● జగనన్న విద్యాకానుక’లో భాగంగా ప్రతి విద్యార్థికి జత బూట్లు ప్రభుత్వం సరఫరా చేస్తుంది .
విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునే విధానం విద్యార్థి కాలికి సరిపోయేలా బూట్లు అందజేసేందుకు ప్రతి విద్యార్థి పాదాల కొలతలు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి
. మీ పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఈ నమూనా పత్రాన్ని అందజేసి , ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది సహకారంతో కొలతలు తీసుకోవాలి .
పెన్ / మార్కర్ , స్కేలు , ఈ నమూనా పత్రం సిద్ధం చేసుకోవాలి .
నమూనా పత్రం వెనకవైపు ఉన్న పాదముద్ర కొలతపై విద్యార్థిని నిటారుగా నిల్చోమనాలి .
నిర్దేశించిన విధంగా కొలతలు తీసుకునేందుకు విద్యార్థి పాదం మడమ భాగం ' A ' దగ్గర ఒక గీత , బొటనవేలి భాగం ' B ' దగ్గర ఒక గీత గీసుకోవాలి .
ఉదాహరణకు : విద్యార్థి పాదం మడమ భాగం ‘ A ’ నుంచి బొటనవేలి భాగం ‘ B ’ దగ్గర 17 సెంటీ మీటర్లు ఉందనుకోండి .
విద్యార్థి పాదం బొటనవేలి కొన ' B ' లో ఎన్ని సెంటీమీటర్లు ఉంటే ఆ కొలత వివరాలు దిగువ బాక్సులో నింపాలి .
ప్రధానోపాధ్యాయుడు ఈ కొలతల నమూనా పత్రాన్ని తన వద్ద భద్రపరచుకోవాలి ప్రధానోపాధ్యాయుడు JVK యాప్లో కొలత నమోదు చేయాలి .
0 Comments
Please give your comments....!!!