ఉద్యోగుల మూలవేతనం అనగా బేసిక్ పే అనుసరించి వారికి ఎంత అమౌంట్ను తమ జీతం నుండి మీనాయింపు చేయవలెను అంత అమౌంట్ను DDO గారు మినహాయింపు చేస్తారు. అలా మన జీతం నుండి కొంత అమౌంట్ను తగ్గింపు జరుగుతుంది అయినప్పటికీ మనకు ఆ అమౌంట్ కు సరిపడా ఇన్సూరెన్స్ వర్తించదు. ఇన్సూరెన్స్ వర్తించవలెను అంటే బాండ్ కోసం అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీతం నుంచి అమౌంటు కట్ అవుతుందో అదే నెల వీలైనంత తొందరగా బాండ్ కోసం అప్లై చేసుకోవాలి. బాండ్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. చాలామంది జీతం నుండి అమౌంట్ కట్ అవుతుంది కదా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని అపోహ పడతా ఉంటారు అందుకే వెంటనే బాండ్ కోసం అప్లై చేసుకోండి.
ఇప్పటి వరకూ మీకు ఎన్ని TSGLI బాండ్ లు ఉన్నాయి ఈ క్రింద క్లిక్ చేసి తెలుసుకోండి
బాండ్ కోసం ఈ క్రింద గల లింక్ మై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగానే పూర్తిగా రెడీమేడ్ గా అప్లికేషన్ ఫామ్ తయారవుతుంది దానిని ప్రింట్ తీసుకొని డి డి ఓ గారితో సంతకం చేపించి సంఘ నాయకుల ద్వారా గాని లేదా ఎవరితోనైనా గాని లేదా వ్యక్తిగతంగానైనా గాని లేదా పోస్టర్ ద్వారా జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపవలెను.
📑 *TSGLI పెంపునకు ఈ క్రింద మీ వివరాలు నమోదు చేయగానే రెడీ మెడ్ గా Enhancement Forms కొత్త బాండ్ అప్లికేషన్ ఫారం అన్ని వస్తాయి.*
మీ అప్లికేషన్ ఫారం ను పోస్టు ద్వారా పంపించినప్పటికీ కూడా మీ బాండ్ తయారవుతుంది ఒకప్పుడు ఈ బాండును ఆఫీస్ కార్యాలయంలో ఇచ్చేవారు ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్ అయింది మన ఫోన్లోనే మన బాండ్లను చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవచ్చు. ఈ క్రింద క్లిక్ చేసి మీ నంబర్ను నమోదు చేయగానే ఇప్పటివరకు ఎన్ని బాండ్లు ఉన్నాయో బాండ్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు కట్ అవుతున్న దానికంటే తక్కువ ఉన్నట్లయితే ఇప్పుడే కొత్త బాండ్ కోసము అప్లై చేసుకోండి
ఈ క్రింద క్లిక్ చేసి సంవత్సరం వారిగా మీ అకౌంట్ కు అమౌంట్ కట్ అయినా మొత్తాన్ని నెలవారీ రిపోర్టుగా చూసుకోవచ్చు. అది ఎలాగో ఈ క్రింద ఇవ్వడం జరిగింది
1. మీ పాలసీ నంబర్ ను నమోదు చేయండి
ఉదా L1009632
2. చివరలో ఒక్కో బాండ్ కు ఒక్కో పేరు ఉంటుంది దానిని నమోదు చేయకూడదు.
ఉదా L1009632A
L1009632B
L1009632C
L1009632D
3. సంవత్సరం ను సెలెక్ట్ చేసుకోవాలి .
4. Captcha కోడ్ ను నమోదు చేసి View Report పైన క్లిక్ చేయండి
ఈ క్రింద చూపించిన విధంగా రిపోర్ట్ వస్తుంది.
రిపోర్ట్ లలో ఏవి అయిన మిస్ అయితే...
మిస్ అయిన తప్పిపోయిన క్రెడిట్‌ల క్లియరెన్స్ కోసం, సబ్‌స్క్రైబర్ పోస్ట్ చేసే స్థలాలను నెల, ప్రీమియం/లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం, టోకెన్ నంబర్/వోచర్ నంబర్, DDO ద్వారా ధృవీకరించబడిన మొత్తం TSGLI షెడ్యూల్ వంటి తగ్గింపు వివరాలతో సమర్పించాలి.
చలాన్ చెల్లింపు విషయంలో, చందాదారుడు పోస్టింగ్ చేసే స్థలాలను, నెల, ప్రీమియం / లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం, చలాన్ నంబర్, చలాన్ మొత్తం మరియు DDO ద్వారా ధృవీకరించబడిన తేదీ, పాలసీ నంబర్‌లు మరియు పేర్ల పూర్తి వివరాలతో పాటు పోస్ట్ చేసే స్థలాలను సమర్పించాలి. చలాన్ చెల్లించిన ఉద్యోగుల.
మిస్ కాకుండా ఉండాలంటే
1. డ్రాయింగ్ అధికారులు డిపార్ట్‌మెంట్ జారీ చేసిన పాలసీ బాండ్‌లకు సంబంధించి షెడ్యూల్‌లలో TSGLI పాలసీ నంబర్‌ల ఖచ్చితత్వాన్ని ధృవీకరించాలి. షెడ్యూల్‌లలో తప్పు పాలసీ నంబర్‌లు కోట్ చేయబడితే, ప్రీమియం వ్యక్తిగత ఖాతాలకు పోస్ట్ చేయబడదు మరియు మిస్ క్రెడిట్‌లు తలెత్తుతాయి.
2. షెడ్యూల్‌లలో ఒకసారి నమోదు చేయబడిన సరైన పాలసీ నంబర్‌లను ప్రతి నెలా మార్చకూడదు.
3. ఉద్యోగులు కనీసం సంవత్సరానికి ఒకసారి నెలవారీ షెడ్యూల్‌లో పేర్కొన్న వారి పాలసీ నంబర్‌ల ఖచ్చితత్వాన్ని కూడా ధృవీకరించాలి.
4. పాలసీ నంబర్ ఉద్యోగి యొక్క SR(సర్వీస్ రిజిస్టర్) మొదటి పేజీలో శాశ్వత రికార్డుగా నమోదు చేయబడవచ్చు.
5. క్రెడిట్‌లు తప్పిపోయినట్లయితే ప్రీమియంల అప్‌డేట్ కోసం డ్రాయింగ్ అధికారులు సంబంధిత సంస్థ సిబ్బందిని సంబంధిత జిల్లా బీమా కార్యాలయానికి పంపవచ్చు.
0 Comments
Please give your comments....!!!