Guruvu.In

PTA Meeting Guidelines in Telugu to be conducted on 17/12/2022 and invitation cards

*గౌరవనీయులైన మండల విద్యాశాఖ అధికారులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా 17.12. 2022 మూడవ శనివారము రోజున మనము గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాల మేరకు పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించవలెను*

✴️✳️ *PTM-తల్లిదండ్రుల సమావేశాలు-విధివి ధానాలు*✳️✴️
 
❇️ప్రతినెల మూడవ శనివారం పాఠశాలలో తరగతి వారి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి.
 ❇️ఒకవేళ మూడవ శనివారం సెలవు దినం అయితే నాలుగో శనివారం రోజున సమావేశం నిర్వహించాలి.
*❇️ప్రతీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఒక రోజు ముందుగానే ఆహ్వాన పత్రం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశ సమాచారం పంపించి ఆహ్వానించాలి.*

✴️ *సమావేశ లక్ష్యాలు:*
1. పాఠశాలను, తల్లిదండ్రులతో మరియు సమాజంతో అనుసంధానం చేయుట.
2. ప్రతి తరగతిలోని విద్యార్థుల యొక్క ప్రగతిని, వివిధ రంగాలలో విద్యార్థులు కనబరిచిన సామర్ధ్యాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయుట.
3. విద్యార్థుల ప్రగతికి మరియు పాఠశాలలో విద్యార్థుల విద్యాపరమైన, పాఠశాల సంస్ఠాగతపరమైన అభివృద్ధికి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయుట.

 ✴️ *చర్చించే అంశాలు:*
  ❇️విద్యాపరమైన, సాంస్కృతికపరమైన అంశాలలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలి.
❇️ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం అమలుపై విషయావగాహన కల్పించాలి.
 ❇️మన ఊరు-మన బడి మరియు ఆంగ్ల మాధ్యమ బోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
❇️ విద్యార్థుల హాజరు పెంపుదలకోసం తీసుకొనే చర్యలపై చర్చలు నిర్వహించాలి.
 ❇️విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పై తల్లిదండ్రులతో చర్చించాలి.
 ❇️పాఠశాల ప్రగతికి తగు సూచనలు సలహాలు తీసుకోవాలి.
 ❇️మధ్యాహ్న భోజన అమలుపై చర్చ జరపాలి.
 ❇️విద్యార్థులు ఇంటి వద్ద అభ్యసనం చేయడం కోసం తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలి.
 ❇️సమావేశం రోజు నో బాగ్ డే మరియు బాల సభ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
 ❇️విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు అవకాశాలు స్కాలర్ షిప్ లు వంటి విషయాలను వారికీ తెలియజేయాలి.

 ✴️ *ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు:*
 ❇️ప్రధానోపాధ్యాయుడు గ్రామ సర్పంచ్, ఎస్ఎంసి చైర్మన్, ఎస్ఎంసి సభ్యులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయ సంఘాల సభ్యులు మొదలగు వారితో ముందుగా సమావేశం ఏర్పరిచి, తల్లిదండ్రుల సమావేశాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి.
 ❇️సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు 100% హాజరయ్యేందుకు SMC/స్వయం సహాయ సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలి.
 *❇️ప్రతి సమావేశంలో చేసిన తీర్మానాలను ఓక రిజిస్టర్లో నమోదు చేయాలి. వాటిపై తదుపరి సమావేశంలో సమీక్ష జరపాలి.*

 ✴️ *ఉపాధ్యాయుల బాధ్యతలు:*
 ❇️తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు బలహీనతలు తరగతి వారీగా, విషయాల వారీగా గుర్తించి, విద్యార్థి వారీగా ప్రొఫైల్ లను తయారు చేయాలి.
 ❇️విద్యార్థుల ప్రగతిని తెలుపుతూ, పాఠశాలలో నిర్వహించు వివిధ రకాల పోటీ పరీక్షలు ఇన్స్పైర్, ఎన్ఎంఎంఎస్, ఎన్ టి ఎస్ ఈ, ఒలింపియాడ్స్, ఆన్లైన్ క్విజ్ లు వంటి వాటి గురించి తెలియపరచాలి.
 ❇️విద్యార్థుల విద్యాపరమైన, సాంస్కృతికపరమైన, ఆరోగ్యపరమైన, మానసిక స్థితిగతుల పైన, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు మొదలైన వాటి గురించి చర్చ జరపాలి.
 ❇️విద్యార్థుల అభ్యసన మెరుగుదలకు తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వాటిపై చర్చలు నిర్వహించాలి.

 ఇట్టి సమావేశాలను గౌరవ ఎస్ పి డి మేడం శ్రీమతి దేవసేన గారు మరియు ఏ ఎస్ పి డి శ్రీ రమేష్ గారు, స్టేట్ టీం మరియు జిల్లా టీమ్స్ పర్యవేక్షిస్తారు కావున జిల్లాలోని అందరు M E O లు / CRC HM లు తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో PTM సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరడమైనది.

Click here to Download PDF file of Parents Teachers Meeting Readymade Invitation Card 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts