Guruvu.In

Free Student's and Teacher's Identity Cards for Government Schools in Telangana and Andhra Pradesh

 *Free Students, Teachers ID Card ( TS & AP )*

👉 తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ లు, వివిధ రకాల హాస్టల్ ల విద్యార్ధుల గుర్తింపు కార్డు లను ఉచితంగా డౌన్ లోడ్ చేయుటకు సూచనలు.

సూచనలు


1. ముందుగా మీ రాష్ట్రం యొక్క విద్యార్ధుల గుర్తింపు కార్డు లింక్ పై క్లిక్ చెయ్యండి. ఈ లింక్ లను ఇదే పేజీ లో ఇవ్వబడ్డాయి.
2. ఒకే పేజీ లో ఎనిమిది మంది విద్యార్ధుల గుర్తింపు కార్డు లు వస్తాయి (ఖర్చు తగ్గుటకు ఇలా చేయడం జరిగింది.) కాబట్టి, ముందుగా మీ పాఠశాలలోని ఏదైనా ఒక తరగతి లో గల మినిమం ఎనిమిది మంది విద్యార్ధుల వివరాలు ఒక్కొక్కటీ గా నమోదు చేయండి.
3. విద్యార్థుల వివరాలు నమోదు చేయుటకు వారి PEN నంబర్ తప్పని సరి. PEN నంబర్ అనగా విద్యార్థులకు జాతీయ స్థాయి లో UDISE వారు కేటాయించినది. ఇది UDISE వెబ్ సైట్ లో ఉంటుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రం లో విద్యార్ధుల హాజరు ను FRS ఆప్ లో నమోదు చేస్తున్నారు. కావున, ఈ PEN నంబర్ లు FRS ఆప్ లో కూడా ఉంటాయి.
4. నమోదు చేసే సమయంలో విద్యార్థుల ఫోటో సైజ్ 50 kb ల కన్నా తక్కువ ఉండాలి. మన ఫోన్ లో తీసిన ఫొటోలు చాలా ఎక్కువ సైజ్ లతో ఉంటాయి. ఇప్పుడు అన్ని ఫోన్ లలో ఫోటో సైజ్ తక్కువ చేసే అవకాశం ఉంది. ఒక వేళ అది ఎలా చేయాలో తెలియక పోతే, ఈ పేజీలోనే ఫోటో ల సైజ్ తక్కువ చేసే వెబ్ సైట్ లింక్ ను ఇచ్చాము. అందులో ఫోటో అప్ లోడ్ చేయగానే సైజ్ తగ్గిన ఫోటో ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ అవుతోంది. 
5.ముందుగా, విద్యార్థుల అందరి ఫోటో లు తీసుకొని, వాటి సైజ్ లు తగ్గించుకుని పెట్టుకోవాలి.
6. రిజిస్టర్ ముందు పెట్టుకుని ఒక్కొక్కటి గా, విద్యార్ధుల వివరాలు అనగా, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, అడ్మిషన్ తేదీ, ఫోన్ నంబర్ లతో పాటు. మీ పాఠశాల UDISE code ను నమోదు చేయండి 
7. ఇలా అన్ని ఆన్లైన్ చేశాక, క్రింద ఇచ్చిన డౌన్ లోడ్ లింక్ పై క్లిక్ చేసి ఒక్క సారి ఎనిమిది మంది విద్యార్ధుల PEN నంబర్ లు నమోదు చేసి క్లిక్ చేయగానే, ఆ ఎనిమిది మంది విద్యార్ధుల గుర్తింపు కార్డు లు ఒకే పేజీ లో వస్తాయి. ప్రింట్ తీసుకోవాలి.
8. ప్రింట్ తీసుకునే సమయంలో, A4 paper ను సెలెక్ట్ చేసుకుని ప్రింట్ సెట్టింగ్ ను సరి చూసుకోండి. 8 కార్డు లు ఒకే పేజీ లో వచ్చేలా ప్రింట్ సెట్ చేసుకోండి.
9. ఈ కాలంలో చాలా స్కూల్ లో కంప్యూటర్ లు, ప్రింటర్ లు ఉన్నాయి. లేని స్కూల్ వారు తమ complex లో కూడా తీసుకోవచ్చు. ఇలా అయితే ప్రింట్ ఖర్చు మిగులుతుంది.
10. ప్రింట్ తీసుకున్న తర్వాత, బయట ఒకే పేజీ లో ఎనిమిది కార్డు లు వచ్చేలా ల్యామినేషన్ చేయిస్తే మంచిది. ల్యామినేషన్ అయ్యే ఖర్చు ₹ 20 అనగా ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చు కేవలం ₹ 2.5 /- మాత్రమే, అన్ని బుక్ స్టాల్ లో id లకు పెట్టే చిన్న క్లిప్ లు తక్కువ ధర కే దొరుకుతాయి.
11. కేవలం 4 రూపాయలకే విద్యార్థులకు డిజిటల్ కలర్ ఐడెంటిటీ కార్డు లను ఇవ్వవచ్చు.
12. గమనిక : ఈ వివరాలు, ఫోటో లు ఈ వెబ్ సైట్ లో కొంత కాలం పాటు మాత్రమే ఉంటాయి. ప్రతి ఆదివారం డిలీట్ చేయబడతాయి.
13. మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. కావున మీ అభిప్రాయాలు సలహాలు క్రింద గల కామెంట్ box లో రాయండి.
14. మీ అభిప్రాయాలు సలహాలు మేరకు మార్పులు చేయబడతాయి.
15. ఇది ఎంతో మంది కి అవసరం కావున షేర్ చెయ్యగలరు.
16. లామీనేషన్ చేయించే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసి హెడ్ మాస్టర్ సంతకం చేయడం తప్పని సరి.

Free Students ID Card ( TS )


👉 *ఈ క్రింద క్లిక్ చేసి మీ విద్యార్థుల ఫోటో, పేరు, పుట్టిన తేది, అడ్మిషన్, ఫోన్, PEN ( UDISE site లోనిది ) నంబర్, నమోదు చేయగానే, ఒకే పేజీ లో 8 విద్యార్థుల గుర్తింపు కార్డు ల ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ లోనూ, కంప్యూటర్, ట్యాబ్ లలో పని చేస్తుంది. ప్రింట్ తీసుకుని లామినేషన్ చేస్తే ఒక్కో విద్యార్థికి కేవలం ₹ 3.00 ల ఖర్చు అవుతుంది.*

👉 *నమోదు కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి*


📥 *కార్డు లను డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింద క్లిక్ చేయండి*


👉 *పైన నమోదు చేసే సమయంలో మీ ఫోటో సైజ్ 50kb కన్నా తక్కువ ఉండాలి. ఈ క్రింద క్లిక్ చేసి మీ ఫోటో సైజ్ ను 50kb కన్నా తక్కువ చేసుకోవచ్చు.*

https://www.guruvu.co.in/gen/50kb/



👉 *Free Students ID Card ( AP )*


👉 *ఈ క్రింద క్లిక్ చేసి మీ విద్యార్థుల ఫోటో, పేరు, పుట్టిన తేది, అడ్మిషన్, ఫోన్, PEN ( UDISE site లోనిది ) నంబర్, నమోదు చేయగానే, ఒకే పేజీ లో 8 విద్యార్థుల గుర్తింపు కార్డు ల ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ లోనూ, కంప్యూటర్, ట్యాబ్ లలో పని చేస్తుంది. ప్రింట్ తీసుకుని లామినేషన్ చేస్తే ఒక్కో విద్యార్థికి కేవలం ₹ 3.00 ల ఖర్చు అవుతుంది.*

👉 *నమోదు కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి*


📥 *కార్డు లను డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింద క్లిక్ చేయండి*


🙏 *మా వాట్స్ అప్ నంబర్ 9494362244 మీ గ్రూప్ లో కలపండి లేదా గ్రూప్ లింక్ ను మాకు పంపండి.*

👉 *Free Digital TS Teacher ID Card*

👉 *ఈ క్రింద క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగానే, QR కోడ్ తో గల డిజిటల్ ఉపాధ్యాయ గుర్తింపు కార్డు ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ లోనూ, కంప్యూటర్, ట్యాబ్ లలో పని చేస్తుంది. కేవలం ఒక సారి నమోదు చేసి ఎప్పుడైనా ఎన్ని సార్లు అయిన మీ ఎంప్లాయ్ id ఎంటర్ చేసి ఉపాధ్యాయ గుర్తింపు కార్డు ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*

👉 *నమోదు కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి*

https://guruvu.co.in/ts/teacher_id_card

📥 *ఉపాధ్యాయ గుర్తింపు కార్డు ను ఉచితంగా డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింద క్లిక్ చేయండి*

https://guruvu.co.in/ts/teacher_id_card/search.html

👉 *పైన నమోదు చేసే సమయంలో మీ ఫోటో సైజ్ 50kb కన్నా తక్కువ ఉండాలి. ఈ క్రింద క్లిక్ చేసి మీ ఫోటో సైజ్ ను 50kb కన్నా తక్కువ చేసుకోవచ్చు.*

https://www.guruvu.co.in/gen/50kb/


👉 *AP Teacher ID Card*

👉 *ఈ క్రింద క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగానే, QR కోడ్ తో గల ఉపాధ్యాయ గుర్తింపు కార్డు ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ లోనూ, కంప్యూటర్, ట్యాబ్ లలో పని చేస్తుంది. కేవలం ఒక సారి నమోదు చేసి ఎప్పుడైనా ఎన్ని సార్లు అయిన మీ ఎంప్లాయ్ id ఎంటర్ చేసి కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*

👉 *నమోదు కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి*

https://guruvu.co.in/ap/teacher_id_card/

📥 *కార్డు ను డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింద క్లిక్ చేయండి*

https://guruvu.co.in/ap/teacher_id_card/search.html

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts