జిల్లా విద్యాశాఖాధికారి సూర్యాపేట గారి ఉత్తర్వులు :
2.9. Spl/03/2023,
66: 22.08.2024
విషయం:- స్థాపన - పాఠశాల విద్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనముగా ఉన్న ఉపాధ్యాయులను జిల్లాలో అవసరమైన పాఠశాలలకు తాత్కాలిక పని సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయుట గురించి.
:- 1. G.O.Ms.No.25, SE (Ser.I) Dept., Dt:12.08.2021 రేషనలైజేషన్ నిబంధనలు.
2. జిల్లాలోని సంబంధిత HMల నుండి స్వీకరించబడిన ప్రాతినిధ్యం.
3. పని సర్దుబాటు 23 మండలాల MEOల ప్రతిపాదనలు Google స్ప్రెడ్ షీట్‌లో సమర్పించబడ్డాయి.
4. కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, సూర్యాపేట నోట్ ఆమోదం Dt: 20.08.2024
ఉపరియుక్త విషయానుసారము శ్రీయుత జిల్లా కలెక్టర్, సూర్యాపేట నోటు ఆమోదము మేరకు జిల్లా లో అనుగుణముగా అదనముగా ఉన్న ఉపాద్యాయులను జిల్లాలో అవసరమైన పాఠశాలకు లిస్ట్ లో చూపిన విధముగా ఉపాద్యాయులను తాత్కాలిక పని సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం అయినది.
కావున సంబంధిత మండల విద్యాదికారులకు /స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లను ఆదేశించునది ఏమనగా, లిస్ట్ లో చూపిన విధముగా ఉపాద్యాయులను నూతనంగా తాత్కాలిక పని సర్దుపాటు చేయబడిన పాఠశాలలో విధులు నిర్వించునట్లుగా చూడవలసినదిగా ఆదేశించనైనది. మరియు ఇట్టి ఉత్తర్వులో పేర్కొనిన తాత్కాలిక పని సర్దుపాటు చేయబడిన ఉపాద్యాయులను ఆయా పాఠశాల నుండి విడుదల కాని యెడల వారిపై CCA రూల్స్ ప్రకారముగా క్రమశిక్షణ చర్యలు గైకొనబడునని తెలియజేస్తూ ఆచరణ నివేధిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునకు సమర్పించవలసినదిగా కొరనైనది. తదుపరి పై ఉత్తర్వులు అమలు పరచని యెడల తదుపరి పరిణామలకు సంబంధిత మండల విద్యాదికారులు/ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లు పూర్తిగా భాద్యులు అగుదురని తెలియజేయనైనది.
Encl: పని సర్దుబాటు జాబితా
Sd/-, 5.5, జిల్లా విద్యాశాఖాధికారి సూర్యపేట
// అనుమతితో/
.
సహాయ సంచలకులు 0/0. జిల్లా విద్యాశాఖాధికారి
ప్రతి:
1.సంబంధిత మండల విద్యాదికారులకు / స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు తదుపరి చర్య నిమిత్తం
2. శ్రీయుత జిల్లా కలెక్టర్, సూర్యాపేట గారికి తగు సమాచార నిమిత్తం సమర్పించనైనది.
3. సందాలకులు పాఠశాల విద్య, తెలంగాణ హైదరాబాద్ గారికి తగు సమాచార నిమిత్తమై సమర్పించనైనది.
Please give your comments....!!!