ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ - జివో నెంబర్ 186 విడుదల
ముఖ్యాంశాలు
- ఈహెచ్‌ఎస్ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది.
- దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు.
- ప్రభుత్వం తరఫున.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉంటారు.
- ఈహెచ్‌ఎస్ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
- ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
- విధాన నిర్ణయాలకు సంబంధించి బోర్డ్ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తారు.
- ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈహెచ్ఎస్ సీఈవోగా నియమిస్తారు.
- ఉద్యోగులు, పెన్షనర్లు తమ కాంట్రూబ్యుషన్ గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతినెల వారి వేతనం నుంచి ఆటోమెటిక్‌గా ట్రస్ట్‌కు బదిలీ అవుతుంది.
- ప్రభుత్వం అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి నెల జమ చేస్తుంది.
- ఈహెచ్ఎస్ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు 15 పోస్టులను మంజూరు చేసింది.
- పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రత్యేకంగా విడుదల చేస్తారు.
Please give your comments....!!!