Type Here to Get Search Results !

Library week/ Read Compaign celebration day wise schedule with details

నేటి నుండి (జూలై 10 నుండి15 వరకు)ప్రతి పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాలను అమలు చేయాలి .

👉 *రీడింగ్ క్యాంపెయిన్* అన్ని పాఠశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పెంచడం.

Conduct Reading Campaign without fail and ensure that the reading ability is attained by the end of July.

👉సంసిద్ధత పాఠాల ద్వారా విద్యార్థులు *కనీస సామర్థ్యాలు* సాధించేలా చూడడం

All teachers have to take up Preparatory lessons and ensure to attain basic competencies by the end of July.

👉2023-24 విద్యా సంవత్సరంలో *తొలిమెట్టు* కార్యక్రమం మరింత ప్రభావంతంగా అమలు చేద్దాం.
పై అంశాలపై చర్చించి ఒక ప్రణాళిక ను రూపొందించగలరు.

Plan for the effective execution of the FLN program and prepare the Annual Pedagogical plan and submit one copy in the O/o DEO to the Quality Coordinator.

*FLN & READING CAMPAIGN (పఠనోత్సవము) అమలు 2023-24*


సమస్త మండల విద్యాశాఖాధికారులు, మండల నోడల్ అధికారులు, క్లస్టర్ నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, 
FLN రిసోర్సు పర్సన్స్, ఉపాధ్యాయులు మరియు CRP లు ఈ క్రింది అంశములను గమనమందుంచుకొని తదనుగుణంగా 
కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయగలరు. 

కార్యక్రమ అనుక్రమణిక


10 తేదీ
గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం. విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయుట. నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించుట.

11 తేదీ
లైబ్రరీ వినియోగం పుస్తక పఠనం ఆవశ్యకతను తెలిపే ర్యాలీ.

12,13 తేదీలు
గ్రంథాలయకు కావలసిన పఠన సామాగ్రి సేకరణ.

14 తేదీ
100స్టోరీ కార్డ్స్ విద్యార్థులతో తయారు చేయించడం

15 తేదీ
తల్లిదండ్రుల సమావేశం, పఠన పోటీలు నిర్వహించడం.

_పఠనోత్సవ నిర్వహణలో తప్పనిసరిగా జరగవలసిన కార్యక్రమములు_


1. ప్రతి తరగతికి -ప్రతిరోజు తప్పనిసరిగా గ్రంధాలయ పీరియడ్ కేటాయించబడాలి. 
2. అన్ని పీరియడ్స్ లో 10 నిమిషములు తప్పనిసరిగా బాహ్య పఠనం జరగాలి. 
3. పాఠశాలలోని గ్రంధాలయ పుస్తకాలను స్థాయిలకనుగుణంగా వర్గీకరించుకోవాలి. 
4. అన్నితరగతుల విద్యార్థులను ధారాళంగా చదువగలిగేవారు, తడబడుతూ చదవగలిగే వారు & చదువలేనివారుని 3 సమూహాలుగా వర్గీకరించుకోవాలి. అట్టి వివరములు విద్యార్థి వారీగా ఉపాధ్యాయులవద్ద -తరగతుల వారీగా ప్రధానోపాధ్యాయుల వద్ద ఉండవలెను. 
5. ప్రార్ధనలో తప్పనిసరిగా రొటేషన్ పద్దతిలో ప్రతిరోజు 3 విద్యార్థులచే పఠనము చేయించవలెను. 
6. గ్రంధాలయ పీరియడ్ నందు అందరు విద్యార్థులకు పుస్తకములిచ్చి కూర్చుండ బెట్ట రాదు. ధారాళంగా చదువగలిగేవారికి మాత్రమే 
  స్వతంత్రంగా చదువుటకు పుస్తకములను ఇవ్వవలెను. తడబడుతూ చదివే వారికి-ధారాళంగా చదివే వారిని జత చేసి చదువుటలో 
    సహాయము చేయమనవలెను మరియు చదువులేని విద్యార్థులను తప్పనిసరిగా ఉపాధ్యాయులు దగ్గర కూర్చుండబెట్టుకొని 
     చదివించవలెను. 
7. 1 & 2 తరగతులకు 6 రోజులు తెలుగు, 3,4 & 5 తరగతులకు 3రోజులు తెలుగు -3 రోజులు English మరియు 6 నుండి 10 తరగతుల 
    విద్యార్థులకు 3 రోజులు తెలుగు, 2 రోజులు ఇంగ్లీష్ & 1 రోజు హిందీ లైబ్రరీ పీరియడ్స్ నిర్వహించవలెను. 
8. జులై 31 వరకు చదవలేని విద్యార్థుల మీద దృష్టిపెట్టి అందరు చదువగలిగేవిధంగా చేయుటకు పాఠశాల స్థాయిలో ప్రణాళిక రచించుకొని అందరు ఉపాధ్యాయులకు భాద్యతలు పంచి లక్ష్యమును సాధించాలి. 


పై అంశములు ప్రతి పాఠశాలయందు అమలుజరుగుతున్నవని మానిటరింగ్ అధికారులు తప్పనిసరిగా సందర్శన సమయములో 
రూఢి పరచుకొనవలెను. 

*గ్రంథాలయ వారోత్సవాలు...*


(10.7.2023 నుండి 15.7. 2023 వరకు..)

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*పాఠశాలల్లో (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ) చేపట్టవలసిన కార్యక్రమాలు*

*10 వ తేదీ:*


👉పఠనోత్సవం, గ్రంథాలయ వారోత్సవాలు సూచిస్తూ ఒక ఫ్లెక్సీ లేదా చార్ట్ తయారుచేసి పాఠశాలలో అందరికీ కనపడే విధంగా ఉంచాలి.
👉పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరైనా ప్రముఖ వ్యక్తిచే పిల్లలకు అవగాహన కల్పించాలి
👉పిల్లలచే పుస్తక పఠనం చేయించాలి.
👉 గ్రంథాలయ వారోత్సవాలు దీనిలో భాగంగా పాఠశాలలో చేపట్టబోయే వివిధ కార్యక్రమాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి.


*11వ తేదీ:*


👉పుస్తక పఠనం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఇంటింటికి ఒక ర్యాలీ లాగా వెళ్లాలి.
👉 పుట్టినరోజు లాంటి వివిధ సందర్భాలలో పిల్లలకు బహుమతిగా పుస్తకాలను అందజేయటం పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

*12 మరియు 13 వ తేదీలు*


👉 పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలను సేకరించే కార్యక్రమం చేపట్టాలి. 
👉 దాతల నుండి గాని, పాఠశాల ఉపాధ్యాయ ఇళ్లలో ఉండే వివిధ రకాల కథల పుస్తకాలు గానీ, వార్తాపత్రికలలో పిల్లల పేజీలలో ఉండే కథలు, బొమ్మలు వివిధ రకాల పజిల్స్ వంటి వాటిని సేకరించడం, వీటన్నింటినీ పిల్లలకి అందుబాటులో ఉంచేట్లుగా చేయటం వంటి కార్యక్రమాలు చేపట్టాలి.

*14 వ తేదీ*


👉 సేకరించిన వారపత్రికలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఇతర మెటీరియల్ నుండి రీడింగ్ మెటీరియల్( పజిల్స్, గేమ్స్, కార్డ్స్) ని తయారు చేసి లైబ్రరీలో అందుబాటులో ఉంచాలి.


*15 వ తేదీ*


👉 ఈరోజు తల్లిదండ్రుల సమావేశంలో పిల్లలచే పుస్తక పఠనం చేయించాలి.
👉 పిల్లలకు పఠన పోటీలు నిర్వహించాలి.
👉 పఠన పోటీలలో భాగంగా పిల్లలచే కథలు చదివించడం, పుస్తక సమీక్ష, పిల్లలు సొంతగా కథలు చెప్పటం, వంటి అంశాలలో పోటీలను నిర్వహించాలి. 
👉 వేగంగా, తప్పులు లేకుండా చదవగలటం అనే అంశంలో కూడా పోటీలు నిర్వహించాలి.

*చివరిగా పదవ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన అన్ని కార్యక్రమాలపై ఒక నివేదిక రూపొందించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలి.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Recent Posts