ఈ అన్ని అంశాలతో పాటు ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఒక కొత్త విధానానికి రూపకల్పన చేసింది. పలు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులతో చర్చించి దీనిని రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.
*ఈ ప్రతిపాదనలోని కీలక అంశాలు*
- తెలంగాణలో ప్రస్తుతం 3,06,000 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2,88,415 పింఛనర్లు ఉన్నారు.
- ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం ప్రస్తుతం దాదాపు నెలకు రూ.40 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది.
- నూతన ఈహెచ్ఎస్‌లో ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి నగదురహిత వైద్యం అందించాలి.
- వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితి(సీలింగ్) విధించవద్దు.
- అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ విధానం అమలు చేయాలి.
- ప్రధాన కార్డుదారు సహా ఆరుగురు కుటుంబసభ్యులకు ఈహెచ్ఎస్ సదుపాయం కల్పించాలి.
- ఈహెచ్ఎస్ కోసం మొత్తం ఎంత ఖర్చు అవుతుందో ఈహెచ్ఎస్ లేదా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్(ఏహెచ్‌సీటీ) ఖరారు చేయాలి.
- ఈ మొత్తంలో 50 శాతం ప్రభుత్వం భరించాలి. మిగతా 50 శాతం ఉద్యోగులు, పింఛనర్ల నుంచి తీసుకోవాలి.
- ఉద్యోగ, ఉపాధ్యయులు, పింఛనర్లు చెల్లించే మొత్తం వారి పే స్లిప్ లేదా పింఛన్ స్లిప్‌లో 'డిడక్షన్స్'గా నమోదు కావాలి. అలాగే, ప్రభుత్వం చెల్లించే మొత్తం కూడా 'ఎర్నింగ్స్'లో నమోదు చేయాలి.
- సంబంధిత డీడీఓ లేదా పీఆర్ఓ ఈ మొత్తాన్ని ప్రతినెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలి.
- సమాన చెల్లింపు, సమాన సదుపాయాలు అనే పద్ధతి ఆధారంగా ఈ విధానం పని చేస్తుంది. ఎవరైన ఉద్యోగికి అదనపు, ప్రత్యేక వైద్య సేవలు, సదుపాయాలు కావాలని అనుకుంటే వారి వాటాకు అదనంగా చెల్లించాలి.
- ప్యాకేజ్‌లు, చికిత్సలకు అయ్యే ధరలను ఆసుపత్రులకు చెందిన సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో ఈహెచ్ఎస్ చర్చించి ఖరారు చేయాలి.
- ప్రభుత్వం ఆమోదించిన అన్ని ఎన్‌పానెల్డ్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య పరీక్షలు మొదలుకొని మందుల వరకు ఇన్-పేషెంట్, ఔట్-పేషెంట్ సేవలను పూర్తి నగదురహితంగా అందించాలి.
- రాష్ట్రం బయట చికిత్స పొందేందుకు ముందుగా ఈహెచ్ఎస్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ కమిటీ ఈహెచ్ఎస్ అమలును పర్యవేక్షించాలి.
- లబ్ధిదారులు అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
- ఆసుపత్రుల సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఈ విధానం అమలు కోసం మార్గదర్శకాలను వైద్య శాఖ జారీ చేయాలి.
- కొత్త విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఏడాది వరకు ప్రస్తుత మెడికల్ రీయింబర్స్‌మెంట్ విదానం కూడా అమలులో ఉండాలి. ఆరు నెలల తర్వాత రెండు విధానాల అమలును స్టీరింగ్ కమిటీ సమీక్ష జరపాలి.-
కార్యక్రమంలో డా.నిర్మల, కె.రామకృష్ణ, డా.కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, డా.వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేష్ పాక, రామ్ ప్రతాప్ సింగ్, గోవర్ధన్. పాండు, దీపక్, తదితరులు పాల్గొన్నారు.
Please give your comments....!!!