Type Here to Get Search Results !

Science Seminar Guidelines in Telugu for the academic year 2024-25


👉అన్ని యాజమాన్య పాఠశాలల అప్పర్ ప్రైమరీ హై స్కూల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా నవంబర్( తేదీలు స్థలం తరువాత)లో జిల్లా స్థాయి సైన్స్ ఎక్సిబిషన్ (2024-25) మరియు INSPIRE ప్రదర్శన (2023-24 ) నిర్వహిస్తున్నట్టు ఇందుమూలముగ ప్రకటించడం జరుగుతుంది.

*జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్. (2024-25)*

*Main Theme (ప్రధాన అంశము)*:
 *Science and Technology for Sustainable Future*
((*సుస్థిర అభివృద్ధిలో (స్థిరమైన భవిష్యత్తు నిర్మించడంలో) శాస్త్ర సాంకేతిక పాత్ర*))
 
*Sub Themes (ఉప అంశాలు)*:
1. Food, Health and Hygiene,( ఆహారం ,ఆరోగ్యం - పరిశుభ్రత) 
2. Transport and Communication (రవాణా సమాచార రంగం) 
3. Natural Farming (వ్యవసాయం సేంద్రియ పద్ధతులు)
4. Disaster management (విపత్తుల నిర్వహణ)
5. Mathematical Modeling and computational Thinking (గణిత నమూనాలు కాంపిటేషనల్ థింకింగ్)
6. Waste Management (వ్యర్ధాల నిర్వహణ)
7. Resource Management.(వనరుల నిర్వహణ)

పైన తెలిపిన అంశాలే కాకుండా ప్రధానాంశమునకు అనుగుణంగా ఏదైనా నూతన ఆవిష్కరణలు చేయవలెను.

*టీచర్ Exhibits* నందు నూతన ఆవిష్కరణలతో కూడిన భోదనా అభ్యాసనా సామాగ్రిని ప్రదర్శించవచ్చును.

*B.Ed &.D.Ed* ట్రయినీ విద్యార్థులు కూడా నూతన ఆవిష్కరణలతో కూడిన భోదనా అభ్యసనా సామాగ్రిని ప్రదర్శించవచ్చును.

*ONE DAY SEMINAR*
ప్రదర్శనలో విద్యార్థులకు రెండవ రోజు  సాయంత్రం *Millets for Sustainable Future and Health*  అను అంశం తో *సెమినార్* నిర్వహించబడుతుంది.

*జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ (2024-25)* నందు ప్రతి ప్రదర్శనకు ఒక విద్యార్థి మరియు ఒక గైడ్ టీచర్ పాల్గొనవలెను.

Note: ప్రదర్శన వెంట ఒక విద్యార్థి మరియు ఒక పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడి/ ఉపాధ్యాయురాలిని మాత్రమే అనుమతించబడును.

👉అదే విదంగా జిల్లా స్థాయి *INSPIRE ప్రదర్శన* (2023-24) ను కూడా జిల్లా స్థాయి సైన్స్ ఎక్సిబిషన్ (2024 - 25 ) తో పాటు నిర్వహించబడును. 

👉INSPIRE (2023-24) లో జిల్లా స్థాయి కి ఎంపిక కాబడిన *119* *(*ప్రాజెక్ట్స్*)* మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. వారికి వారియొక్క బ్యాంకు ఖాతాలలో ప్రదర్శన కోసం  డబ్బులు జమ అయినవి. కావున వారి యొక్క సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్ మరియు గైడ్ టీచర్ ప్రత్యేక శ్రద్ద వహించి ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి ఇన్స్ పైర్ ప్రదర్శన (2023-24) లో ఎంపికైనా 119  ప్రాజెక్ట్స్ లతో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవలెను. ప్రతి ప్రదర్శనకు  ఒక విద్యార్థి మరియు ఒక గైడ్ టీచర్ పాల్గొనవలెను.

Note: ఒక పాఠశాల నుండి ఎన్ని ఎగ్జిబిట్స్ తీసుకువచ్చిన ఒక గైడ్ టీచర్ మాత్రమే పాల్గొనాలి.


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night