Guruvu.In

Project Works: 5th class Telugu project work for formative assessment 4 to be conducted in February

PROJECT WORK 5th Class Telugu for FA 4


Name: ______________________________________
Class: 5th Class 
School: _______________________________________
Subject: తెలుగు 
Lesson : గోపి డప్పు
Name of the Test: Formative Assessment - 4
Name of the Project: సంగీత వాయిద్యాలు 
Marks : 10 Marks 
Date : ...../ 02 / 202.... ( To be conducted before Feb 28st )

Q1 సంగీత వాయిద్యాలు బొమ్మలు సేకరించండి. మీకు నచ్చిన ఒక సంగీత వాయిద్యం గురుంచి రాయండి. ? 10 Marks

సంగీత వాయిద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు

తంత్రీ వాయిద్యాలు : తీగ లతో వాయించేవి (ఉదా: వీణ, తంబూరా, సంతూర్, వయోలీన్, సరోద్, సితార, సారంగి, కడ్డీవాయిద్యం మొదలైనవి)
సుషిర వాయిద్యాలు : గాలిని ఊది వాయించేవి (ఉదా: వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరశింగ్ మొదలైనవి)
అవనద్ధ వాయిద్యాలు : చర్మాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: మృదంగం, డోలు, ఢమరుకం, మద్దెల, తబలా, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాయిద్యం మొదలైనవి)
ఘన వాయిద్యాలు : ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇవి తాళం ననుసరించు వాయిద్యాలు (ఉదా: తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చురుతలు, మోర్సింగ్, మంజిర మొదలైనవి)


 వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి 

ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇంగ్లీషులో దీన్ని ఫ్లూట్ అంటారు. ఇది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురుతో తయారు చేస్తారు. ఊదేందుకు పీకలాంటివి ఉండని వాద్యపరికరం ఇది. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు, వేళ్ళతో మూసి తెరిచేందుకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.
www.Guruvu.In

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts