సైకాలజీ పాఠం : 1. బాల్యదశ
1.4 అంశం : పిల్లల దత్తాంశాన్ని సేకరించడానికి వాడే పద్ధతులు:
1. సహజ పరిశీలన
2. పరిపుర్చ
3. ప్రతిస్పందన పత్రికలు
4. సంఘటన రచనాత్మక రికార్డు
5. నిరంతర నమోదు పద్ధతి
6. ప్రయోగ పద్ధతి
7. ప్రశ్నావళి
8. వ్యక్తి అధ్యయన పద్ధతి
9. నిర్ధారణ మాపణాలు
1. సహజ పరిశీలన:
- ముందుగా నిర్ణయించుకున్న అంశాలను సన్నతతో స్పష్టంగా నిశితంగా చూడడం
- సహజ పరిస్థితుల్లో పరిశీలనా చేయడం
- బాహ్య ప్రవర్తనను పరిశీలించవచ్చు
- అంతర్గత ప్రవర్తనను మానసిక ప్రక్రియలను పరిశీలించలేము
- ఇది సులభమైన పద్ధతి
- పరిశీలనకు కొద్దిపాటి శిక్షణ సరిపోతుంది
- పరిశీలన అంశాలపై కచ్చితమైన అవగాహన వస్తుంది
- పరిశీలన చేసే వ్యక్తి తన సొంత ఇష్టాలను నమోదు చేసే ప్రమాదం ఉన్నది
- దీనివలన బాహ్య ప్రవర్తన తెలుసుకోవచ్చు కానీ అంతర్గత ప్రవర్తన తెలుసుకోలేము
2. పరిపుచ్చ ఇంటర్వ్యూ
- వ్యక్తి ఇంటర్వ్యూను తెలుసుకోవడాన్ని ఇంటర్వ్యూ అంటారు
- దీని ద్వారా అంతర్గత భావాలను కూడా తెలుసుకోవచ్చు
- వ్యక్తి యొక్క లక్షణాంశాలు అభిప్రాయాలను వైఖరులను తెలుసుకోవచ్చు
- ఇవి రెండు రకాలు
సంరచిత పరిపుచ్ఛ:
- మొదట ప్రశ్నలను తయారు చేసుకుంటారు
- దీనిలో విశ్లేషణ చేయడం సులభం అవుతుంది
- తక్కువ సమయంలో ఎక్కువ మందిని చేయవచ్చు
- సులభమైన పద్ధతి ఖర్చు తక్కువ సమయము ఆదా అవుతుంది
- చిన్నపిల్లలు మరియు నిరక్షరాసిలకు ఈ విధానము వర్తించదు
- విద్యార్థుల్లో అనుమానాలను నివృత్తి చేయలేము
- శారీరక చేష్టలు అనగా హావాభావాలు బాడీ లాంగ్వేజ్ ను గుర్తించలేము
- ఇది మూగవారి కూడా ఉపయోగించవచ్చు
- సంకోచించే వారికి పనికి వస్తుంది
ఆసంరచిత పరిపుచ్ఛ:
- సందర్భానుసారం ప్రశ్నలు వేయవచ్చు
- పరిశీలకునికి స్వేచ్ఛ ఉంటుంది
- ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టవచ్చు
- నిరక్షరాసులు చిన్న పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు
- ఒకసారి ఒకరికే చేయవచ్చు
- సమయము ఎక్కువ తీసుకుంటుంది
- ఖర్చు ఎక్కువవుతుంది
- అభ్యర్థులకు అనుమానాలను తీర్చవచ్చు.
- అపార్థాలకు చోటు లేదు
- మూగవారికి మతిస్థిమితం లేని వారికి పనికిరాదు
- సంకోచించే గుణం ఉన్నవారికి పనికిరాదు
- విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది
3. ప్రతిస్పందన పత్రికలు:
- అభ్యసనా అనుభవాల వ్యక్తిగత రికార్డులు
- విమర్శనాత్మకంగా నమోదు చేయవచ్చు
- విశ్లేషణాత్మకంగా ఆలోచన నమోదు చేయవచ్చు
- వ్యక్తి తన టాస్క్ ను ఏ కారణం చేత పూర్తి చేయలేదో మరియు ఎలా పూర్తి చేయాలో ఆలోచనలు కూడా నమోదు చేయవచ్చు
- విద్యార్థి రాసిన సొంత ఆలోచనలు భావనలు ప్రతిస్పందనను రాసిన నోట్ బుక్స్
- వీటిని పరిశీలించేవారు పరిశీలించబడే వారు ఇద్దరూ వాడుకోవచ్చు
- అనుమానాలను నమోదు చేసుకుని నివృత్తి చేసుకునేందుకు ఉపయోగపడతాయి
- పరిశీలకు తన వృత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు
- ఇవి రాతపూర్వకంగానూ మౌఖింగాను వాడుకోవచ్చు
- అక్షరాసులకు నిరక్షరాశులకు వాడవచ్చు
4. సంఘటన రజనాత్మక రికార్డు
- ఉపఖ్యాన రికార్డు అని కూడా అంటారు
- ముఖ్య సంఘటనలను రికార్డు చేయాలి
- బాయ ప్రపంచంలో ఓపెన్ ఏరియాలో చేస్తారు
- రికార్డులో నమోదు చేసే తేదీ సమయం స్థలము సంఘటనను సెట్టింగ్ అంటారు
- సంఘటనను పరిశీలించేటప్పుడు ప్రతి చిన్న విషయము ప్రవర్తనను రాయవలెను
- ఇష్టమైన చర్యలను రాయాలి
- దీనికి ఎలాంటి మాపనలు అవసరం లేదు
- ఇది సులభమైన పద్ధతి
- పరిశీలకులు కల్పించి రాసే ప్రమాదం ఉంది
- సాధారణ సంఘటనలను కూడా నమోదు చేసే ప్రమాదముంది
- ఈ కారణంగా కొన్ని అంశాలు వదిలే అవకాశం ఉంది
5. నిరంతర నమోదు పద్ధతి
- ఒక సంఘటనకు ప్రవర్తన నమోదు చేస్తారు
- ప్రామాణికత గలది
- సమగ్రమైనది
- సమయం ఎక్కువగా తీసుకుంటుంది
- పరిమితిని విధించడం కష్టం
- ఉదాహరణ ఎఫ్ ఏ వన్ పరీక్షలు
6. ప్రయోగ పద్ధతి
- నియంత్రిత సన్నివేశంలో ఎక్కువ చరాల మధ్య సంబంధాలను కనుక్కుంటారు
- తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- ఖర్చు నిర్వహణ ఎక్కువ సమయం కూడా ఎక్కువగా తీసుకుంటుంది
- క్రమబద్ధమైన పద్ధతి
- వస్తునిష్టత ఎక్కువ
- నూతన ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగం పడుతుంది
- మళ్లీ మళ్లీ ఫలితాలను నిరూపించవచ్చు
- కారణాలకు ఫలితాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు
- పరిస్థితులను నియంత్రించడం కష్టం
- జోకే చేరాలను నియంత్రించడం కష్టం
- అన్ని రకాల ప్రవర్తనను అధ్యయనం చేయలేము
- ఉద్వేగాలను కల్పించడం కష్టం
- దీనికి పరిశీలకులు శిక్షణ అవసరం
- కొంతకాలం తర్వాత ఫలితాలు మారవచ్చు
- ఉదాహరణ బిగ్ బాస్ లోని టాస్కులు
7. ప్రశ్నావళి
- ఇది రాతపూర్వకంగా ఉంటుంది
- నిరక్షరాశులకు పనికిరాదు
- ఇది రెండు పద్ధతులు
- ఒకటోది ప్రశ్న రూపంలో ఉండేవి. వీటిని క్లోజ్డ్ ఎండెడ్ పద్ధతి అంటారు. ఉదా ఆబ్జెక్టివ్ క్యూస్షన్స్ వీటి ద్వారా విశ్లేషణ చేయడం చాలా సులభం
- రెండవది వాక్య రూపంలో ఉండేవి. వీటిని ఓపెన్ ఎండెడ్ పద్ధతి అంటారు ఉదాహరణ ఖాళీలను పూజించడం కొద్దిగా కష్టం
- ఈ ప్రశ్నావళి పద్ధతి ద్వారా వ్యక్తులను ఎక్కడ ఉండను వాడవచ్చు
- విద్యార్థుల సందేహాలకు నివృత్తి దొరకదు
- ఉదాహరణ ఆన్లైన్ టెస్టులు
8. వ్యక్తి అధ్యయన పద్ధతి
- వ్యక్తిని సమగ్రంగా మరియు లోతుగా అధ్యయనం చేయవచ్చు
- ఈ పద్ధతి ద్వారా ఒక వ్యక్తిని గాని మరియు సంస్థను గాని అధ్యయనం చేయవచ్చు
- ఈ పద్ధతి ద్వారా ఒక సంస్థ యొక్క లేదా వ్యక్తి యొక్క సమస్యకు కారణాలు తెలుసుకొని పరిష్కారము చూపించవచ్చు
- ఉత్తమ ఫలితాలు ఎలా సాధించారో ఆ పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు
- సమగ్ర సమాచారాన్ని సేకరించి విశ్లేషించి సమస్యకు గల కారణాలు కనుక్కొని పరిష్కారం చేయడం
- దీనివల్ల వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి
- సమయము చాలా తీసుకుంటుంది
9. నిర్ధారణ మాపనాలు
- ఐదు లేదా ఏడు బిందువుల ద్వారా చేస్తారు
- ఇందులో రెండు రకాలు గ్రాఫిక్ నిర్ధారణ మాపని ఇందులో వర్ణాలు ఉంటాయి దానిమీద క్లిక్ చేయాల్సి ఉంటుంది
- రెండవది కోటికరణ మా పని ఇందులో చుక్కలు సంఖ్యలు బొమ్మలు లాంటి ఉంటాయి
- ఇది సులభమైన పద్ధతి
- పరిమాణాత్మక మరియు గుణాత్మక దత్తాంశాన్ని సేకరించవచ్చు
- ఒకేసారి ఎక్కువమందికి ఉపయోగించవచ్చు
- ఖచ్చితమైన సమాచారము పొందవచ్చు
- పక్షపాతానికి స్థానము కలదు
- నిష్ణాతులు కాని వారు కూడా వాడవచ్చు
Please give your comments....!!!