Type Here to Get Search Results !

How many casual leaves will get DSC 2024 teachers details in Telugu

నేడు పాఠశాల విధులలో చేరుతున్న ఉపాధ్యాయులకు ఎన్ని సీఎల్స్ (Casual Leaves) ఉంటాయని కొందరు అడుగుతున్నారు. 

ఇప్పటికే విధులలో ఉన్నవారు 15 సీఎల్స్ + 7 స్పెషల్ సీఎల్స్ మొత్తము 22 సీఎల్స్ ఉపయోగించుకోవచ్చు. మహిళా ఉపాధ్యాయులు మరొక 5 సీఎల్స్ అధనంగా అనగా 27 సీఎల్స్ వినియోగించుకుంటారు.

నేడు పాఠశాల విధులలో చేరుతున్న ఉపాధ్యాయులకు దామాషా ప్రకారం సెలవు లెక్కిస్తారు. ఈ క్యాలెండర్ ఇయర్ లో వీరికి రెండున్నర నెలల సర్వీసు ఉన్నందున పురుష ఉపాధ్యాయులకు 4.58 సవరించగా 5 సీఎల్స్ వస్తాయి. మహిళా ఉపాధ్యాయులకు 5.63 సవరించగా 6 సీఎల్స్ వస్తాయి. వాటిని అవసరం మేరకు ప్రధానోపాధ్యాయుల అనుమతితో వినియోగించుకోవచ్చు

తర్వాత క్యాలెండర్ ఇయర్ లో వీరందరూ మిగితా ఉపాధ్యాయుల లాగ పూర్తి స్థాయిలో సీఎల్స్ వినియోగించుకోవచ్చు.

సందేహాలు - సమాధానాలు

 1ప్రశ్న.DSC -24 ద్వారా నియామకమైన మహిళా ఉద్యోగి. పాఠశాలలో రిపోర్టు చేసినా 2 రోజుల తర్వాత ప్రసూతి సెలవులు ఇవ్వవచ్చునా?

2 ప్రశ్న: పురుష ఉద్యోగి భార్య.  ఉద్యోగి పాఠశాలలో రిపోర్టు చేయకముందే ( నెల ముందే ) డెలివరీ అయినది.. వారు పితృత సెలవులు తీసుకోవచ్చునా?

3 ప్రశ్న: మహిళా ఉద్యోగి ప్రసూతి అనంతరం... కొత్తగా ఉద్యోగంలోకి చేరినది వారికి కూడా.. ప్రసూతి సెలవులు ఇవ్వవచ్చునా?

 సమాధానం:
1➡️DSC -24 ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం Date of delviery or before (4weeks)నుండి Maternity leaves ఇవ్వవచ్చు.. కావున ప్రసూతి సెలవులు అనుమతించండి  ( 1 or 2 ఇయర్స్ సర్వీస్ నిబంధన ఏమీ లేదు ).

2➡️ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము.. ప్రభుత్వ పురుష ఉద్యోగి భార్య డెలివరీ అయిన తేదీ నుండి ఆరు నెలల లోపు పితృత సెలవులు వాడుకోవచ్చు అని ఉంది...  కావున ఉద్యోగి వాడుకోవచ్చు
(Date of delivery రోజు నుండి ఇవ్వాలి నిబంధన లేదు).

3➡️ మహిళ ఉద్యోగి ఉద్యోగం రాకముందే..delivery అయినారు కావున... Go లో నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవులు పొందలేరు.
 కేవలం child care leaves మాత్రమే పొందగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.