పత్రికా ప్రకటన
6:24-01-2024
ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్ధులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 31-01-2024. తదుపరి ఎటువంటి పొడిగింపు ఉండదు అని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేయడమైనది. విద్యార్ధి వివరములు అనగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు విద్యార్థి తండ్రి పేరు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ పైన ఉండవలెను. విద్యార్థి వివరములు ఆధార్ వివరములతో "For your submitted information there is no scheme available" 3 265 మెసేజ్ వస్తుంది లేదా "PM Yashasvi..." స్కీమ్ చూపిస్తుంది. విద్యార్థులు ఈ విషయమును గమనించి వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించి "Aadhaar Mismatch వివరములను 27-01-2024 లోపు సమర్పించవలెను". విద్యార్థి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది.15-02-2024 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా ధృవీకరించవలెను. INO లాగిన్ ద్వారా వివరములు దృవీకరించే సమయం లో విద్యార్ధి వివరములు ఏమయినా తప్పులు ఉన్నట్టు గ్రహిస్తే "DEFECT" చేసి మరలా విద్యార్థి లాగిన్ నుండి వివరములను సరిచేసి మరలా INO లాగిన్ ద్వారా ధృవీకరించవలెను. అదేవిధంగా నవంబరు 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022 సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ మరియు అయిడెడ్ పాఠశాలల్లో / కళాశాలల్లో చదువుచున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. గత సంవత్సరాలలో బ్యాంక్ పాస్ బుక్ ద్వారా నమోదు చేసుకున్న రెన్యువల్ విద్యార్థులకు ఆధార్ వివరములను నమోదు చేసే సమయంలో Aadhaar Mismatch ఉన్నట్లు అయితే వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించి "Aadhaar Mismatch" వివరములను 27-01-2024 లోపు సమర్పించవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు, దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు శ్రీ డి . దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
సం/- డి. దేవానంద రెడ్డి సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం
ధృవీకరించడమైనది
24/1/24
Please give your comments....!!!