Type Here to Get Search Results !

Instructions to SSC Invigilators in Telugu

SSC Invigilator లకు సూచనలు

 📱Invigilators ఎవరు కూడా examination centre కు cell phone  తీసుకురావద్దు.

1. ఇన్విజిలేటర్లు పరీక్ష రోజు  8:30am కు సెంటర్ లో ఉండాలి.

2. అమ్మాయిలను మహిళ ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాలి  

3. ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది

4.ఇన్విజిలేటర్ అందరు కూడా 9am లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి

5. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి

6. విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి

7.OMR Sheet లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి. తమాదే అని సరిచేసుకోవాలి

8.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి

9. విద్యార్థులు OMR పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్దారించుకొని సంతకం చెయ్యాలి.మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి

10. 9.25am లోగా స్టిక్కర్స్ వేయడం సైన్  చేయడం అయిపోవాలి

11. సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి.

12. OMR షీట్ పైన Answer Sheet నంబర్ వేయించాలి

13. ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No. వేయమని చెప్పాలి.

14.స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి

15. మ్యాప్, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి.

16. ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి invigilator సంతకం చేయాలి

17.విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు ఒకవేళ  టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి.

18. ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు.

19. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి

20.స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి.

 21.ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి

 22.ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంతవరకు సహకరించాలి

23. ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు

24.ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లను మారకూడదు

25 ఏదైనా  అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్లాలి

26.ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు

27. గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది

 28.మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి

29. ప్రశ్నా పత్రములు అదే రోజున కు సంబంధించినవా? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి

 30.రాంగ్ క్యూస్షన్ పేపర్ వస్తే CS లేదా DO లకు రిటర్న్ చేయాలి

31. ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు
 
32.ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేట్ గా వస్తే సి ఎస్ /DO తెలియజేయాలి

33. ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్విజిలేటర్ సంతకం చేయాలి.

 34.ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూ నట్లు గమనిస్తే సి CS, DO లకు తెలియజేయాలి. వెరీ ఇంపార్టెంట్

35. దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి

36 ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాగ్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి

37. మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది

38. పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే tag చేయించాలి

39.OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి

40. ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు

41. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి

42.సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా?లేదా? అని పరిశీలించాలి

43. ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది

44. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, మ్యాప్, లపై పూర్తి సంతకం చేయాలి..
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night