Type Here to Get Search Results !

Casual Leaves and General Holidays in House hold Survey

 *సాధారణ సెలవు -వివరణ*

*సర్వే లో పాల్గొంటున్నా ఉపాధ్యాయులకు.. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు/ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాధారణ సెలవు నిరా కరిస్తున్నారు / నిరాకరించవచ్చునా?*

 ➡️చాలామంది ప్రధానోపాధ్యాయులు/ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మీరు సర్వే డ్యూటీ లో ఉన్నారు.. లీవ్ ఇవ్వడం కుదరదు..మీరు OD లో ఉన్నారు.అని నిరాకరిస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు.

➡️ సర్వే సమయంలో లీవ్ ఇవ్వకూడదని ఇలాంటి ఉత్తర్వులు లేవు.

✅ ఉపాధ్యాయుడు ప్రస్తుతము డ్యూయల్ వర్క్ చేస్తున్నారు. తరగతి బోధన మరియు సర్వే పనులు..

✅ ఉపాధ్యాయులను పాఠశాల నుండి రిలీవ్ చేసి పూర్తిగా సర్వే పనులకు వినియోగించడం లేదు అని గుర్తుపెట్టుకోవాలి.

➡️లీవ్ అనేది ఉద్యోగి హక్కు/ సౌలభ్యం.. ఆకస్మికంగా ఇబ్బంది ఏర్పడితే వాడుకునే అధికారం ఉంటుంది.

➡️ సర్వే అనేది 15 రోజులపాటు జరుగుతుంది.. ఉద్యోగికి కేటాయించిన ఇండ్ల సర్వే పూర్తి చేస్తే సరిపోతుంది.మీ EB సూపర్వైజర్ కు సమాచారం ఇవ్వండి.

➡️ ఉపాధ్యాయులు కూడా ఛాన్స్ ఉంది అని.. ఒకరోజు కంటే ఎక్కువ లీవ్ తీసుకోకండి.రోజు వారి ఇండ్ల సర్వే.. రిపోర్టు అధికారులు అడుగుతారు.

 ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం...
 సర్వే డ్యూటీలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు.. ఈనెల 30వ తారీకు వరకు ఎలాంటి.. ప్రభుత్వ సెలవులు లేవు..

*✅ ఆదివారం /జనరల్ హాలిడే తో సహా ప్రతిరోజు సర్వే చేయాలి. కోల్పోయిన ఈ సెలవులకు గాను... ఉద్యోగికి *పరిహార సెలవులు* (CCL's)ఇవ్వడం జరుగుతుంది.

*✒️ సంధి శ్రీనివాస్ రెడ్డి*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night