ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులం మనం మన పాఠశాల నుండి మరొక పాఠశాలకు వెళ్తాం.
పోలింగ్ కేంద్రంలో ఏ లోటు లేకుండా అన్ని వసతులు, సమయాణికింత భోజనం ఉండాలని కోరుకుంటాం. మన పాఠశాలలో కూడా ఎన్నికల విధులు నిర్వహేంచే వారికి వసతులు కల్పించడంలో కూడా మనం ముందు ఉండాలి.
వసతులు సరిగా లేక ఎన్నికల సిబ్బంది నానా ఇబ్బందులకు గురవుతుంటారు.
అందుకే ప్రతి ఉపాధ్యాయుడు, బాధ్యతగా తమ తమ పాఠశాలలలో *28.11.2023* నాడు ఈ క్రింది కనీస వసతులు కల్పించాలి.
3 తరగతి గదులు
(1 పోలింగ్+1 స్త్రీల కోసం+1 పురుషుల కోసం)
2 బాత్ రూములు
లైట్లు
ఫ్యాన్లు
త్రాగు నీరు
వాటర్ ట్యాంక్ నిండా నీళ్లు
టేబుళ్లు
కుర్చీలు
పోలింగ్ కు సరిపడా ఫర్నిచర్
చాపలు
బక్కెట్లు, జగ్గులు, గ్లాసులు మొదలగునవి.
కొందరు అయితే వాష్ రూం లకు తాళాలు వేస్తారు దయచేసి సహకరించగలరు
పోలింగ్ సిబ్బంది మన మిత్రులే - వారికి వసతులు కల్పించడం మన బాధ్యత
0 Comments
Please give your comments....!!!