Frequently Asked Questions on Pension Rules in Telugu

*🔥పెన్షన్ రూల్స్ పై ప్రశ్నలు-జవాబులు*

1. ప్రశ్న:
 *సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి నిర్లక్ష్యము కారణంగా లేక రిటైర్ అయిన తరువాత రీ-ఎంప్లామెంట్ తీసుకొన్న కాలంలో నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వానికి నష్టం జరిగింది అని తేలితే ప్రభుత్వము పెన్షన్ ను నిలుపుదల/రద్దు చేయవచ్చా?*

జవాబు:
 *చేయవచ్చు.*
 *[రూలు 9 (i)]*

••••••••• 

2. ప్రశ్న:
 *అలా నిలుపుదల / రద్దు చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ ను సంప్రదించాలా?*

జవాబు:
 *తప్పక సంప్రదించాలి, కాని పెన్షనరు తప్పుచేసాడని ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ ను సంప్రదించే అవసరం లేదు.*
 *[రూలు9 (i)]*

•••••••••

3. ప్రశ్న:
*ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను పెన్షనరుకు చెల్లించే కరువుభృతి (Dearness Relief) నుండి రికవరీ చేయవచ్చా?*

జవాబు:
 *చేయవచ్చు. (GO.Ms.No. 227, Fin. (Pen-I) Dept., dt. 29-5-2001*
 *రూలు -9, Executive Instructions (vi)*

••••••••• 

4. ప్రశ్న:
*పెన్షనర్/ ఉద్యోగిపై మోపిన చార్జీలు రద్దు అయిన సందర్భంలో అతనికి చెల్లించాల్సిన పెన్షనరి బెనిఫిట్స్ పై వడ్డీ చెల్లించవచ్చా?*

జవాబు:
*కొన్ని నిబంధనలకు లోబడి చెల్లించవచ్చు.*
*G.O.Rr.No. 1034, Fin & Plg. (FW Pen-I) Dept. Dr. 9-6-2000.*
*రూలు--9. Executive Instructions (v) (b)*

•••••••••

5. ప్రశ్న:
*ఉద్యోగి పదవీ విరమణ పొందు నాటికి ఏవైనా డిపార్టుమెంటు ప్రొసీడింగులు పెండింగ్ వుండి, ఏవైనా రికవరీలు చేయాల్సివస్తే రికవరీ నుండి మినహాయింపబడిన టెర్మినల్ బెనిఫిట్స్ తెలపండి?*

జవాబు:
 1) *ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (FBF)*
 2) *జి.ఐ.ఎస్. (GIS)*
 3) *జి.పి.యఫ్ (GPF)*
 4) *టి.ఎస్.జి.ఎల్.ఐ (TSGLI) రూలు-9 Executive Instructions (vii) 2(a)*

••••••••• 

6. ప్రశ్న:
*ఉద్యోగి పదవీ విరమణ పొందునాటికి 'సస్పెన్షన్' లో వున్నచో అతనిని పదవీ విరమణ పొందటానికి అనుమతించవచ్చా?*

జవాబు:
*అనుమతించవచ్చును, కాని పెన్షన్ ప్రయోజనాలు, ఆ కేసులు మొత్తం పూర్తి అయ్యేంతవరకు విడుదల చేయరాదు.*
 *రూలు -9, Executive Instructions (vii) 2*

7. ప్రశ్న:
*పెన్షన్ లెక్కించడానికి ఆరంభమయ్యే సర్వీసు ఎప్పటినుండి మొదలౌతుంది?*

జవాబు:
 *మొట్టమొదటి నియామకం జరిగిన రోజునుండి మొదలౌతుంది. అట్టి నియామకం టెంపరరీ అయినా పర్మనెంట్ అయినా, సబ్ స్టార్టివ్ అయినా / అఫిసియోటింగ్ అయినా కావచ్చు.*
 *(రూలు -13.)*

••••••••••••••••••••••••••••

8. ప్రశ్న:
   *18 సంవత్సరాల వయస్సు నిండకముందు చేసిన సర్వీసు పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
 *పరిగణించరు.*
 *[రూలు 13 (బి) ]*

••••••••••••••••••••••••••••

9. ప్రశ్న:
   *లాస్ట్ గ్రేడ్ సర్వీసుగా కన్వర్టు అయిన ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులు, కన్వర్టు కంటే ముందు చేసిన సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
 *పరిగణిస్తారు.*
 *[రూలు 14 Executive Instructions (i) (d)]*
*GO.Ms.No.38,F&P(EW.PRC-iv) Dept.,Dt.1-2-1980.*
*GO.Ms.No.9,F&P(FW.PRC-iv) Dept.,Dt.8-1-1981.*
*GO.Ms.No.156,F&P[F.W.Pen-I) Dept.,Dt.29-4-1983.*

•••••••••••••••••••••••••••••

10. ప్రశ్న:
   *ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు ప్రభుత్వోద్యోగులుగా మారకముందు చేసిన సర్వీసు పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
 *పరిగణిస్తారు.*
 *[రూలు 14 Executive Instructions (ii) (c)]*
*GO.Ms.No.130,I&P(Ser.V) Dept., Dt.18-3-1981.*
*Govt.Memo.No.1464/Ser.V/2/87-1,I&PDept., Dt.23-11-1982.*
*GO.Ms.No.169,Irrigation(Ser.V)Dept., Dt.3-4-1984..*

•••••••••••••••••••••••••••

11. ప్రశ్న:
    *GO.Ms.No.212, Fin&Plg. (Fw-PC III) Dept., dt. 22-4-1994. ప్రకారము రెగ్యులరైజ్ అయిన డైలీవేజ్ ఉద్యోగులు/ ఎన్.ఎమ్.ఆర్ లు వారి యొక్క ముందు సర్వీసు (రెగ్యులరైజ్ కాక ముందటి) పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*పరిగణించరు. రెగ్యులరైజ్ అయిన తేదీనుండి చేసిన సర్వీసునే పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారు.* 
*రూలు -14. Executive Instructions (iv)*
*Govt.Memo No.573/225/A3/PCIII/97, Dt.1-9-1997 of F&P Dept.,*

••••••••••••••••••••••••••••••

12. ప్రశ్న:
    *వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు (రెగ్యులరైజ్ కాకముందు) ప్రభుత్వ ఉద్యోగులుగా మారక ముందు చేసిన సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణించాలంటే నిబంధన ఏమిటి?*

జవాబు:
*ప్రభుత్వ ఉద్యోగిగా మారకముందు చేసిన సర్వీసుకు సంబంధించిన ఉద్యోగి యొక్క ఇ.పి.ఎఫ్ మొత్తం ప్రభుత్వ పద్దులో జమచేయమని హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ను కోరాలి. అలా జమచేస్తేనే ఆ సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారు. అంతేకాకుండా జమచేసిన రోజు నుంచి మాత్రమే సర్వీసు రెగ్యులరైజేషన్ మొదలవుతుంది.*
*రూలు-14 Executive Instructions (V)*
*Govt. Cir.Memo No.1941-A/31/A2/Pen.I/97, Dt.3-10-1997 of F&P(FW-Pen-I) Dept.*


13. ప్రశ్న:
    *కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమునకు పర్మినెంట్ గా బదిలీ అయిన వారికి కేంద్రప్రభుత్వ సర్వీసు పెన్షన్ లెక్కించడానికి వీలవుతుందా?*

జవాబు:
*వీలవుతుంది, కాని బదిలీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకము ఉండరాదు. అలాగే డిపుటేషన్లో (Deputation) పని చేస్తున్న వారికి ఈ పెన్షన్ రూల్సు వర్తించవు.*
*(రూలు - 15 )*

••••••••••••••••••••••••••••

14. ప్రశ్న:
    *అప్రెంటిస్ గా చేసిన కాలమును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*పరిగణించరు, కాని ఉపాధ్యాయులకు మాత్రము వారి అప్రెంటిస్ కాలమును పెన్షనుకు లెక్కించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.* *రూలు -16 GO.Ms.No. 2, Edn. (SWES PPIII) Dept., dt. 5-1-2004. Memo No. 8663/Ser-I/2010 dt. 1-7-2010of S... dept.,*

•••••••••••••••••••••••••••••

15. ప్రశ్న:
   *మొట్ట మొదటగా ఒక వ్యక్తికి కాంట్రాక్టు ద్వారా ఎంపిక / పనిచేయించుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగములో నియమింపబడితే, ఆ కాంట్రాక్టు సర్వీసు పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?* 

జవాబు:
*కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.*
*[రూలు 17 (1) (ఎ) (బి) 2,3.]*

•••••••••••••••••••••••••••••

16. ప్రశ్న:
   *ఏదైనా ఉద్యోగము చేస్తూ, కాంపన్జేషన్ (Compensation) పెన్షన్ లేక ఇన్వాలిడ్ (Invalid) పెన్షన్ లేక కంపన్సెషన్ గ్రాట్యూటీ లేక ఇన్వాలిడ్ గ్రాట్యూటీగా రిటైరై తిరిగి రెగ్యులర్ ఉద్యోగానికి ఎంపిక అయితే ఆపాత సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.*
*[రూలు 18 (1) (2) (3) (4) (5). ]*

•••••••••••••••••••••••••••••

17. ప్రశ్న:
    *సివిల్ ఉద్యోగములోనికి రాకముందు చేసిన మిలిటరీ సర్వీసు, పెన్షను, లెక్కించడానికి పరిగణిస్తారా?* 

జవాబు:
*కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.*
*[ రూలు 19 (1) (2) (3) (4) (5). ]*

••••••••••••••••••••••••••••••

18. ప్రశ్న:
*సివిల్ ఉద్యోగములోనికి రాకముందు చేసిన 'వార్ సర్వీస్' (War Service in Military) పెన్షనన్ను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.*
*[రూలు 20 (1) (2).]*


19. ప్రశ్న:
*సస్పెన్షన్ (Suspension) కాలము పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*ఎంక్వైరీ ముగిసిన తరువాత అతనిపై మోపిన అభియోగాలు ఎటువంటివి నిర్ధారణ కాకపోవడం, మొత్తాన్ని రద్దు చేయడం అట్టి సందర్భంలోనే సస్పెన్షన్ కాలమును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారు. లేకపోతే పరిగణించరు. కాని Competent Authority తన ఉత్తర్వులో సస్పెన్షన్ కాలాన్ని, పెన్షనుకు లెక్కించమని ప్రత్యేకంగా తెలిపినప్పుడు లెక్కిస్తారు.*
*రూలు-23.*

•••••••••••••••••••••••••••••••

20. ప్రశ్న:
*ఉద్యోగమునుండి తొలగింపబడిన (Remove or Dismissal) వ్యక్తి యొక్క పాత సర్వీసు పెన్షను దామాషాలో పెన్షను మంజూరు చేయాలా?*

జవాబు:
*చేయకూడదు. మొత్తం పాత సర్వీసు రద్దు అవుతుంది.*
*రూలు-24.*

••••••••••••••••••••••••••••••

21. ప్రశ్న:
*ఉద్యోగము నుండి తొలగింపబడిన ఉద్యోగి (Dismissed, Removed or Compulsory retired from service) అప్పీలు ద్వారా కాని, రివ్యూ ద్వారా కాని, తిరిగి ఉద్యోగములోనికి తీసుకొంటే/ నియమిస్తే, పాత సర్వీసును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*పరిగణిస్తారు కాని, తొలగించబడిన, మరియు తిరిగి నియామకం చేసిన మద్య కాలాన్ని పెన్షను లెక్కించడానికి పరిగణించరు. అలాగే సస్పెన్షన్ కాలము కూడా పెన్షను లెక్కించడానికి పరిగణించరు అయితే, Competant authority తన ఉత్తర్వు ద్వారా ఆ కాలాన్ని duty కాని/ leave గా కాని మంజూరు చేస్తే అప్పుడు పరిగణిస్తారు.*
*రూలు 25 (1) (2).*

••••••••••••••••••••••••••••••

22. ప్రశ్న:
*ఉద్యోగానికి రాజీనామా చేస్తే అంతకు ముందు చేసిన సర్వీసును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?*

జవాబు:
*పరిగణించరు. కాని ఇతర ఉద్యోగంలో చేరడానికిగాను అనుమతి తీసుకొని రాజీనామా చేస్తే అప్పుడు రాజీనామా కంటే ముందు చేసిన సర్వీసు కూడా పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారు.*
*రూలు-26 (1).*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts