💥*Attention*💥
As per 1) GO MS No.21, School Edn.(Program-1) Dept., Dt.30.07.2024
& 2) SPD, SS LR.No.2751/SS/CW/2024, Dt: 02.08.2024
ప్రకారం అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మరియు మోడల్ స్కూల్స్ లలో ...
- మరుగుదొడ్ల నిర్వహణకు,
- పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు,
- పాఠశాలలోని మొక్కలకు నీరు పోయుటకు
ప్రత్యేకంగా *School Facility Maintenance Grant* ను పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా విడుదల చేయడం జరిగినది.
1-30 (3000 per month)
31-100 (6000 pm)
101-250 (8000 pm)
251-500 (12000 pm
501-750 (15000 pm)
Above 750 (20000 pm)
పైన పేర్కొన్న విధంగా ఒకటి రెండు రోజులలో AAPC అకౌంట్ నందు (1st Quarter) జమ చేయబడతాయి.
ప్రధానోపాధ్యాయులందరూ ఇప్పటికే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్వీస్ పర్సన్స్ ను నియమించుకొని పాఠశాలను, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారని భావిస్తున్నాము.
ఒకవేళ ఇప్పటికీ ఎవరినైనా నియమించుకొనకపోతే, వెంటనే రేపటి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో AAPC ఆధ్వర్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్వీస్ పర్సన్ ను నియమించుకొని, వారి వివరాలను ఎంఈఓ గారికి, జిల్లా విద్యాశాఖ కార్యాలయమునకు పంపించగలరు.
సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు మెయిల్లో పెట్టిన గూగుల్ షీట్లో ఉన్న స్ప్రెడ్ షీట్ లో ప్రతి స్కూలు లోని కోరిన వివరాలను రేపు మధ్యాహ్నం లోగా తప్పనిసరిగా నిర్ధారించవలెను.
గ్రామంలోని వ్యక్తులను సర్వీస్ పర్సన్ గా తీసుకునే సందర్భంలో... వారి యొక్క విధులను, వారు పనిచేసే సమయాన్ని స్పష్టంగా తెలియపరచగలరు.
అలాగే ఇది పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఉద్యోగంగా పరిగణించరాదు.
కేవలం వారి సేవలను మాత్రమే (10 నెలలు మాత్రమే) వినియోగించుకొనబడతాయని తెలియజేయగలరు.
పని విషయంలో అలసత్వం వహించినా, సమయపాలన పాటించకపోయినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా వెంటనే విధుల నుంచి తొలగించబడునని స్పష్టంగా తెలియపరచగలరు.
అలాగే వారికి ఇచ్చేటువంటి డబ్బులను విత్ డ్రా చేసి ఇవ్వాలి. అంతేకానీ సంబంధిత వ్యక్తి పేరు మీద Cheque ఇవ్వడం గానీ, డబ్బులు డ్రా చేయడం గాని చేయకూడదు.
ఇప్పటివరకు చాలా పాఠశాలల్లో అటెండర్లు, స్వీపర్లు లేకపోవడం వలన పాఠశాల పరిసరాలు, టాయిలెట్స్ చాలా అపరిశుభ్రంగా మారిపోయి చాలా అసౌకర్యంగా ఉండేది. పాఠశాల నిర్వహణ కూడా చాలా కష్టంగా ఉండేది.
ప్రస్తుతం టాయిలెట్లు, పాఠశాల పరిశుభ్రత నిర్వహణ కొరకు ప్రత్యేకంగా నిధులు మంజూరు కావడం చాలా సంతోషం.
ఇకనుండి పాఠశాలలో ఎక్కడా చెత్త చెదారం, బూజు, దుమ్ము, ధూళి లేకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. పాఠశాల ప్రాంగణంలోని చెట్లకు ప్రతిరోజు నీరు పోస్తుండాలి. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ చాలా కీలకమైనది.
పర్యవేక్షణలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారి గారు, ఇతర అధికారులు పాఠశాలను సందర్శించిన సమయంలో పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోయినా, నాటిన మొక్కలు ఎండిపోయినా ప్రధానోపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.
అలాగే సర్వీస్ పర్సన్ కి డబ్బులు ఇచ్చిన సమయంలో ఓచర్ మీద సంతకం చేయించుకుని భద్రపరచుకొనగలరు.
మన పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి మంజూరు కాబడిన నిధులతో క్రింది విధముగా వ్యక్తులు నియమించుకొని, సేవలు వినియోగించుకోగలరు.
Rs.3000 లకు ఒకరు
(1 - అన్ని పనులు)
Rs.6000 & 8000 లకు ఇద్దరు
( 1 - School Cleaness +
1 - Toilets Cleaning & Watering the Plants)
Rs.12000 & 15000 లకు 3గురు
(1 - School Cleanliness +
1 - Toilets Cleaning +
1- Watering the Plants)
Rs.20000 లకు 4గురు
(2 - School Cleanliness +
1 - Toilets Cleaning +
1 - Watering the Plants)
School maintenance grant క్రింద ఇస్తున్న ఈ నిధులను వాడే విషయంలోనూ పరిసరాలను పరిశుభ్రపరిపించే విషయంలోనూ ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన దానిసంబంధిత ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వారు మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్ళు బాధ్యతను వహించవలసి ఉంటుంది.
జిల్లా విద్యాశాఖ అధికారి
కరీంనగర్ జిల్లా.
Please give your comments....!!!