*🌱Tax Saving Under 80C, 80CCC, 80CCD Upto 2Lacs*
*📍సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద మినహాయింపు..*
*👉కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో పెట్టుబడుల ద్వారా సిటిజన్లు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.*
*📍మెడికల్ వ్యయాలు (సెక్షన్ 80డీ)*
*👉నెలవారీ జీతాలు పొందే ఉద్యోగులు మెడికల్ ఇన్సూరెన్సులపై పన్ను మినహాయింపు పొందొచ్చు. తనపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు, సీనియర్ సిటిజన్లపై చేసే మెడికల్ వ్యయాలపై రూ.50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపును పొందే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.*
*📍గృహ రుణం (సెక్షన్ 24)*
*👉గృహ రుణాలు చెల్లిస్తున్న పన్ను చెల్లింపుదారులు వడ్డీ చెల్లింపుపై కొంత ఉపశమనం పొందేందుకు వీలుంది. రూ.2 లక్షల వరకు ఉపశమనాన్ని పొందే మార్గాలున్నాయి.*
*📍ఎడ్యుకేషన్ లోన్ (సెక్షన్ 80ఈ)*
*👉విద్యా రుణం తీసుకునే వ్యక్తులు పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందుకు గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు.*
*📍షేర్లు, మ్యూచువల్ ఫండ్లు (సెక్షన్ 80సీసీజీ)*
*👉ఏడాదికి రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని పొందే వ్యక్తులు ప్రత్యేక షేర్లు, రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్ కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదనపు మినహాయింపులు (డిడక్షన్లు) పొందొచ్చు. కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో లాభాలను పున: పెట్టుబడులు పెట్టడం ద్వారా చెల్లింపుదారులు పన్ను భారాలను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఒక ఏడాది కంటే ఎక్కువకాలం అట్టిపెట్టుకున్న షేర్లపై వచ్చే లాభాలపై పన్ను మినహాయించడం కల్పిస్తోంది.*
*📍విరాళాలు (సెక్షన్ 80జీ, 80జీజీసీ)*
*👉సామాజిక కార్యక్రమాలు లేదా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే చెల్లింపుదారులు తాము చెల్లించే మొత్తంలో 50 శాతంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎన్‌జీవోలు లేదా రాజకీయ పార్టీలు అందించే సర్టిఫికేట్ సమర్పించి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.*
*📍ఇంటి అద్దె భత్యం (సెక్షన్ 80జీజీ)*
*👉ఉద్యోగులు సెక్షన్ 80జీజీ కింద హౌస్ రెంట్ అలవెన్స్‌ని (హెచ్‌ఆర్ఏ క్లెయిమ్ చేయవచ్చు. వార్షిక అద్దె రూ.1 లక్ష దాటితే ఉపశమనం లభిస్తుంది. యజమాని పాన్‌కార్డు, లీజు అగ్రిమెంట్ ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.*
*📍లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ)*
*👉సెలవు సమయాల్లో ప్రయాణాల ద్వారా ఉద్యోగ కంపెనీలు లేదా యజమానుల నుంచి ఎల్‌టీఏ పొందవచ్చు. ఇండియాలో ప్రయాణించి పన్ను రహిత ఎల్‌టీఏను క్లెయిమ్ చేయవచ్చు. నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు ఇది వర్తిస్తుంది. జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు.*
💦🎊💦🎊💦🎊💦🎊
Please give your comments....!!!