*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*
పత్రిక ప్రకటన (18.6.23)
*ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు*
- పాఠశాల విద్య కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు.
రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా
*పాఠశాల బోధనా సమయం:* ఉదయం 7:30 నుండి 11:30 వరకు
*రాగి జావ:* ఉదయం 8:30 నుండి 9:00 వరకు
*మధ్యాహ్న భోజనం:* మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశించారు.
*పాఠశాల విద్యాశాఖ కమీషనర్,* (వారి తరఫున)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Please give your comments....!!!