Guruvu.In

Doubts on APAAR Generation Process - Answers

APAAR జనరేషన్ ప్రక్రియలో సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న :: 2009 నుంచి 2011 వరకు ఉన్న జనరేట్ అయిన ఆధార్ కార్డ్స్ లో దాదాపు కేవలం year of birth మాత్రమే ఉంది. దాని వలన సరైన date of birth ను identify చేయలేక APAAR generation కావడం లేదు.

సమాధానము ::

• బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉన్నచో ఆ విధముగా ఆధార్ అప్డేట్ చేయించుకోవలెను

• బర్త్ సర్టిఫికేట్ లేకున్నచో, విధిగా లేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ అప్డేట్ చేయించుకోవలెను

2. ప్రశ్న::కొన్ని చోట్ల అడ్మిషన్స్ సమయంలో మరియు TC ఇచ్చే సందర్భంలో వివరాలు తెలుగులో వుండటం వల్ల వాటిని ఇంగ్లీషులో రక రకాల స్పెల్లింగ్ తో రాయటం వల్ల ఆధార్ లోని వివరాలు సరిపోవడం లేదు

సమాధానము ::

•• Rc.No.ESE02-22/39/2024-TB SEC-CSE, dated: 07/11/2024 మేరకు తల్లిదండ్రుల డిక్లరేషన్ మేరకు మరలా Admission Register ను సవరించి తద్వారా UDISE PORTAL లో MIS login లో సవరణలు చేసి APAAR జనరేట్ చేయవచ్చు.

3 ప్రశ్న::పుట్టిన తేదీ ఆధార్ కార్డ్, Date of Birth Certificate మరియు అడ్మిషన్ రిజిస్టర్ లో వేరుగా ఉండటం.

సమాధానము ::

బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఆధార్ అప్డేట్ చేసుకొని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు మేరకు అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పు చేసుకోగలరు

4 ప్రశ్న::గ్రామీణ ప్రాంతాల్లో Date of Birth Certificate పై పేరెంట్స్ కి అవగాహన లేకపోవడం వలన Birth Certificate పొందలేదు.

సమాధానము ::

ఆధార్ లో ఉన్న పుట్టిన తేదీ వాస్తవం అని తల్లిదండ్రులు ధృవీకరిస్తే, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు ప్రకారం సంబంధిత HM/MEO/DY.EO లచే అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పు చేయించుకోగలరు

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts