*INSPIRE 2022-23 కు Select అయినవారికి సంబందించి సూచనలు:-
INSPIRE 2022-23 సెలెక్ట్ అయిన విద్యార్థికి సంబంధించిన ప్రాజెక్టును INSPIRE MANAK APP లో తేదీ 11జనవరి, 2024 సాయంత్రం 5 గంటలలోపు పూర్తి చేయాలి .మధ్యలో సంక్రాంతి హాలిడేస్ ఉన్న విషయాన్ని గమనించాలి. మొబైల్ ద్వారా అప్లోడ్ చేయవచ్చును.
*I.పాస్వర్డ్ పొందడం ఎలా?*
1. మొదట మనం ఇన్స్పైర్ మనక్ ఆప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
2. GET PASSWORD పై క్లిక్ చేయాలి.
3. రిఫరెన్స్ నెంబర్ టైప్ చేయాలి. గెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేయాలి.
4. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు పాస్వర్డ్ పంపించబడుతుంది.
5. ఒకవేళ మీరు నీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేకపోతే జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించండి
*II. LOGIN ఎలా కావాలి*
యూజర్ ఐడి గా రెఫరెన్స్ నెంబర్ని , పాస్వర్డ్ ని టైప్ చేసి లాగిన్ కావాలి.
*III. Project upload ఎలా* *చేయాలి* .
1. Upload now పై టైపు చేయాలి.
2. Project discription(1000 మించకుండా type చేయాలి).
3. ప్రయోగం వీడియోను నేరుగా వీడియో గుర్తుపై క్లిక్ చేసి రెండు నిమిషాలు దాటకుండా రికార్డ్ చేయాలి.
4. ప్రయోగ విధానం సంబంధించిన ఆడియోను నేరుగా రికార్డ్ చేయాలి.
5. ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఫోటోలు అప్లోడ్ చేయాలి. అనంతరం ఫైనల్ సబ్మిట్ చేయాలి.
*IV.ఒకవేళ పాఠశాలలో* *నెట్వర్క్ లేకపోతే ఏం చేయాలి*
విద్యార్థి ప్రాజెక్టు వివరిస్తున్న వీడియోను 30MB దాటకుండా పాఠశాలలో తీసుకొని, ఆడియోను రికార్డ్ చేసుకుని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. నెట్వర్క్ ఉన్న ప్రదేశం లోకి వచ్చిన తర్వాత అప్లోడ్ చేయవచ్చును.
Please give your comments....!!!