1. ప్రశ్న :: 2009 నుంచి 2011 వరకు ఉన్న జనరేట్ అయిన ఆధార్ కార్డ్స్ లో దాదాపు కేవలం year of birth మాత్రమే ఉంది. దాని వలన సరైన date of birth ను identify చేయలేక APAAR generation కావడం లేదు.
సమాధానము ::
• బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉన్నచో ఆ విధముగా ఆధార్ అప్డేట్ చేయించుకోవలెను
• బర్త్ సర్టిఫికేట్ లేకున్నచో, విధిగా లేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ అప్డేట్ చేయించుకోవలెను
2. ప్రశ్న::కొన్ని చోట్ల అడ్మిషన్స్ సమయంలో మరియు TC ఇచ్చే సందర్భంలో వివరాలు తెలుగులో వుండటం వల్ల వాటిని ఇంగ్లీషులో రక రకాల స్పెల్లింగ్ తో రాయటం వల్ల ఆధార్ లోని వివరాలు సరిపోవడం లేదు
సమాధానము ::
•• Rc.No.ESE02-22/39/2024-TB SEC-CSE, dated: 07/11/2024 మేరకు తల్లిదండ్రుల డిక్లరేషన్ మేరకు మరలా Admission Register ను సవరించి తద్వారా UDISE PORTAL లో MIS login లో సవరణలు చేసి APAAR జనరేట్ చేయవచ్చు.
3 ప్రశ్న::పుట్టిన తేదీ ఆధార్ కార్డ్, Date of Birth Certificate మరియు అడ్మిషన్ రిజిస్టర్ లో వేరుగా ఉండటం.
సమాధానము ::
బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఆధార్ అప్డేట్ చేసుకొని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు మేరకు అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పు చేసుకోగలరు
4 ప్రశ్న::గ్రామీణ ప్రాంతాల్లో Date of Birth Certificate పై పేరెంట్స్ కి అవగాహన లేకపోవడం వలన Birth Certificate పొందలేదు.
సమాధానము ::
ఆధార్ లో ఉన్న పుట్టిన తేదీ వాస్తవం అని తల్లిదండ్రులు ధృవీకరిస్తే, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు ప్రకారం సంబంధిత HM/MEO/DY.EO లచే అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పు చేయించుకోగలరు
* అపార్ ఐడి పూర్తి చేయుటకు మరికొన్ని ముఖ్య సూచనలు...*
1. తల్లిదండ్రుల Consent Form కచ్చితంగా పాఠశాలలో ఉండవలెను.
2. కాన్సెంట్ ఫామ్ లేకుండా ఏ ఒక్క ఆధార్ నెంబర్ను ఎవరూ కూడా ఉపయోగించడానికి లేదు. ఇది ఆధార్ నియమ నిబంధనలకు విరుద్ధము. చట్టపరమైన చర్యల తీసుకునే అవకాశం కలదు. కావున ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల అంగీ కార పత్రాన్ని పాఠశాల వారు సేకరించ వలెను.
3. గౌరవ కమిషనర్ గారు అపర్ ఐడి పూర్తి చేయుటకు మార్పులు చేర్పుల కొరకు ఇచ్చిన సర్కులర్ ప్రకారం పాఠశాల రికార్డు నందు మార్పుల కొరకు ఒక క్రమ పద్ధతిని పాటించ వలెను.
4. మార్పు చేయదలచిన పేరు కొరకు తల్లిదండ్రుల అఫిడవిట్ నోటరీ చేయబడి తీసుకో వలెను. మరియు తల్లిదండ్రుల నుండి పేరు మార్పు కొరకు దరఖాస్తులు తీసుకోవలెను.
5. డేట్ అఫ్ బర్త్ మార్పు కొరకు బర్త్డే రిజిస్టర్ సర్టిఫికెట్ తల్లిదండ్రుల నోటరీ చేయబడిన అఫిడవిట్, తల్లిదండ్రులు DOB మార్పు కొరకు కోరే దరఖాస్తు ఉండ వలెను
6. మార్పు చేయుచున్న పేరు, డేట్ అఫ్ బర్త్ అడ్మిషన్ రిజిస్టర్ నందు కొట్టి వేయకుండా, కేవలం రౌండ్ చేసి, వాటి పక్కన కొత్తగా మార్పు చేయుచున్న వాటిని నమోదు చేయ వలెను. కొట్టివేతలు, వైట్ ఫ్లూయిడ్ వాడవద్దు.
7. పాఠశాల రికార్డు నందు మార్పులు చేర్పులు చేయుటకు మార్చి 31,2025 వరకు మాత్రమే అవకాశం కలదు.
8. కావున ఈ సదవకాశాన్ని సక్రమంగా వినియోగించుకో వలెను.
9. ప్రధానోపాధ్యాయులు మార్పు చేసిన విద్యార్థుల పేరు, పాత మార్పు కొత్త మార్పు ఒక పట్టిక రూపంలో తెలియ జేస్తూ అడ్మిషన్ రిజిస్టర్ నందు ఉంచవలెను. విద్యార్థులు మార్పు కొరకు ఇచ్చిన పత్రాలను వారి అడ్మిషన్ ఫారంతో జత పరచ వలెను.
10. భవిష్యత్తు నందు ఈ మార్పులపై ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా తగు జాగ్రత్తలు/ చర్యలు తీసుకుని మాత్రమే మార్పులు చేయ వలెను.
11. ఇలాంటి సందర్భాల్లో పై అధికారుల నుండి సమాచారం సేకరించండి.
12. ముందుగా అడ్మిషన్ రిజిస్టర్, UDISE plus website లో, ఆధార్ కార్డు లో వివరాలు అన్ని సేమ్ మ్యాచ్ అయ్యిన వాటికీ APAAR Card ను జెనరేట్ చెయ్యండి.
Please give your comments....!!!