Type Here to Get Search Results !

SMC Elections Complete Information 2024 and Forms



SMC ఎన్నికల కు షెడ్యూల్ 


👉 20.01.2024 నోటీసు ఇవ్వడం  పేరెంట్స్ లిస్ట్ ప్రకటించడం

👉 22.01.2024 & 23.01.2024  అభ్యంతరాల స్వీకరణ

👉 24.01.2024 పేరెంట్స్  ఫైనల్ లిస్ట్ ప్రకటించడం

👉 29.01.2024 SMC కొత్త కమిటీ కి చైర్మన్ వైస్ చైర్మన్ ఇతర సభ్యుల ఎన్నిక



👉 SMC ఎన్నిక ప్రక్రియ సభ్యుల ఎన్నిక



ఎస్.యం.సి. నిర్మాణము


బి) పదవి రీత్యా సభ్యులు (ఎక్స్-అఫీషియో మెంబర్స్) :

పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేక ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఎక్స్-అఫీషియో సభ్యులు/మెంబర్ కన్వీనర్
• మండల విద్యాధికారిచే నామినేట్ చేయబడిన ఒక ఉపాధ్యాయుడు. (ప్రధానోపాధ్యాయులు పురుషుడు అయితే మహిళా ఉపాధ్యాయినిని నామినేట్ చేయాలి)
• సంబంధిత కార్పొరేటర్/వార్డు కౌన్సిలర్/వార్డు సభ్యుడు
• పాఠశాల ఆవాస ప్రాంతంలో పని చేయుచున్న అంగన్వాడి కార్యకర్త / కార్యకర్తలు
• పాఠశాల ఆవాస ప్రాంతంలో పని చేయుచున్న మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్-మహిళ (ఎ.ఎన్.ఎం.)
• సంబంధిత గ్రామ/వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

సి) సహ సభ్యులు (కో-ఆప్టడ్ మెంబర్స్):


పేరొందిన విద్యా వేత్త లేదా దాత లేదా పాఠశాలకు సహరించే వ్యక్తి లేదా స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధి లేదా పాఠశాల పూర్వ విద్యార్థుల నుండి ఇద్దరు ఎస్.యం.సి. సభ్యులచే కో-ఆప్ట్ చేయబడతారు.
. కో-ఆప్టడ్ సభ్యుల పదవీ కాలం కో-ఆప్ట్ చేయుటకు సమావేశం నిర్వహించిన తేదీ నుండి 2 సంవత్సరాలు.
డి) స్థానిక సంస్థల చైర్ పర్సన్ (ప్రత్యేక ఆహ్వానితులు) :
సంబంధిత గ్రామ పంచాయితీ సర్పంచ్ / మున్సిపల్ చైర్ పర్సన్ / మేయర్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

అధ్యక్షులు (చైర్ పర్సన్), ఉపాధ్యక్షులు (వైస్-చైర్ పర్సన్):

• పాఠశాల యాజమాన్య కమిటీలో ఎన్నికైన సభ్యులు (తల్లిదండ్రులు/ సంరక్షకులు) వారిలో నుండి ఒకరిని చైర్ పర్సన్ గా, మరొకరిని వైస్ చైర్ పర్సన్ గా ఎన్నుకుంటారు.
• చైర్ పర్సన్ లేదా వైస్ చైర్ పర్సన్ లలో ఒకరు తప్పక ప్రతికూల వర్గాలకు లేదా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి
• ఇద్దరిలో కనీసం ఒకరు మహిళ అయి ఉండాలి

మెంబర్ కన్వీనర్:
• పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్ (ఎక్స్ అఫీషియో సభ్యుడు) గా వ్యవహరిస్తాడు.

తల్లిదండ్రుల / సంరక్షకుల సభ్యుల ఎన్నిక విధానం


• పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నికను నిర్వహించాలి. ఎన్నికల నిర్వహణకు ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల / సంరక్షకుల సమావేశాన్ని నిర్వహించాలి.
•ఎన్నికలు నిర్వహించడానికి కనీసం 50% మంది తల్లిదండ్రులు/ సంరక్షకులు హాజరవ్వాలి.
• తల్లిదండ్రులను తరగతుల వారీగా కూర్చోబెట్టి ఎన్నికల నియమాలను వివరించాలి.
• తల్లిదండ్రులు/సంరక్షకులు తమ పిల్లలు ఎన్ని తరగతులలో ఉంటే అన్ని తరగతులలో ఎన్నిక విధానంలో పాల్గొనవచ్చును.
•ప్రతి తరగతికి సభ్యులను ఎన్నుకొనుటకు ఓటు వేసే అవకాశం తల్లిదండ్రులలో తల్లి లేదా తండ్రి ఒక్కరికే ఉంటుంది.
⚫సాధారణంగా చేతులు ఎత్తే ప్రక్రియ లేదా చెప్పడం (వాయిస్ ఓట్) ద్వారా ఎన్నిక నిర్వహించాలి. అసాధారణ పరిస్థితులలో బ్యాలట్ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చు.

ఎస్.యం.సి. కాల పరిమితి, ఇతర మార్గదర్శకాలు


• పాఠశాల యాజమాన్య కమిటీలు ప్రాథమిక పాఠశాలల్లో మండల విద్యాధికారుల మరియు ఇతర పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా రద్దుపరచబడినట్లుగా ప్రకటించే వరకు నిరంతరం నిర్వహించబడుతాయి.
• ఎన్నికైన సభ్యుడి పదవీ కాలం 2 సంవత్సరాలు.
• ఒక వేళ ఆ సభ్యుడి కుమారుడు/కుమార్తె ఆ పాఠశాల నుండి వెళ్ళిపోతే ఆ సభ్యుడి పదవీకాలం అంతటితో ముగుస్తుంది.
• అట్టి స్థానాన్ని భర్తీ చేయుటకు ప్రారంభ తరగతిలో లేదా ఖాళీ ఏర్పడిన తరగతిలో ఆ తరగతి పిల్లల తల్లిదండ్రులు/ సంరక్షకులను సభ్యులుగా ఎన్నుకుంటారు.


ఎస్.యం.సి. సమావేశాల నిర్వహణ


• విద్యా సంవత్సరంలో కనీసం రెండు నెలలకు ఒకసారి ఎస్.యం.సి. సమావేశం నిర్వహించాలి.
• విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించాలి.
• విద్యా సంవత్సరం చివరన నిర్వహించే సర్వసభ్య సమావేశంలో విద్యా విషయక ప్రగతి, విద్యా సం.లో నిర్వహించిన కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించాలి.
• ఎవరైనా ఎన్నికైన సభ్యుడు నిర్దిష్ట ఎజెండాతో సమావేశాన్ని నిర్వహించమని కోరిన యెడల, ప్రధానోపాధ్యాయుడు చైర్ పర్సన్ యొక్క ఆమోదంతో సమావేశాన్ని నిర్వహించడం లేదా తదుపరి నిర్ధారిత సమావేశంలో ఆఎజెండా అంశాన్ని చేర్చడం కానీ చేయాలి.
• మధ్యాహ్న భోజనం, విద్యా విషయక రివ్యూలు, గ్రాంటులు & వినియోగం, సామాజిక తనిఖీ అంశాలను నిర్వహించుటకుగాను ఉపకమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చు.










ఉదాహరణకు 

👉ప్రతీ తరగతిలో ముగ్గురు సభ్యులు కావాలి.

1.ప్రతికూల పరిస్థితి ఎదురు కొంటున్న వారు.

అనగా SC , ST వలస వచ్చిన వారు. వీధి బాలలు. HIV బాధితులు.పై విధంగా పిల్లల తల్లిదండ్రుల లో ఒకరు.

2.బలహీన వర్గాలు.

అనగా BC. మైనారిటీ. వార్షిక ఆదాయం 60 వే  లోపు ఉన్న OC వారు. పై వారిలో ఒకరు.

3.జనరల్.

అనగా కులం,మతం తో సంబంధం  లేకుండా తరగతిలో ని పిల్లల తల్లిదండ్రులు  అందరూ. ఇందులో ఒకరు.

   గమనిక

ప్రతీ తరగతి ముగ్గురు సభ్యులలో ఇద్దరు మహిళలు తప్పని సరి. మరి పై మూడింటిలో దేని నుండి ఇద్దరు మహిళలు అనే ప్రశ్న?

ప్రతి తరగతి ఎన్నిక అప్పుడు పై 3 పేర్లతో 3 చిట్టీలు రాసి ఒక చిన్న అమ్మాయితో తీపిద్దాము.

ఉదా:1,3 వెళ్లినవి.అంటే  ప్రతికూల,జనరల్ మహిళ లు మరి 2 వది బలహీన వర్గాలు మహిళ కావచ్చు లేదా పురుషులు కావచ్చు. తల్లిదండ్రులు అందరూ వచ్చారు.


ఇప్పుడు ఒక క్లాస్

రూం లోకి 1 వ తరగతి వారిని పిలిచాం. మొత్తం పదిమంది. 50% లేదా ఎక్కువ ఉంటేనే ఎన్నిక 4 గురే వచ్చారు.ఎన్నిక రేపటికి వాయిదా. OK. అందరూ వచ్చారు. సభ్యుల ఎన్నిక విధానం  వివరిస్తాం.చిట్టీలు వేస్తాం దాని ప్రకారం 3 గురు సభ్యులను ఎన్నుకుంటాం. ఇలా 1 నుండి అన్ని తరగతులు పూర్తి చేయాలి.


♦ఇంకొక విషయం.

ఒక క్లాసు ఎన్నిక. 10 మంది తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నారు. ప్రతికూలం నుండి ఒక్కరు ఎవరు పోటీ చేస్తారు అని అడిగాం.వెంటనే ఇద్దరు మహిళలు లేచారు. వారు కాక 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్. అది చేతులు ఎత్తటమా,రహస్య ఓటింగా. 2 వది,3వది కూడా మొత్తం ఆ పది మంది తో ఎన్నుకోవాలి.

♦సభ్యులను ఎన్నుకోవడం లో కొన్ని సూచనలు.

1.ప్రతీ విద్యార్థి తల్లి లేక తండ్రి ఎవరో ఒకరు మాత్రమే ఒక తరగతిలో ఎన్నికల్లో పోటీకి మరియు పాల్గొనుటకు అవకాశం కలదు.

2.ఒక వేళ ఇద్దరు పిల్లలు ఒకే కుటుంబం వారు వేరు వేరు తరగతి లో ఉన్నారు. తల్లి ఒక తరగతిలో,తండ్రి ఒక తరగతి లో సభ్యులు గా ఉండవచ్చు లేదా ఓటింగ్ లో పాల్గొనవచ్చు. అంటే ఇద్దరికి అవకాశం కలదు.

3.కానీ ఒక తరగతిలో పోటీ ఓడిపోతే మళ్ళీ అతడే ఇంకో తరగతిలో పోటీ చేసే అవకాశం లేదు.

*♦మరి పిల్లలు తక్కువ ఉంటే*

     *EX:ఒక బడి లో*

🔶 1 లో 2, 2 లో 3 , 3 లో 2 , 4 లో 3, 5 లో 6గురు పిల్లలు ఉన్నారు మరి ఎలా? ,1 లో ఇద్దరు సభ్యులే, 2లో ముగ్గురు సభ్యులే, 3 లో ఇద్దరూ సభ్యులే, 4 లో ముగ్గురూ సభ్యులే. కానీ 5 లో 6 గురు ఉన్నారు కాబట్టి ఎన్నిక పెట్టి 3 గురు సభ్యులను ఎన్నుకోవాలి. అంటే ముగ్గురు అంతకన్నా తక్కువ మంది ఉంటే అందరూ సభ్యులే. 4లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నిక పెట్టాలి.

🔶ఇంకో ఉదాహరణ🔶

    ♦ఒక బడిలో

🔷1 లో 10, 2 లో 9, 3 లో 4, 4 లో 9, 5 లో 7 ఉన్నారు. 1,2,4,5 ఎన్నికకు సమస్య లేదు.

👉కేవలం 3 తరగతి సమస్య.దీనిలో కూడా3 గురు పోటీ చేస్తే సమస్య లేదు 3 గురు సభ్యులు. లేదా 4 గురు పోటీ చేస్తామని నిలబడ్డారు. ఓటింగ్ పెట్టాలి. అదేంది 4 గురు పోటీ చేస్తుంటే మరి ఓటు వేసేది ఎవరు? ఇక్కడ 4 తరగతి లో ఉన్న 9 మంది సభ్యులను కేవలం ఓటింగ్ కోసం ఉపయోగించు కొని 3 గురు సభ్యులను ఎన్నుకోవాలి.

*♦ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక*

ఇద్దరిలో ఒకరు మహిళ తప్పనిసరి. ఇద్దరూ మహిళలు ఐనా మంచిదే. చైర్మన్ BC ఐతే వైస్ చైర్మన్ SC


పాఠశాల యాజమాన్య కమిటీ విధులు

• బడి పనితీరును పర్యవేక్షించడం

• బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి సిఫారసు చేయడం

• సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం లేదా ఏ ఇతర వనరుల నుండి అయినా అందిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం

• క్రియానుగత సమీక్షల ద్వారా పాఠ్య ప్రణాళిక ఉద్దేశ్యాల సాధన, చదవడం, రాయడం, సరళ గణిత పరిజ్ఞానం, అవగాహన వంటి అంశాల్లో ప్రతి తరగతిలో పిల్లల అభ్యసన ఫలితాలను విద్యార్థుల నుండి రాండమ్ గా ఎంచుకొని ప్రదర్శించమనడం

• పిల్లల, ఉపాధ్యాయుల గైర్హాజరుపై శ్రద్ధ చూపడం, ముఖ్యంగా పిల్లల గైర్హాజరును తగ్గించే చర్యలను చేపట్టడం

• పాఠశాలలో పరిసర ప్రాంత బాలలు నమోదై, ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యేట్లు చూడడం

పాఠశాల యాజమాన్య కమిటీ విధులు

• ఆవాస ప్రాంతంలోని 6-14 సం.ల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వలస కుటుంబాల పిల్లలందరి పూర్తి వివరాల జాబితాను నిర్వహించడం

• అందరు పిల్లలూ పాఠశాలలో నమోదై, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేటట్లు చూడడం.

• బడి బయటి పిల్లలు వయస్సుకు తగిన తరగతిలో నమోదు అయ్యేట్లు చూడాలి.అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం.

• హాజరు, బోధనా సిబ్బంది మరియు యితర సిబ్బంది అందుబాటుపై సమీక్ష నిర్వహించడం, పర్యవేక్షణ చేయడం.

• మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పర్యవేక్షించడం

• పాఠశాల వార్షిక ఖర్చు, ఆదాయ వివరాలను రూపొందించడం

• వినియోగ ధృవపత్రాలను సమర్పించడం.

• గ్రాంటులు, నిధుల ఖాతాలను ఆడిట్ చేయించడం


SMC ఎన్నికలకు కావాల్సిన ఫారం లు

📥 ఆహ్వాన పత్రం లు

📥 నోటిఫికేషన్

📥 షెడ్యూల్

📥 పవర్ పాయింట్ ప్రజెంటేషన్

📥 ఫారం లు ఎడిట్ చేయడం వీలు అయ్యే డాక్యుమెంట్ 

📥 అన్ని రకాల ఫారం లు pdf లో















Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night