*🔊పాఠశాల విద్యా కమిటీల పదవీకాలం పెంపు*
*🍥ఈనాడు, హైదరాబాద్: పాఠశాల విద్యా కమిటీల పదవీ కాలాన్ని ఈ నెలాఖరు లేదా కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీల పదవీకాలం గత నెల 30వ తేదీతో ముగిసింది. సాధారణంగా ఆరు నెలలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా ఎన్నికలు జరగకపోవటంతో పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.*
Please give your comments....!!!