Type Here to Get Search Results !

How to get salary of the DSC 2024 appointed teachers step by step procedure in Telugu and related forms in PDF

*🔊నూతన ఉపాధ్యాయులు వేతనాలు పొందటానికి ప్రాసెస్:-*

➡️ *నూతనంగా జాయిన్ అయినా ఉపాధ్యాయులకు ముఖ్యమైన సూచనలు:-*

👉 *మొదటగా ఎంప్లాయిస్ ID పొందటానికి అప్లికేషన్ తో పాటు సంబంధిత పత్రాలను జత చేసి సంబంధిత DDO ల ద్వారా ఫార్వార్డ్ చేసి STO ద్వారా DTO గారి కార్యాలయం లో సబ్మిట్ చెసినచో ఎంప్లాయిస్ ID అలాట్ చేయబడుతుంది.*

👉 *ఎంప్లాయిస్ ID పొందిన తర్వాత CPS PRAN నెంబరుకై అప్లై చేయాలి. S1 ANEXURE అనే PRAN అప్లికేషన్ ను నింపి కలర్ ఫొటోలు అంటించి సంబంధిత DDO ల ద్వారా ఫార్వార్డ్ చేసి సంబంధిత STO ల ద్వారా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో గల PRAN హెడ్ ఆఫీస్ కు పంపించాలి Speed Post కూడా చేయవచ్చు. 4 సెట్స్ నింపి సంబంధిత పత్రాలను జత చేయాలి.*

👉 *CPS PRAN నెంబర్ వచ్చాక శాలరీ బిల్లులు చేసుకోవచ్చు.బిల్లు ఆన్లైన్ చేసేటప్పుడు జనరేట్ అయినా షెడ్యూల్స్, విద్య అర్హతల పత్రాలు, అపాయింట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మొ,, నవి పత్రాలు జతచేసి సంబంధిత DDO ల ద్వారా అటెస్టేషన్ చేయించి రెండు సెట్ ల బిల్లులు సబ్మిట్ చేయాలి.*

*జీతం బిల్లులు మంజూరు అయ్యాక సర్వీస్ బుక్ ఓపెన్ చేయవచ్చును*

*🏵️DSC-2024 ద్వారా నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశిస్తున్న సీపీఎస్ ఉపాధ్యాయులు Employee I'd పొందే విధానం:*

 ప్రతి నూతన ఉపాధ్యాయుడు Employee ID కొరకు పై Employee Id Form ను Fill చేసి మీ DDO Covering Letter తో DTO లో Submit చేసి Acknowledgment తీసుకోగలరు.

*సూచన:* Employee I'd వస్తేనే మీ రెగ్యులర్ జీతం చేయడానికి వీలవుతుంది. కావున గమనించగలరు.

*Enclosures:*
1.SSC Memo (D.O.B)
2.Joining Order Copy
3.Aadhar Copy with Signature
4.Bank pass book First Page/Cancelled Cheque
5.PAN Copy with Signatur

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

*🏵️సందేహాలు - సమాధానాలు.*
*🌼 సర్ మా పాఠశాలకు ఇద్దరు నూతన ఎస్జీటీ ఉపాధ్యాయులు వచ్చారు. వారిలో ఎవరి పేరు రిజిస్టర్ లో ముందు రాయాలి. రోస్టర్ ప్రకారమా, ర్యాంకు ప్రకారమా?*
*✅ర్యాంకు ప్రకారం రాయాలి.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.