచూ గా చెప్తూ ఉండాలి. ఇంటికి ఇచ్చినప్పుడు నీరు లేనిచోట, చిన్న పిల్లలకి అందకుండా దాచిపెట్టడం మంచిది అని చెప్పాలి.
7. పుస్తకాలను వరుస క్రమంలో పిల్లల స్థాయి తరగతి తగ్గట్టు గా ఏర్పాటు చేయాలి. అనగా చదువు రాని వారికి బొమ్మల పుస్తకాలు కొంచెం చదువు వచ్చిన వారికి పెద్ద పెద్ద పదాలు ఉన్న పుస్తకాలు, బాగా చదివే వారికి మిగిలిన పుస్తకాలు ఇవ్వాలి.
8. ఒక వేళ మీ బడి లో లైబ్రరీ పుస్తకాలు లేకపోతే స్కూల్ గ్రాంట్ నుండి తక్కువ ధరలో దొరికే పుస్తకాలు కొనవచ్చు. లేదా వివిధ రకాల వార్త పేపర్ ల ఆదివారం పుస్తకాలు ఉదా ఈనాడు ఆదివారం, ఈనాడు బాల భారతం మాస పత్రిక, దిన పత్రిక లలో వచ్చే పిల్లల పేజీలను పాతవి సేకరించి గ్రంథాలయం లో ఏర్పాటు చేయవచ్చు.
9. గ్రంథాలయం లో చదవడం పూర్తి అయ్యాక ఎక్కడివి అక్కడనే పెట్టాలి 
10. ఒకవేళ పుస్తకాలు చినిగిన వెంటనే అరికించాలి.
11. పుస్తకాలు ఇంటికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన రోజు పుస్తకం పేరు లేదా నంబర్ , తేదీ రాయాలి. వారం కి తిరిగి తీసుకున్నపప్పుడు పేరు లేదా నంబర్ తేదీ రాయాలి.
12. గ్రంథాలయం కి రెండు రిజిస్టర్ లు ఏర్పాటు చేయాలి 
13. 1. గ్రంథాలయం స్టాక్ రిజిస్టర్
14. 2. ఇస్స్యూ రిజిస్టర్
15. 1. గ్రంథాలయం స్టాక్ రిజిస్టర్: ప్రతి పుస్తకం ను కొన్నప్పుడు లేదా సేకరించినప్పుడు దాని వివరాలు అనగా కొన్న తేదీ, పేరు, ధర , నంబర్ రాయాలి. ఆ పుస్తకం మీద మార్కర్ తో ఆ బుక్ వరుస నంబర్ రాయాలి.
16. 2. ఇష్ష్యూ రిజిస్టర్ : పిల్లలకు పుస్తకం ఇంటికి ఇచ్చినప్పుడు , తీసుకున్నపుడు ఆ బుక్ నంబర్, తేదీ రాయాలి.
17. ఈ రిజిస్టర్ ల నిర్వహణ రాయడం , ఇంటికి ఇవ్వడం, తిరిగి తీసుకోవడం లాంటి పనులు తరగతి కి ఒక పిల్లలకి చేత చేయించాలి.
18. రీడింగ్ రిజిస్టర్: గ్రంథాలయం లో చదివించినప్పుడు ఏ పుస్తకం చదివించిన మో, ఎంత మంది పిల్లలు హాజరు అయ్యారు? ఏ పద్ధతి వాడారో రాయాలి.ఇది టీచర్ రాయాలి
ఉదా : 254 నంబర్ గల పుస్తకం ను జంటలుగా చదవడం చేస్తే 14 మంది హాజరు అయితే ఇలా చిన్న గా రాయవచ్చు.
PR - 254/14
PR అంటే Paired Reading అని

చదవడం దశలు:

1. Read Aloud బిగ్గరగా చదవడం: RA 
పుస్తకాన్ని ఉపాధ్యాయుడు చదివి వినిపించాలి. తర్వాత ఆ బుక్ లో నుండి ప్రశ్నలు అడగాలి.

2. Paired Reading జంటలుగా చదవడం PR: పిల్లలను జంటలు గా కూర్చో బెట్టి చదివించడం.

3. సహ పఠనం Shared Reading SR: ఒకే రకమైన పుస్తకాలు రెండు కంటే ఎక్కువ బుక్ లు ఉన్నప్పుడు ఒక బుక్ ను సర్ చదువుతూ మిగిలిన పుస్తకాలు ను పిల్లలను వేలు పెట్టి చదవమనాలి.

4. స్వంత పఠనం Independent Reading IR:
పిల్లలకు పుస్తకాలు తీసుకోమని చెప్పి వారినే స్వంతంగా చదువుకోమనాలి.

గమనిక : గ్రంథాలయ రూం లోకి గాని పుస్తకాలు చదువు కునే మంది ప్రతిసారీ వారికి జాగ్రతలు చెప్పాలి. పుస్తకాలు చదివినా తర్వాత పిల్లలను ఆ కథకు సంబంధించిన ప్రశ్నలు అడగాలి ఉదా ఈ కథ లో ఏముంది ? నీ స్వంత మాటల్లో చెప్పండి? ఇందులో నికు ఏమి నచ్చింది ? ముఖ్య పాత్ర ఎవరిది ? ఎవరికి ఏమి జరిగింది ? ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా ?

గ్రంథాలయం లో ఉండాల్సిన అంశాలు

చార్ట్, A - 4 పేపర్, క్రయాన్స్ , ఫెవికాల్, పిన్ బోర్డ్ , వాటర్ కలర్స్ ,ఎరేజర్, మార్కర్, పర్మినెంట్ మార్కర్, రివర్సబుల్ టేప్, స్కెచ్ లు వగైరా...

Sctock Register Model


Reading Register Model ( In Library )

Books Issue Register Model 

పై రిజిస్టర్ లు అన్ని ఎంప్టీ లేదా ఖాళివి ప్రింట్ తీసుకునే రిజిస్టర్ లు మీరు రాసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి ఈ క్రింద పేరుల మీద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి




ఒక వేళ గ్రంథాలయం కు ప్రత్యేక గది లేకపోతే, తరగతి గదిలో నే ఈ క్రింది విధంగా గ్రంథాలయం ను ఏర్పరచాలి

Category

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please give your comments....!!!

View as Night