Type Here to Get Search Results !

Birth Anniversary of Sardar Vallabhbhai Patel as Rastriya Ekta Diwas (National Unity Day) Observance on 31st October - 2023 Pledge in Telugu, Hindi and English

*RASHTRIYA EKTA DIVWAS PLEDGE*

I solemnly pledge that I dedicate myself preserve the unity, integrity and security of the nation and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to mal my own contribution to ensure internal security of
my country.


జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ

నా దేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకుని, వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన, వారు చేపట్టిన చర్యల తో సాధ్యమైన నా దేశ ఏకత్వము స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వీయ సహకారం అందించాలని మనసా, వాచా, కర్మణా నిశ్చయించుకున్నాను.

राष्ट्रीय एकता दिवस शपथ

मैं अपने देश की एकता, अखंडता और सुरक्षा की रक्षा के लिए खुद को समर्पित करने की प्रतिज्ञा करता हूं। मैं इसी संदेश को अपने साथी देशवासियों के साथ साझा करने और फैलाने का संकल्प लेता हूं। मैं यह प्रतिज्ञा श्री सरदार वल्लभभाई पटेल की दूरदर्शिता और उनके द्वारा किए गए कार्यों से संभव हुई मेरे देश की एकता की भावना से लेता हूं। इस अवसर पर मैंने मन, दृष्टि और कर्म से अपने देश की आंतरिक सुरक्षा की रक्षा में अपना योगदान देने का संकल्प लिया है।

సర్దార్ వల్లభాయ్ పటేల్ గురుంచి...



భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ భాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు.[1] ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night