Guruvu.In

Important information About Income Tax E- Filing , TDS- (2022 - 23) Financial year

*Important information About Income Tax E- Filing , TDS- (2022 - 23) Financial year*

------------------------------------------
 *మనము Salary పొందిన 2022 -23 FinanciaL Year Data ను* 
*ప్రస్తుత 2023 -24 లో ఈ -Filing చేసుకుంటాము. ఈవిధంగా👉 E-FilinG చేసుకునే 2023 -24 Year ను Assessment Year గా అర్థం చేసుకోవాలి..Employess Tax పడ నప్పటికీ ( Zero TaX) కూడా ఈ - Filing చేసుకోవాలి.*
----------------------------------------------
*అందరు ఉద్యోగులు E-FilinG ను Income TaX Dept. మనకు సూచించిన గడువు తేదీ లోగా తప్పక చేసుకోవాలి... లేదంటే మళ్లీ Fine కట్టి చేసుకోవలసి రావచ్చు... క్రింది Matter చదవండి.*
-----------------------------------------
*దయచేసి ఓపిక తో మొత్తం మెసేజ్* *రెండు సార్లు చదవండి... IT గురించి*
*ఒక మంచి అవగాహన వస్తుంది.ఉద్యోగం మరియు IT విషయంలో క్లారిటీగా వుండటానికి అవకాశం వుంటుంది.*🙏
-------------------------------------
*INFORMATION ABOUT*👇👇👇
*1)Income Tax Cut అయ్యాక ఎం చేయాలి*
*2)TDS అంటే ఎంటి..?*
*3) - E-Filing ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఎప్పుడు చేయాలి..?*
---------------------------------------------

*అసలు E - Filing అంటే ఏమిటో చూద్దాము..*


*అసలు E - Filing ఎపుడు చేస్తాం..❓*

*E - Filing ఎవరు చేయాలి...❓*
*అంటే,*
*DDO చేయాలా...❓లేక* *Employee వ్యక్తిగతంగా చేసుకోవాలా...❓*
*ఇంతకీ మనకు జీతం ఇచ్చే వారికి ( DDO)*
*IT విషయంలో వారి బాధ్యత ఏ మిటి...❓❓ చూద్దాం.*
----------------------------------------
*జీతం ఇచ్చే వారిని లేదా Salary Bill చేసే వారిని Drawing & Disbursing officer లేదా DDO అంటారు.*
----------------------------------------
*మన జీతం లో ప్రతీ నెలా లేదా February నెలలో మన Salary ని బట్టి income tax లెక్క చేసి Tax Amount Cut చేస్తారు.*
---------------------------------------
*Tax ను జీతం నుండి మినహాయించి న తర్వాత*
*DDO లు Certified Charted Accountant దగ్గర TDS* *చేయించాలి.*
*TDS అంటే Tax Deducted At Source.*
*అంటే ఎంత TAX ప్రతినెలా cut చేశారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న Income* *Tax Department కు తెలియచేయడం అన్నమాట.*
*DDO తన కింద వున్న Employees కు Deduct చేసిన TAX వివరాలు ప్రతీ 3 నెలలకు* *ఒకసారి CA దగ్గర TDS చేయించాలి. Yearly ఇది 4 సార్లు DDO లు చేయించాలి.*
*దీనితో DDO ల బాధ్యత పూర్తి అవుతుంది.*
----------------------------------------
*February నెల అంటే 4 వ క్వార్టర్ TDS పూర్తి అయినాక* 
*Employees తాము స్వంతంగా* 
*E - Filing చేయించు కోవాలి.*
*E- Filing అనునది DDO లకు సంబంధం లేదు.*
*E - Filing లో మనం ఏ ఏ Sections కింద ఎంత ఎంత exemption తీసు కున్నాము..❓*
*అన్ని విషయాలు సవివరంగా IT portal లో ఎంటర్ చేసి DDO లు*
*మనకు ఇచ్చే Form - 16 కు అదనంగా IT Dept నుండి ఇంకో Form - 16 వస్తుంది.*
-------------------------------------
*అంటే DDO లు ఒక Employee* 
 *- ఒక Financial Year లో Total* *ఎంత Tax Deduct చేశాడో, TDS ద్వారా IT Dept కు తెలియచేస్తే,*
*..Employee ఆ కట్టిన TaX ను E - Filing చేయడం ద్వారా....*
*తన Gross వివరాలు, ఏ ఏ* *Sections కింద ఎంత టాక్స్* *Exemption తీసుకున్నాడో*
*ఆ వివరాలు - మరియు PAN Card ద్వారా మనకు వచ్చిన అదనపు ఆదాయం వివరాలు అన్ని కూడా సవివరంగా... IT Dept కు తెలియజేసి తను కట్టిన టాక్స్ సరిగ్గానే కట్టాను అని IT Dept కు వివరాలు సమర్పించడమే ఈ - Filing Process.*
*ఒక వేళ ఎక్కువ TAX కట్టి వుంటే ఆ amount తిరిగి మన బ్యాంక్ అకౌంట్ ద్వారా వెనక్కి వస్తుంది.*
----------------------------------
*DDO లు TDS పూర్తి చేశాక*
*కొంతమంది Teachers లేదా* *Employees YouTube లోని వీడియోలు చూసి, స్వంతంగా E - Filing ను Mobiles లో లేదా తెలిసిన Net Center 100 - 150 Rupees చెల్లించి చేయిస్తుంటారు. వారి Responsibility కూడా అప్పటివరకు మాత్రమే వుంటుంది..*
*అలా కాకుండా మంచి Perfect* *knowledge వున్న Charted* *Accountant ( CA) తో* 
*E - Filing చేయించండి...*
*E - FilinG పట్ల మంచి అవగాహన వుంటేనే మీరు స్వంతంగా చేసుకోండి.*
*ఎందుకంటే,*
*స్వంత ట్రీట్మెంట్ కు ... డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కు తేడా వుంటుంది కదా..*

*E - Filing చేయడానికి Registered CA లు 200 లేదా 300 తీసుకుంటారు.*
*E - Filing కోసం Year కు ఒకసారి 250 లేదా 300 చెల్లించడం పెద్ద సంగతి కాదు.*
*కానీ వారి బాధ్యత Next Financial Year వరకు వుంటుంది*.
----------------------
*కొంత మంది Teachers E - Filing చేయించడం అవసరమా అని మాట్లాడుతుంటారు..*
-----------------------
*E - Filing అవసరం లేదు అని సలహాలు ఇచ్చేవారు ఎవరైనా* *వుంటే వారికి income Tax పట్ల సరైన అవగాహన లేదు అని అర్థం.*
----------------------------------
*కొంత మంది Teachers కు TAX పడదు.అంటే FebruarY లో Form - 16 చేయించి నపుడు TAX , Rs 0 ( Nil) గా రావచ్చు. టాక్స్ Zero అంటే మనం చూయించిన Deductions ను బట్టి అలా టాక్స్ Nil వస్తుంది.*
*కొంతమంది Teachers లేదా Employees వాదన ఏమిటి అంటే మాకు TAX పడలేదు కాబట్టి, E- Filing అవసరం లేదు అని మూర్ఖంగా వాదిస్తారు...*
*మనం రాసిన Exam Paper* *మనం దిద్దుకుంటే ఏం లాభం...?* 
*అలా అయితే నీవు పాస్ అవవు కదా..!*
*అలాగే మనం చేసిన Form - 16 లో టాక్స్ amount Zero కానివ్వండి...లేక Tax పడిందే అనుకోండి..*
*అంటే , మనం రాసిన Exam Paper ఎవరో Examinar దిద్ది నిన్ను పాస్ చేసి నీకు ఒక పాస్* *మార్క్స్ మెమో పంపినట్లు గానే,*
*February లో మనం మన* *Deductions ను బట్టి ,మనం స్వంతంగా తయారు* *చేయించుకున్న IT Form ,Zero Tax పడింది అని మనం Correct అని సర్టిఫై చేయలేం.కాబట్టి,*
*ఆ ఫామ్ - 16 ను ఆన్లైన్ లో*
*E- Filing ( Electronic Filing)* *ద్వారా upload చేస్తాము.*
*ఐటీ Dept వారు దానిని పరిశీలించి*
*మన Earnings & Deductions కోసం సబ్మిట్ చేసిన Receipts* *Correct గా వున్నచో ,*
*మనకు IT Dept నుంచి ఇంకో ఫామ్ - 16 వస్తుంది.*
*అంటే Exam రాసినప్పుడు మనకు Memo వచ్చినట్లుగా I.T Dept...వారి Dept Form- 16 & E - Filing Complete చేసినట్లుగా ఒక ప్రింటెడ్ కాపీ ఇస్తారు.*

*కేంద్ర ప్రభుత్వ income Tax Department సూచనలు అనుసరించి టాక్స్ పడినా... ఒక వేళ అసలు టాక్స్ పడకపోయినా కూడా E - Filing తప్పక చేయించుకోవాలి.*

*భోజనం చేసిన తర్వాత టిష్యూ పేపర్ తో లేదా కర్చీఫ్ తో చేయి* *శుభ్రంగా తుడుచుకుంటాము.*
*అలా అయితేనే Comfort గా మనం feel అవుతాము.*
*అలాగే తడి చేతితో current Switch on చేస్తే ఏమి అవుతుందో తెలుసు కదా....*

*..income Tax E - Filing కూడా అంతే,*

*March - Feb వరకు SalarY తీసుకున్న తర్వాత E - Filing చేసుకోవాలి.*
*లేదంటే IT Dept నుండి Current Shock లాంటి నోటీసులు తప్పవు.. తర్వాత మనకు* *Housing / Personal/Car Loan*
*తీసుకునేటప్పుడు Loans ఎక్కువగా ఇవ్వరు.. తొందరగా ఇవ్వరు.*
 
*ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ చేయని వారికి మెసేజెస్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాయి.కావున ఉపాధ్యాయులు/ ఉద్యోగులు అందరూ చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా త్వరపడి ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోగలరు.*

*సమయం ఉంది అనుకుంటే సర్వర్ బిజీ అవుతుంది. కావున ఇప్పుడే AY 2022-23 కి సంబంధించి త్వరగా ఈ ఫైలింగ్ చేసుకోగలరు.*
*E - Filing Complete చేసుకోవడానికి మీరు వెళ్ళే Charted Account దగ్గరకు మీ SMART PHONE తీసుకు వెళ్ళాలి... G- Mail & Aadhar Link వున్న మొబైల్ నంబర్స్ కు OTP లు అక్కడ, E - Filing కోసం చెప్పవలసి వుంటుంది*


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts